కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం …
Read More »కాంగ్రెస్ అసలు సమస్యేంటో తెలుసా ?
చెప్పుకోవటానికి 100 ఏళ్ళని ఘనంగా చాటుకుంటారు. నిజంగా పార్టీలో నేతలంతా కలిసికట్టుగా ఉంటే అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపించేదే. ఇదే సమయంలో 100 ఏళ్ళు దాటడంతో పార్టీకి వయసైపోయిందని, ఔట్ డేటెడ్ అయిపోయిందని ప్రత్యర్ధులు చెణుకులు విసురుతుండటం అందరు చూస్తున్నదే. ఇదంతా ఏ పార్టీ గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది, అవును జాతీయ పార్టీ కాంగ్రెస్ గురించే. చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో అంతే బలహీనమైపోయింది. …
Read More »కాంగ్రెస్ పెద్దలకు సర్ ప్రైజ్ ఆఫర్ ఇస్తున్న రేవంత్
అనేక చర్చోపర్చలు, ఆసక్తికర పరిణామాల తర్వాత టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం పూర్తయిన సంగతి తెలిసిందే. పలువురు నేతలు ఈ నియామకంపై తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం వారిని వ్యక్తిగతంగా కలిసిన రేవంత్ ఈ మేరకు కలిసికట్టుగా పనిచేసేందుకు ఒప్పించారు. ఇలా ఐక్యతారాగం వినిపించడంలో విజయం సాధించిన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ పెద్దలను ఖుష్ చేసే పనిలో పడ్డారు. దీనికి తెలంగాణ జన సమితి రథసారథి ప్రొఫెసర్ …
Read More »డెల్టా కన్నా ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్..!
కరోనా మహమ్మారి మనల్ని ఇప్పట్లో వదిలేలా కనపడటం లేదు. కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ లో కలవరం సృష్టించిన డెల్టా వేరియంట్.. ఎంత మంది ప్రాణాలను తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా తగ్గిపోగానే.. డెల్టా ప్లస్ రాబోతోందని.. అది థర్డ్ వేవ్ కి సంకేతమని చెప్పారు. థర్డ్ వేవ్ భయంలో ఉన్న ప్రజలపై మరో పిడుగులాంటి వార్త పడింది. ఈ …
Read More »ఆ చాన్స్ కొట్టేసిన ఏకైక నేత కిషన్ రెడ్డి మాత్రమే
గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చను నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ విస్తరణ చేప్టటారు. ఇందులో తెలంగాణకు భారీ తీపికబురు దక్కింది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకు ఆయనకు మంత్రిత్వ శాఖ ఖరారు కానప్పటికీ రెండు ప్రధాన శాఖల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మంత్రి పదవి ద్వారా ఓ ప్రత్యేక …
Read More »లేని పార్టీని చూసి భయపడుతున్న టీఆర్ ఎస్ నేతలు.. రీజనేంటి?
తెలంగాణ అధికార పార్టీ నేతలు.. మంత్రులు.. కొన్ని రోజులుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. ఆయనను నీటి దొంగ అని ఒకరంటే.. కాదు.. గజ దొంగ అని మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇంకొందరు.. ఏకంగా ఆయనను నరరూప రాక్షసుడని.. కూడా అనేశారు. నిజానికి తెలంగాణ వాదంతో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఏడేళ్ల తర్వాత.. ఇప్పుడు వైఎస్‌ను తిట్టాల్సిన అవసరం ఏంటి? ఏపీ-తెలంగాణల మధ్య నీటి …
Read More »మంత్రి రేసులో ముగ్గురు కృష్ణా నేతలు…!
ఏపీ కేబినెట్ ప్రక్షాళన విషయంపై సీఎం జగన్ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదు. కానీ, కేబినెట్లో సీటు దక్కించుకు నేందుకు మాత్రం నేతలు పరుగులు పెడుతున్నారు. ఒకరిని మించి మరొకరు మంత్రి వర్గంలో స్థానం కోసం కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు కృష్ణాజిల్లా నుంచి ఒకరి పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. …
Read More »కేసీఆర్ ఆగస్టులో ముహూర్తం పెట్టేశారా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ కోసం ముహూర్తం పెట్టేసినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కటే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ కేబినెట్లో కేసీఆర్ కాకుండా ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్‌ను భర్తరఫ్ చేశారు. ఇప్పటికే కేసీఆర్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. చివరి ఆరు నెలలు వదిలేస్తే మరో రెండేళ్ల పాలన మాత్రమే ఉంటుంది. ఈ సారి కేబినెట్ ఎన్నికల కేబినెట్ అవుతుంది. మరో ట్విస్ట్ …
Read More »మమతకు షాక్ తప్పదా ?
క్షేత్రస్ధాయిలో జరగుతున్న పరిణామాల కారణంగా చాలామందిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ తో సుప్రింకోర్టులో దాఖలైన కేసుపై విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో బెంగాల్లో గొడవలు జరిగాయని, చాలామంది ఆస్తులను, ప్రాణాలను కోల్పోయారని, అత్యాచారాలు కూడా జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. సో జరుగుతున్నదంతా చూస్తుంటే ఎప్పుడో రోజు మమత బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తారేమో అనే అనుమానాలు …
Read More »ఈ సీటును మైనార్టీలకు ఫిక్స్ చేసిన బాబు ?
తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీ తరఫున ఎందరో ముస్లిం నాయకులు ఉంటారు. ఇక ఉత్తరాంధ్రాలో తీసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున్ ముస్లింలు ఉన్నారు. వారిలో మెజార్టీ ముస్లింలు విశాఖ సౌత్ లో ఉన్నారు. ఈ సీటు వారికి ఒక విధంగా కంచుకోట అని చెప్పాలి. గతంలో టీడీపీ విశాఖ వన్ గా ఈ స్థానం ఉన్నపుడు మాజీ …
Read More »జగన్ సర్కారుతో మళ్లీ పవన్‌కు పంచాయితీనే
కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజైనపుడు ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ల రేట్ల విషయమై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. ఇంకే సినిమాకూ లేని విధంగా ఈ సినిమాకు మాత్రమే ఆ విషయంలో నియంత్రణ తీసుకొచ్చారు అధికారులు. థియేటర్ల మీద దాడులు చేసి దశాబ్దం కిందటి రేట్లతో టికెట్లు అమ్మించారు. మరీ …
Read More »టీఆర్ఎస్లో ఈ నేతల పొలిటికల్ రూటు ఎటో ?
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఏడేళ్లుగా ఎంతో మందిని నయానో… భయానో పార్టీలో చేర్చేసుకుంటోంది. పదవులు కావాలన్న వారికి పదవులు… కాంట్రాక్టులు కావాలన్న వారికి కాంట్రాక్టులు.. లొంగని వారిపై అనేక ఒత్తిళ్లు.. పార్టీ కండువా కప్పడానికి టీఆర్ఎస్ ఇవే ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. పార్టీలోకి వచ్చాక కొద్ది నెలల పాటు వీరిని అందలం ఎక్కించడం.. ఆ తర్వాత క్రమక్రమంగా పక్కన పెట్టేయడం కూడా గులాబీ పార్టీలో కామన్ అయిపోయింది. …
Read More »