రాత్రివేళ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న బెంగుళూరు లోని యువకుల సమూహం అనూహ్య విషాదానికి దారితీసింది. 20 ఏళ్ల యువతి ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ టెరస్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందింది. ఈ ఘటన పరప్పన అగ్రహార ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె రాత్రి సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసేందుకు అక్కడికి వెళ్లింది.
మధ్యలో ఓ గొడవ మొదలవడంతో ఉద్వేగానికి లోనైన ఆమె, ఒక్కసారిగా పైకి వెళ్లి ‘సాడ్ రీల్’ తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఎత్తైన స్థలం నుంచి జారిపడింది. బిల్డింగ్ 13వ అంతస్తు పైభాగంలో ఓ ఎలివేటర్ షాఫ్ట్ ప్రాంతంలోకి ఆమె పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె అసలు నివాసం బీహార్ కాగా, ప్రస్తుతం బెంగళూరులో ఓ షాపింగ్ మార్ట్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తరువాత, ఆమెతో వచ్చిన స్నేహితులు అక్కడినుంచి పరారయ్యారు. స్పాట్‌పై విచారణ చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు సీసీ టీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు పరిశీలిస్తున్నారు. డీసీపీ ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ “అవును, వారు బిల్డింగ్‌లో పార్టీ చేసుకున్నారు. తరువాత రీల్స్ తీయటానికి టెరస్‌కి వెళ్లారు. అప్పుడు ఆమె జారి పడిపోయింది. ప్రస్తుతం ప్రేమ విషయాల గొడవ వలన జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మేము విచారణను కొనసాగిస్తున్నాం” అని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates