వైసీపీ నాయకురాలు.. ఫైర్‌బ్రాండ్ మంత్రి రోజాపై జనసేనాని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తనపై విమర్శలు చేయడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని.. ఈ జాబితాలో డైమండ్ రాణి రోజా.. కూడా చేరిపోయింది.. అని వ్యాఖ్యానించారు. “డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోంది. నువ్వు కూడానా.. నువ్వు కూడా నా.. ఛీ! నా బతుకు చెడ! మీ కోసం డైమండ్ రాణీలతో కూడా తిట్టించుకుంటా” అని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రజల కోసం.. తాను ప్రతి వెధవ.. సన్నాసితో మాటలు పడుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు. అయినా.. తనకు ఓకేనని.. ప్రజల కోసం ఎన్నయినా.. అనిపించుకుంటానని అన్నారు. అయితే.. ప్రజలు మాత్రం ఆలోచించుకోవాలని అన్నారు. ప్రజల కోసం మాటలు పడుతున్న తన వెంట ఉంటారో ఉండరో.. వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవాలని చెప్పారు. ప్రజలే తన వెంట నిలబడాలని అన్నారు.
గత ఎన్నికలకు ముందు.. రాజాంలో సభ పెడితే.. కిక్కిరిసిపోయేలా జనాలు వచ్చారని.. అయితే.. ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయలేదని పవన్ చెప్పారు. చప్పట్లు కొట్టారు..జేజేలు కొట్టారు.. ఓట్లేసే సమయానికి తనను వదిలేశారని అన్నారు. ఆశయం ఉన్న వారికి అవమానం లేదని.. తానుకూడా అలానే అనుకున్నానని అన్నారు. తనకు ఎంతో డబ్బు ఉందని.. ఎంతో సుఖాలు ఉన్నాయని.. అయినా.. కూడా తాను వాటిని వదిలేసి వచ్చానన్నారు.
శ్రీకాకుళం నుంచి 50 శాతం మంది వలసలు పోయారని.. వారి గురించి మాట్లాడే వారు లేరని.. చెప్పారు. చట్ట సభల్లో ఎదిరించి నిలబడే సత్తా ఉన్నప్పుడే.. నేను నిలబడతానని చెప్పారు. ఓడిపోయావ్.. ఓడిపోయావ్ .. అంటే.. యుద్ధంతాలూకు పరాజయంగానే భావించానన్నారు. ‘నా కడ శ్వాస వరకు రాజకీయాలను వదలను.. ప్రజలను కూడా వదలను’ అని రణస్థలం వేదికగా శపథం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates