ఔను.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై ఆ జిల్లా TDP తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్ నడుస్తోంది. ఇవి ఎవరికిస్తారు? ఇస్తే.. ఎవరు పోటీ చేస్తారు? పోటీ చేస్తే.. గెలుస్తారా? అసలు మనకు ఛాన్స్ ఉందా? ఇదీ.. ఇప్పుడు ఆ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను వేధిస్తున్న నాలుగు ప్రశ్నలు. ఆ నియోజకవర్గాలే.. తెనాలి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు గుంటూరు తూర్పు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని.. …
Read More »టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి?
తెలుగుదేశం పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగుతున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా బ్యాచ్ కోడై కూస్తోంది. అందులోనూ టీడీపీ పట్టున్న, ప్రతిష్టాత్మకమైన నందిగామ సీటును కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపై పార్టీ వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన కొలికిపూడి.. ఇప్పుడు ఐఎఎస్ …
Read More »ప్రధాని మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇకలేరు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న వాద్‌నగర్ …
Read More »కొత్త ఏడాదిలో అమిత్ షా దండయాత్ర
ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక పక్క పొత్తుల కసరత్తు చేస్తూనే మరో పక్క సొంత బలాన్ని అంచనా వేసుకుంటోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలను ఢిల్లీ పిలిపించుకుంటూ, సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు రూటు మార్చిందని చెబుతున్నారు… జనవరి 8న రాక కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఏపీ పర్యటనకు వస్తున్నారు. కొత్త సంవత్సరంలో …
Read More »నరబలి తో పోల్చిన సజ్జల
దేనినైనా.. తమకు అనుకూలంగా మార్చుకోగల దిట్ట వైసీపీ కీలక నాయకుడు.. సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మాటలు వేడిగా ఉండకపోయినా..వాడిగా ఉంటాయి. ఆయన చించేసుకుని మాట్లాడడు. కానీ, చిరిగిపోయే మాటలే ఎక్కువగా ఉంటాయని పార్టీ నాయకులు అంటుంటారు. తాజాగా టీడీపీ కందుకూరు ఎపిసోడ్‌పై.. ఆయన సుతిమెత్తగానే అయినా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కావాలని.. ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టిందని సజ్జల …
Read More »నా కుర్చీ నాదే.. వైసీపీపై ఆనం ఫైర్
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి Anam Ramanarayana Reddy సొంత ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు. ఎన్నికలు ఇంకా జరగకుండానే.. తనను ఎమ్మెల్యే పదవి నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రాం కుమార్‌రెడ్డి టికెట్ తనకే దక్కుతుందని ప్రచారం చేయడంపై మండిపడ్డారు. తాజాగా… సచివాలయ వాలంటీర్లు, వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన …
Read More »కేసీఆర్ సర్‌కి నిద్ర కూడా పట్టదుగా… అంతలా ఆకాశానికి!!
అదేంటి చిత్రంగా! అనుకుంటున్నారా? అంతే.. ఇప్పటి వరకు ఆయనను తన సొంత పార్టీ వారే పొగుడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని.. తను అనేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఎవరూ పన్నెత్తు పొగడ్త కూడా పొగడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో హఠాత్తుగా.. తాను ఊహించని రీతిలో దేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేసీఆర్‌ను ఏకంగా.. ఆకాశం దాటించి.. అంతరిక్షం వరకు …
Read More »అందరిదీ ఒకే మాట.. ‘స్క్రిప్టు’ రాసిందెవరు?
ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన మృత్యు హేలపై వైసీపీ నాయకులు అందరిదీ ఒకే మాట. మంత్రులు మూకుమ్మడిగా చెబుతున్న మాట.. చేస్తున్న ఆరోపణ.. ‘చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని!’- మరోవైపు.. సీఎం జగన్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. కానీ, మంత్రుల నుంచి నాయకుల వరకు వరుస పెట్టి మాత్రం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది …
Read More »కందుకూరు ఘటన: బాబుకు మోడీ బాసట..
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘోరంపై ప్రధానినరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు బాసటగా ఉంటామని తెలిపారు. అంతేకాదు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన Modi.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేసమయంలో చంద్రబాబు ధైర్యంగా ఉండాలని కూడా మోడీ సూచించారు. ఏం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం …
Read More »శవాల మీద పేలాలు ఏరుకోవడం ప్రారంభం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. రాత్రి పూట చంద్రబాబు వచ్చినప్పుడు అపరిమిత సంఖ్యలో జనం గుమ్మిగూడారు. వెల్డింగ్ షాపుపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కొందరు కింద పడిపోయారు. చంద్రబాబు వారించినా వాళ్లు ఆగలేదు. షెడ్డు రేకులు విరిగిపోవడంతో గుండంకట్ట ఔట్ లెట్ గట్టు మీద నిలబడి …
Read More »ప్రతిపక్షమనే ఉదాశీనతే.. ప్రాణాలు తీసిందా?
ఔను! ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో కందుకూరు నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? భౌతిక కారణం.. అంటే కళ్లముందు మాత్రం.. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారు.. కాబట్టి వేల సంఖ్యలో సభకు జనాలు వచ్చారు.. సో.. తొక్కిసలాట జరిగింది.. అందుకే చనిపోయారు! కానీ, …
Read More »రాహుల్ పెళ్లి.. అమ్మాయి ఇలా ఉండాలట!
పెళ్లి కాని ప్రసాదు.. అంటూ బీజేపీలోని ఓ వింగ్ తరచుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కుటుంబాల్లో ఉండేవారి సమస్యలు ఆయనకు ఏం తెలుస్తాయని అనే వారు కూడా ఉన్నారు. దీనికి కారణం 50 ఏళ్ల వయసు వచ్చేసినా.. రాహుల్ పెట్టిచేసుకోకపోవడమే. అంతేకాదు.. అసలు ఆ ఊసు కూడా ఆయన ఎత్తరు. అయితే, చిత్రంగా ఇప్పుడు ఆయన పెళ్లి మాట ఎత్తారు. ప్రస్తుతం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates