ఈ హైటెక్ జమానాలో రొమాంటిక్ క్రైమ్ కథలు ఎక్కువైపోతున్నాయి. రీల్ లైఫ్ ని చూసి రియల్ లైఫ్ లో స్ఫూర్తి పొందుతున్నారో…లేక రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు చేస్తున్నారో తెలియడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు సినిమా స్టోరీలను తలదన్నేలా ఉన్నాయి. తాజాగా, మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ లో జరిగిన ఘటన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా ఉంది. ప్రియురాలే …
Read More »ఎలా నవ్వాలో నేర్పిస్తున్నారు..!
నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వకపోతే రోగం- అంటారు దివంగత దర్శకుడు జంధ్యాల. హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ఆయన ఆహ్లాదభరిత ఆనందాలను పంచే అనేక సినిమాలను మనకు అందిం చారు. నవ్వకుండా ఉండలేనంత స్థాయికి మనల్ని తీసుకువెళ్లారు. అయితే.. మనకు నవ్వు కొత్తకాదు. కష్టమైనా.. సుఖమైనా.. నవ్వులోనే మన జీవితాలను తెల్లార్చుకుంటున్నాం. మనకు నవ్వుకునేందుకు సమయం.. నవ్వించేందుకు నేతలు… సినిమా నాయకులు.. ఇలా అనేక మంది ఉన్నారు. మరి …
Read More »ఆ ప్రమాదం జరిగిన చోటికి కామెరూన్ 30 సార్లు
ప్రఖ్యాత టైటానిక్ ఓడ మునిగి ప్రదేశానికి వెళ్లిన మినీ సబ్ మెరైన్ ‘టైటాన్’ ప్రమాదానికి గురై అందులోని ఐదుగురు సజీవ సమాధి కావడం విషాదాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ప్రమాదంపై టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. సముద్రపు అడుగున టైటానిక్ మునిగిన ప్రదేశానికి సాహసోపేత యాత్ర చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. టైటానిక్ సినిమా తీసే సమయంలో కామెరూన్ ఏకంగా 30 సార్లు ఈ ప్రాంతానికి వెళ్లి వచ్చారట. …
Read More »భార్యా భర్తల సెక్స్ పై కోర్టు తీర్పులతో తికమక!
భార్యా భర్తల సెక్స్పై రెండు రాష్ట్రాల హైకోర్టు వారాల వ్యవధిలోనే పరస్పర విరుద్ధంగా తీర్పులు ఇచ్చాయి. వివాహం చేసుకున్న తర్వాత భర్త అయినా.. భార్య అయినా.. శృంగారానికి నిరాకరిస్తే.. అది నేరమేనని.. వారం రోజుల కిందట బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇది విడాకులను కోరుకునేందుకు ఒక హక్కుగా కూడా పేర్కొంది. అయితే..తాజాగా కర్ణాటక హైకోర్టు దీనికి విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. వివాహం చేసుకున్నంత మాత్రాన శృంగారమే పరమావధి …
Read More »బెదిరింపుల దెబ్బకు రచయితకు సెక్యూరిటీ
ఆదిపురుష్ వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించినప్పటికీ కాంట్రావర్సీలు మాత్రం ఆగడం లేదు. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ చేయాలని ఏకంగా ప్రధాన మంత్రికి ఉత్తరం రాయడం ఇప్పటికే ప్రకంపనలు రేపింది. తాజాగా రచయిత మనోజ్ ముంతషీర్ కు చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఆయనకు ముంబై పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీతాదేవి భారతదేశంలో పుట్టినట్టు అర్థం వచ్చే డైలాగులు, హనుమంతుడితో చెప్పిన …
Read More »అఫైర్ ఉంటే ఉద్యోగం ఊస్టింగేనట
ఈ హైటెక్ జమానాలో కార్పొరేట్ ఆఫీసులలో యువతీయువకులు, పురుషులు, మహిళలు కలిసి పనిచేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు సహోద్యోగుల మధ్య వివాహేతర సంబంధాలు, అఫైర్లు నడుస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఇటువంటి వ్యవహారాలు కంపెనీలో అంతర్గతంగా ఉద్యోగులకు మాత్రమే తెలుస్తాయి. ఆ అఫైర్ల వల్ల ఏవైనా సమస్యలు వస్తే సదరు ఉద్యోగులు వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటుంటారు. ఒకవేళ యాజమాన్యానికి ఆ అఫైర్ గురించి తెలిసినా వారిని …
Read More »బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ చిత్ర నిర్మాత అరెస్టు
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్టు చేసి.. డ్రగ్స్ నుస్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్ర నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో …
Read More »టీడీపీ.. వైసీపీ రెండు పార్టీల్లోనూ సేమ్ ప్రాబ్లమ్…!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పది పదిహేను మినహా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీల్లో ఇద్దరికి మించిన నాయకులు పోటీలో ఉన్నారు. మాకంటే మాకే టికెట్ ఇవ్వాలని.. వైసీపీలో అయితే.. రోజు పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్తవారు ఈ పోటీలో ముందున్నారు. దీంతో నియోజకవర్గాలను పరిశీలిస్తే.. ఒక్కొక్క చోట నలుగురు నాయకులు కూడా రెడీగా ఉన్నారు. అదే సమయంలో కొత్తవారు కూడా బేల చూపులు …
Read More »అప్సర హత్య కేసులో కీలక మలుపు
హైదరాబాద్లో సంచలనం రేపిన అప్సర హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాయికృష్ణ అనే పూజారి ఆమెను హత్య చేసి ఒక మ్యాన్ హోల్లో పడేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణకు ఆల్రెడీ పెళ్లి అయి పిల్లలు ఉండగా.. అప్సరతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. వీళ్లిద్దరూ కలిసి అనేక ప్రాంతాలకు తిరగడం.. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అతను ఆమెను చంపేసి మ్యాన్ హోల్లో పడేయడం గురించి …
Read More »50 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా
నృత్యదర్శకుడిగా పరిచయం అయి.. ఆపై నటుడిగా మారి.. చివరగా దర్శకుడు కూడా అయ్యాడు ప్రభుదేవా. అన్ని రకాలుగానూ అతను ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం అతను నటుడిగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే.. డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అడపాదడపా కొన్ని పాటలకు నృత్యరీతులూ సమకూరుస్తున్నాడు. ప్రభుదేవా సినీ జీవితం ఎంత ఆసక్తికరమో.. వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తన మొదటి భార్య రమలతకు దూరమై.. నయనతారతో ప్రేమలో …
Read More »కెనడాలో ఇందిర హత్యపై సంబరాలు.. ఇదేం ఆరాచకం?
ఒక దేశ ప్రధానిని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రదర్శిస్తూ.. దానికి ప్రతీకారం పేరుతో మరో దేశంలో ర్యాలీ నిర్వహించి.. సంబరాలు చేస్తే దాన్నేమనాలి? ఎలా రియాక్టు కావాలి? హింసను ప్రోత్సహించే వారు.. ఆరాచకాలకు మద్దతు పలికే వారు ఎవరైనా సరే.. తీవ్రంగా ఖండించాల్సిందే. అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదు. కెనడాలో చోటు చేసుకున్న ఒక ఆరాచక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని వివరాలు తెలిసినంతనే …
Read More »16 వేల గుండె ఆపరేషన్లు చేసి, గుండె పోటు తో మృతి
ఆయన యువ డాక్టర్. పట్టుమని నాలుగు పదుల వయసు పూర్తిగా నిండనేలేదు. కానీ, ఆయన ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఎక్కడ నుంచి ఎవరు వచ్చినా.. నాడి పట్టుకుని గుండె చప్పుడును లెక్కగట్టేవారు. ఈ క్రమంలో కొన్ని వేల గుండెల చప్పుళ్లు విని.. ఆగిపోతున్న వాటికి ఊపిరి ఇచ్చి.. చప్పుడు చేసేలా ప్రాణాలు పోశాడు. కానీ… విధి బలీయం. ఇన్ని వేల మంది గుండెలను ఆగకుండా చేసిన ఆయన …
Read More »