ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆ మహిళను గుర్తించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ పల్లిలోని కొడంగల్ గేట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ ఒకరు రైలు పట్టాలపై కారు నడపడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించా ఫలితం లేకపోయింది.
ఫుల్ గా మందేసిన ఆ మహిళ..కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఎలాగోలా నానా తిప్పలు పడి ఎట్టకేలకు ఆ కారును ఆపిన రైల్వే సిబ్బంది…స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఆ వాహనాన్ని ట్రాక్ మీద నుంచి కిందకు దించి శంకర్ పల్లి-హైదరాబాద్ మార్గంలోని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates