పోలీసులు చేసిన ప్రకటన నిజమే అయితే మావోయిస్టులకు పెద్ద దెబ్బ అనే అనుకోవాలి. మావోయిస్టు కేంద్రకమిటి సభ్యుడు, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరినారాయణ అలియాస్ జగన్ మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కొద్దిరోజులుగా కోవిడ్ తో బాధపడుతున్న జగన్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు బస్తర్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. జగన్ మృతి వార్త వాస్తవమేనని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ కూడా ధృవీకరించారు. …
Read More »ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీం ఊరట.. తాజా ఆదేశాలు ఇవే!
క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఇటీవల కాలంలో తీవ్ర వివాదమైన ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ‘శీను-వాసంతి-లక్ష్మి’ మూవీతో ఫేమస్ అయిన.. నవనీత్‌కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంటులో గట్టి వాయిస్ కూడా వినిపించే నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “మోడీ.. తన మనసులో మాటలు చెబుతున్నారు. కానీ, రైతుల మనసులో మాటలు కూడా వినిపించుకోండి. ఈ ప్రజలు …
Read More »ముంచుకొస్తున్న డెల్టా ఫ్లస్.. ఇది మరీ డేంజర్!
కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం సృష్టించింది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే.. దాని నుంచి కోలుకుంటున్నాం. కాగా.. అంతలోనే.. ఈ మహమ్మారి మరో రూపంలో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. …
Read More »తెలుగు రాష్ట్రాల నుంచి థర్డ్ ఫ్రంట్ లోకి వెళ్లేదెవరు?
ప్రధాని మోడీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతున్న వేళ.. బీజేపీ..కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలన్న తలంపు జాతీయ స్థాయిలో సాగుతోంది. దీని కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు దన్నుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలుస్తున్నారు. ఈ రోజున తన ఇంట్లో జరిగే సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు.. మేధావుల్ని శరద్ పవార్ ఆహ్వానిస్తున్నారు. ఈ మీటింగ్ …
Read More »ఈ విషయం జగన్ గమనించారా?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్షత్రియ సామాజికవర్గం తాజాగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2019 ఎన్నికల్లో క్షత్రియ సామాజికవర్గం దాదాపు వైసీపీకి మద్దతుగా నిలబడింది. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళల్లోనే జగన్ పై సామాజికవర్గం పెద్దల్లో అసంతృప్తి బయలుదేరటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే కచ్చితంగా జగన్ వ్యవహారశైలి అయితే కాదు. కాకపోతే కొందరు మంత్రులు, విజయసాయిరెడ్డి …
Read More »కేసీయార్ టూర్లకు ఈటలే కారణమా ?
మామూలుగా అయితే నెలల తరబడి ఫాం హౌస్ నుండి బయటకే రారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫాం హౌస్ నుండి ప్రగతి భవన్ కు వచ్చినా సెక్రటేరియట్ కు రారని, మంత్రులు, ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో ఉండరనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటి కేసీయార్ ఇపుడు వరుసబెట్టి జిల్లాల్లో టూర్లు చేస్తున్నారు. పైగా వరుసబెట్టి బహిరంసభల్లో కూడా పాల్గొంటున్నారు. విషయం ఏమిటా అని ఆరాతీస్తే బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ దెబ్బే …
Read More »జగన్ విజన్ సూపర్.. చిరు పొగిడేశారు..
“జగన్ విజన్ సూపర్”- ఈ మాట అన్నది ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవే. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో జనగ్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. రాసింది రెండు మూడు లైన్లే అయినా.. భారీ ఎత్తున జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి ఆది నుంచి కూడా జగన్‌పై చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం.. జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందని చిరు పేర్కొని …
Read More »జగన్… ‘దైవదూత’… RRR తాజా లేఖ
వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు..తాజాగా సీఎం జగన్‌కు మరో లేఖను సంధించారు. అయితే.. దీనిలో ఆయన సీఎం జగన్‌ను చాలా చిత్రంగా వర్ణించారు. జగన్‌కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నానని..దైవదూతగా ఆయన నిలిచిపోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ సాకారం కావాలంటే.. జగన్ పాలనలో మూతబడిన అన్నా క్యాంటీన్లను.. పేరు మార్చి అయినా..ప్రారంభించాలని.. రఘురామ సీఎం జగన్‌కు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన అన్న క్యాంటీన్ల బదులు ‘జగనన్న క్యాంటీన్లు’ …
Read More »కేసీఆర్ కు బలమైన కౌంటర్ ఇచ్చేసిన మంత్రి అనిల్
రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని.. కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఏపీ సర్కారు మీద కేసీఆర్ బండలు వేయటం కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ తాజాగా …
Read More »కరోనాతో ఇన్ని లక్షలమంది చనిపోయారా ?
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 15 లక్షలకుపైగా చనిపోయారా ? అవుననే అంటున్నారు ఐఐఎం అహ్మదాబాద్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ చిన్మయ్ తుంబె. ఏ రాష్ట్రం కూడా కరోనా రోగులను, మరణాల అసలు సంఖ్యను బయటపెట్టడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోగులు, మరణాలపై తమ బృందం దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు చెబుతున్న అధికారిక లెక్కల కన్నా కనీసం 15 లక్షలమంది ఎక్కువగా చనిపోయుంటారని చిన్మయ్ …
Read More »మండలి రద్దుకు కట్టుబడుందా ?
అధికార వైసీపీ శాసనమండలి రద్దుకు కట్టుబడుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మీడియాతో సజ్జల మాట్లాడుతు శాసనమండలి రద్దు చేస్తు గతంలో చేసిన తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమన్నారు. ఇదే సమయంలో మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు. శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ శాసనమండలికి వచ్చేసరికి …
Read More »కాంగ్రెస్‌కు ఫ్యూచర్ ఉన్నట్టా? లేనట్టా? మేధావుల మాటేంటంటే!
వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేని ఒక సందిగ్ఢ పరిస్థితి ఎదురైంది. పార్టీ పుంజుకుంటుందా? లేక ఇంతేనా? లేక మరిన్ని ఇబ్బందులు వస్తాయా? ఇదీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని గమనిస్తున్న వారిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నాయకత్వలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ను పరిశీలిస్తే.. ఇది.. ఇందిరా కాంగ్రెస్సేనా? అనే విస్మయమూ వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షురాలు.. సోనియా గాంధీ నేతలను నడిపించలేక …
Read More »