ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం కోసం ఉపయోగించేవాళ్లూ లేకపోలేదు. ‘ఛాట్ జీపీటీ’కి పోటీగా ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ను ఇప్పుడు నెటిజన్లు వినోదం కోసం వాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ‘ఎక్స్’లో గత కొన్ని రోజులుగా ఇండియన్ యూత్ ‘గ్రోక్’ను అడుగుతున్న ప్రశ్నలు.. వాటికి ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ‘గ్రోక్’ నుంచి …
Read More »సునీతా సంపాదన ఎంతో తెలుసా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల కారణంగా తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోయారు. వాస్తవానికి, వారు 2023లోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ, బోయింగ్ స్టార్‌లైనర్ నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల వారి ప్రయాణం అనూహ్యంగా పొడిగించబడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఇద్దరు వ్యోమగాములు మార్చి 19 తర్వాత భూమికి తిరిగి …
Read More »ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ ఇటీవల తీసుకున్న కొత్త విధానం ప్రకారం, 45 రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న విదేశీ టూర్‌లలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మొదటి రెండు వారాల తర్వాత మాత్రమే ప్లేయర్స్ తో ఉండే వీలుంటుంది. అంతేకాదు, వారి గడువు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ …
Read More »కుంభమేళాలో 30 కోట్ల ఆదాయం… ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇదే రీతిలో ఓ కుటుంబం అద్భుతమైన లాభాలను సొంతం చేసుకుంది. అరైల్ గ్రామానికి చెందిన పింటూ మహ్రా కుటుంబం, త్రివేణి సంగమ వద్ద 45 రోజుల పాటు 130 బోట్లను నడిపి దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది. సాధారణంగా రోజుకు కొన్ని వందల రూపాయల కోసం …
Read More »భారత్ మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదిని చంపేసిన అమెరికా!!
ముంబై పేలుళ్లు, భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడులను లైవ్‌లో పర్యవేక్షించినట్టు ఆరోపణలు ఉన్న.. మోస్ట్ వాంటెడ్ ఐసిసి ఉగ్రవాది.. ఇస్లామిక్ స్టేట్ ప్రపంచ స్థాయి కార్యక్రమాల అధినేత అబ్దులా మక్కీని అమెరికా దారుణంగా హత మార్చింది. నడిరోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారుపై క్షిపణిని ప్రయోగించి.. ప్రాణాలు తీసింది. దీనికి అమెరికా మిత్ర దేశం.. ఇరాక్ కూడా సహకరించడం గమనార్హం. ఇరాక్-అమెరికా చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో మక్కీ హతమైనట్టు అగ్రరాజ్యం అధినేత …
Read More »ఈ ‘పోటీ’ పిచ్చి ఎంతటి దారుణం చేసిందంటే..?
నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల ప్రాణాలను నిలువునా తీసేసింది. అంతేనా.. ఆ పోటీ పిచ్చిలో పడిపోయిన ఆ పిల్లల తండ్రి ప్రాణాన్ని కూడా ఉరికి వేలాడేసింది. ఇదెక్కడో.. ఊహాలోకంలో తేలియాడుతున్న అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో జరగలేదు. మన తెలుగు నేలలో.. పచ్చటి పొలాలు, నిండా సెలయేరులు, మరోవైపు సుందరమైన సముద్ర తీరంతో కళకళలాడుతున్న కాకినాడ తీరంలో …
Read More »ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్.. రాహుల్ కాదు!
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గతంలో పంత్ ఢిల్లీకి ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ, ఐపీఎల్ 2024 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను జట్టును వీడాడు. ఈ ఖరీదుతోనే పంత్ ఐపీఎల్ …
Read More »దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో 773 జిల్లాల్లో ఇప్పటికే 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో లక్షద్వీప్ వంటి దూర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 28 నాటికి దేశవ్యాప్తంగా 4.69 లక్షల 5G టవర్లు (BTS) టెలికాం కంపెనీలు ఏర్పాటు చేశాయని గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని పార్లమెంట్‌లో తెలిపారు. 5G …
Read More »“స్మగ్లింగ్ ఎలా చెయ్యాలో యూట్యూబ్ లో నేర్చుకున్నా”
కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె వద్ద అప్పుడు 14.2 కిలోల బంగారం దొరికింది. దీని విలువ 12.56 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇంట్లో జరిగిన సోదాల్లో మరో 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 …
Read More »గాయమైన వెనక్కి తగ్గని రాహుల్ ద్రవిడ్
టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు హెడ్ కోచ్ గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతను ప్రదర్శించారు. బెంగళూరులో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో ఆయన కాలుకు గాయమై కాస్ట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా దాన్ని లెక్కచేయకుండా జైపూర్‌లో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 ప్రాక్టీస్ క్యాంప్‌కి కర్రల సహాయంతో హాజరయ్యారు. సోషల్ …
Read More »అమృత ప్రణయ్ కాదు.. అమృత వర్షిణి
నల్గొండలో ప్రేమ వివాహం చేసుకుని పరువు హత్యకు గురైన ప్రణయ్‌కి సంబంధించిన కేసులో ఇటీవలే తీర్పు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-1 అయిన మారుతీరావు కొన్నేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. సుపారీ తీసుకుని హత్యకు పాల్పడిన ఎ-2కు ఉరి శిక్ష విధించింది కోర్టు. ఇంకో ఐదుగురికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. దీనిపై గత రెండు మూడు రోజులుగా పెద్ద చర్చే …
Read More »గంభీర్.. టీమిండియా కోసం ఎవరు చేయని ప్రయోగం!
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు చేయని పని తనదైన శైలిలో చేయాలని నిర్ణయించుకున్నాడు. గంభీర్ ఇటీవల బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అధికారులతో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత జట్టు ఇకపై మరింత మెరుగయ్యేందుకు తనవంతు బాధ్యతను పూర్తిగా నెరవేర్చాలని ఆయన భావిస్తున్నాడు. ఇదే కారణంగా, భారత్-ఇంగ్లాండ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates