ఈమధ్య కాలంలో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవస్రం లేదు. ఇక రీసెంట్ గా మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో చోటుచేసుకున్న ఒక దారుణం అందరినీ కుదిపేసింది. భార్యతోపాటు ఆమె ప్రేమికుడు, మరో సహాయకుడు కలిసి ఓ వ్యక్తిని క్రూరంగా హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. ఆ మృతదేహాన్ని గుర్తించింది అతని రెండో భార్య కావడం విషాదాన్ని మరింత పెంచింది.
60 ఏళ్ల భయ్యాలాల్ రాజక్‌కి జీవితంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో, రెండో భార్య గుడ్డిబాయ్‌తో నివసించాడు. కానీ పిల్లలు లేకపోవడంతో ఆమె చిన్న చెల్లెలు మున్నిని మూడో భార్యగా చేసుకున్నాడు. ఆమెతో ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మున్ని రహస్యంగా స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ్ దాస్ కుష్వాహా అనే వ్యక్తికి దగ్గరైంది. ఇక వారి బంధం కొన్నాళ్లకు మరింత బలపడడంతో ఇద్దరూ భయ్యాలాల్‌ను లేకుండా చేయాలని ప్లాన్ చేశారు.
ఆగస్టు 30 రాత్రి, నిర్మాణంలో ఉన్న తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న భయ్యాలాల్‌పై నారాయణ్ దాస్, అతడి సహాయకుడు ధీరజ్ కోల్ దాడి చేశారు. ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు. శవాన్ని గనుక ఎవరూ గుర్తించకూడదని బస్తాలు, దుప్పట్లు కప్పి తాళ్లతో కట్టి బావిలో పడేశారు.
తరువాతి రోజు ఉదయం రెండో భార్య గుడ్డిబాయ్ బావిలో ఏదో తేలుతున్నట్లు గమనించింది. దగ్గరగా చూసేసరికి అది తన భర్త శవమని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిని ఖాళీ చేసి శవాన్ని బయటకు తీశారు. అక్కడే భయ్యాలాల్ ఫోన్ కూడా దొరికింది.
పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం తలకు తగిలిన బలమైన గాయాల వల్లే మరణం సంభవించిందని నిర్ధారించారు. 36 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు మూడో భార్య మున్ని, ఆమె ప్రేమికుడు నారాయణ్ దాస్, సహాయకుడు ధీరజ్‌ను అరెస్టు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates