వారాహి.. జనసేన అధినేత పవన్ ప్రారంభించేందుకు రెడీ చేసిన వాహనం. దీనిపై అనేక చర్చలు.. విమ ర్శలు.. వివాదాలు కూడా వచ్చాయి. ఏదో ఒక విధంగా అయితే.. వాహనం రెడీ అయింది. కొండగట్టు, విజ యవాడ, అన్నవరం.. క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది.. వారాహి యాత్ర కూడా ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. ప్రజల్లో మార్పు కోసం.. ఈ యాత్రను చేపడుతు న్నారని కూడా ప్రచారం జరిగింది.
ఇక, వారాహి రాకతో రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటాయని కూడా అనుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ యాత్ర విషయంలో అటు పవన్ నుంచి కానీ.. ఇటు నేతల నుంచి కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అంతేకాదు.. అసలు వారాహిని ఎక్కడ ఉంచారో(మంగళగిరిలోని కార్యాలయంలో అంటు న్నా.. అక్కడ లేదు) కూడా తెలియడంలేదు. అయితే.. వారాహి రాకపోవడానికి.. పవన్ ప్రచారం చేయక పోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయనే గుసగుస రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
1) ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం. నిజం చెప్పాలంటే.. వారాహికి పూజలు చేయించి న అనంతరమే దీనిని లైన్‌లో పెట్టాల్సి ఉంది. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేదు. మరి అప్పటికి కూడా ప్రారంభంచలేదు. సో.. దీనివెనుక ఇంకో కారణం ఉందని అంటున్నారు.
2) టీడీపీ యువనాయకడు నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. దీనికి వారాహి యాత్ర పోటీ అవుతుందేమోననే సందేహాలు ఉన్నాయి. అందుకే .. యాత్రను ప్రారంభించలేదనే మరోవాదన కూడా ఉంది. అయినా.. కూడా వారాహి రూట్ మ్యాప్ వేరే గా ఉన్నప్పుడు.. యువగళానికి వచ్చిన ఇబ్బంది లేదని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో ఇంకో కీలక కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు.
3) బీజేపీ పెద్దలు జనసేన అధినేత పవన్‌ను నిలువరించారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా రాజకీయ వర్గాల మధ్య చర్చకువస్తోంది. ఔనన్నా..కాదన్నా.. బీజేపీతో బంధాన్ని తెంచుకునేందుకు పవన్ సుముఖంగా లేరు. దీనికి వేరేకారణాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు ‘ఇప్పుడే వద్దు’ అని చెప్పారని.. తాము ముహూర్తం నిర్ణయించి సమాచారం అందిస్తామని అప్పుడు యాత్ర ప్రారంభిచాలని చెప్పారని.. అందుకే వారాహి యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్నారని అంటున్నారు. ఇదీ.. సంగతి..!