Trends

మోదీ సేనలోకి మరో సీనియర్ క్రికెటర్

క్రికెట్ కెరీర్ లు గుడ్ బై చెప్పిన అనంతరం కొందరు ఆటగాళ్లు డైరెక్ట్ గా పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో గంభీర్, మనోజ్ తివారి లాంటి ప్లేయర్స్ బాగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా మాజీ ఆటగాడు కెదార్ జాదవ్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. 2024లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఆల్‌రౌండర్ తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాడు.  …

Read More »

ఆసుపత్రి పాలైన అలేఖ్య చిట్టి

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ అని ప్రస్తావించినందుకు ఓ కస్టమర్‌ను అలేఖ్య చిట్టి దారుణమైన బూతులు తిట్టేయడం.. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి తీవ్రమైన వ్యతిరేకత రావడం.. పాత ఆడియోలు, వీడియోలు సైతం బయటికి వచ్చి అలేఖ్య చిట్టి సిస్టర్స్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం.. ఫలితంగా వాళ్ల బిజినెస్సే మూత …

Read More »

తిలక్ రిటైర్డ్ ఔట్ పై క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. హార్దిక్ పాండ్య (42), తిలక్ వర్మ (56) పోరాడినప్పటికీ.. గెలవలేకపోయారు. కాగా, గత మ్యాచ్‌లో తిలక్‌ వర్మ ‘రిటైర్డ్‌ ఔట్‌’ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పించగా… ఇప్పుడు హార్దిక్‌ పాండ్య ఆ వ్యూహానికి అసలు కారణాన్ని …

Read More »

ఏపీ కియా కంపెనీలో మిస్టరీ దొంగతనం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కారు తయారీ సంస్థ కియా మోటార్స్‌లో సంచలనాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీలో దాదాపు 900 కారు ఇంజిన్లు మాయం కావడంతో పెద్ద కలకలం రేగింది. కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా కార్ల తయారీలో ఉపయోగించే ఈ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తుంటాయి. అయితే ఈసారి వచ్చిన లోడ్‌లో చాలా …

Read More »

తెలంగాణ హైకోర్టు : దిల్‌షుక్ న‌గ‌ర్ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష‌

2013, ఫిబ్ర‌వ‌రి 21 నాటి దిల్‌షుక్ న‌గ‌ర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్ ఐఏ కోర్టు ఇప్ప‌టికే విధించిన ఉరి శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2016 లోనే దీనిపై విచార‌ణ‌ను పూర్తి చేసిన ఎన్ ఐఏ కోర్టు.. దోషులకు ఉరి శిక్ష విధించింది. అయితే.. దోషులు.. ఈ తీర్పును స‌మీక్షించి.. త‌మ‌ను ఉరి శిక్ష నుంచి త‌ప్పించాల‌ని …

Read More »

మార్కెట్ పతనం.. భారత సంపన్నులు ఎంత కోల్పోయారు?

ఒక్క రోజు మార్కెట్ పతనంతో ప్రపంచ కుబేరులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం స్టాక్ మార్కెట్లను హడలెత్తించింది. దాంతో పాటు దేశీయంగా కూడా మార్కెట్లు నేలచూపులు చూశాయి. దీంతో భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు తమ సంపదలో భారీగా కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే భారత కుబేరులు …

Read More »

10,000 ఏళ్ల తరువాత పునర్జన్మించిన నక్కలు.. ఎలా సాధ్యమైంది?

అమెరికాలోని శాస్త్రవేత్తలు చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయాన్ని తిరిగి రాశారు. ఐస్ ఏజ్‌లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో గర్జించిన ‘డైర్ వుఫ్స్‌’కు సంబంధించిన జీనెటిక్స్‌ను తిరిగి సృష్టించడంలో ఘన విజయాన్ని సాధించారు. కోలస్సల్ బయోసైన్సెస్‌ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధకులు జీన్లు సవరించి, మూడు డైర్ వుఫ్‌లలాంటి నక్క పిల్లలను అభివృద్ధి చేశారు. వీటి వయస్సు మూడు నుండి ఆరు నెలల మధ్య ఉండగా, ప్రస్తుతం అమెరికాలో ఓ …

Read More »

రోహిత్ – హార్దిక్.. ఎదురుగా కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్స్!

ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్‌తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ పట్టలేని ఆనందం, మరోవైపు హార్దిక్ పాండ్య దిగులుతో కూర్చున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారితో పాటు ముంబయి స్టార్ రోహిత్ శర్మ స్పందన కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురు క్రికెటర్లు టీమిండియా తరఫున కలసి ఎన్నో …

Read More »

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే.. కాస్తంత కఠినమైనా ఈ తరహా మాటలే సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఘటన గురించి వింటే…ఈ మాటలు కూడా తక్కువేనేమోనని చెప్పాలి. ఎందుకంటే… సీనియర్ ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై 23 మంది మానవ మృగాలు కీలక పర్వాన్ని కొనసాగించాయి. అది కూడా ఏకంగా 7 రోజుల …

Read More »

ఈ కండక్టర్ టికెట్లు కొట్టడం కష్టమే!

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం ఆయనకు చేత కాదు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆయనకు అంతకంటే కూడా కష్టమేమీ కాదు. వచ్చిన చిక్కల్లా… తలను ఓ పక్కకు వేలాడేసి.. అలా సొరుగుతూ సొరుగుతూ బస్సులో ఆ చివర నుంచి ఈ చివర దాకా, ఈ చివర నుంచి ఆ చివర దాకా …

Read More »

బ‌ట్ట‌త‌ల‌ పై జుట్టు: ఎంతమంది బకరాలో చూడండి

తిమిరి ఇసుక‌న తైలంబు తీయ‌వ‌చ్చు.. అని భ‌తృహ‌రి శుభాషితం చెబుతున్నా.. బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు మొలిపించ‌డం మాత్రం ఎవ‌రికీ సాధ్యం కాదనేది అంద‌రికీ తెలిసిందే. లేక‌పోతే.. ప్ర‌పంచ కుబేరులు సైతం.. బ‌ట్ట‌త‌ల‌తోనే ఎందుకు బ‌తుకుతారు? అనేది ప్ర‌శ్న‌. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారుకూడా.. విగ్గుల‌ను ఎందుకు ఆశ్ర‌యిస్తార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సో.. బ‌ట్ట‌త‌ల‌ పై వెంట్రుక‌లు మొలిపించ‌డం అన్న‌ది సాధ్యం కాదు. ఈ విష‌యం తెలిసి కూడా.. కొంద‌రు మోస‌పోతూనే ఉన్నారు. మోస‌కారులు …

Read More »

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి… చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిణి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా సుగాలి రమ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పీలేరు కేంద్రంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం …

Read More »