Trends

అన్నం పెట్ట‌లేద‌ని భార్య‌ని చంపేసిన భ‌ర్త‌

రాత్రి అన్నం పెట్ట‌లేద‌ని క‌ట్టుకున్న భార్య‌ను చంపాడో ప్ర‌బుద్ధుడు. ప్రస్తుత కాలంలో కోపాన్ని నియంత్రించుకోలేక‌పోతున్న మ‌నుషులు చేస్తున్న అమాన‌వీయ ఘ‌ట‌న‌కు ఇదో నిద‌ర్శ‌నం. జీవితాంతం తోడుగా ఉంటాడ‌ని న‌మ్మి వ‌చ్చిన భార్య‌ను.. ఓ భ‌ర్త బండ‌రాయితో మోదీ చంపాడు. అందుకు కార‌ణం కూడా పెద్ద‌దేమీ కాదు. అన్నం పెట్ట‌లేద‌ని గొడ‌వ పెట్టుకుని.. ఆగ్ర‌హంతో ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ జోధ్‌పూర్‌లోని మాతా కా థాన్ ఏరియాలో జ‌రిగింది. …

Read More »

వారం వారం సొంత విమానంలో వాడపల్లి వస్తున్న బెంగుళూరు భక్తుడు

కలియుగం దైవం వెంకటేశ్వరుడంటే కోరిన కోర్కెలు తీర్చే దేవంగా ప్రశస్తి. అందుకే తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయాలు పలు ఇతర చోట్ల కూడా వాటివాటి మహాత్మ్యం కొద్దీ పేరుపొందాయి. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని వీసా బాలాజీ ఆలయం కూడా అంతే. అలాగే.. కోనసీమ జిల్లా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల నుంచి అలాంటి గుర్తింపే వస్తోంది. వాడపల్లి వెంకన్న …

Read More »

కైలాసానికి డైరెక్ట్ రోడ్డు

తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు …

Read More »

గిన్నిస్ రికార్డు ‘స్మాష్’ చేసిన సాత్విక్

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మెరుపు వేగంతో స్మాష్ కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను స్మాష్ చేశాడు. బ్మాడ్మింటన్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగంగా స్మాష్ కొట్టిన షట్లర్ గా సాత్విక్ సాయిరాజ్ వరల్డ్ రికార్డు …

Read More »

ధోనీ గ్యారేజ్..చూస్తే మైండ్ బ్లాకే

మహేంద్ర సింగ్ ధోనీ….అకా ఎంఎస్ డీ అలియాస్ మహీ…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరుంది. మైదానం లోపల మాత్రమే కాదు వెలుపల కూడా ధోనీ టెంపర్ కోల్పోయిన సందర్బాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. మైదానంలో తన మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటు వేసే ధోనీ…మైదానం బయట మాత్రం మెరుపు వేగంతో దూసుకుపోయే బైక్ లంటే ప్రాణమిస్తాడు. బైక్ …

Read More »

దయాగా JD చక్రవర్తి సరైన రీ ఎంట్రీ

1989లో వచ్చిన నాగార్జున శివ ఎప్పటికీ మర్చిపోలేని సెన్సేషన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే కాదు దానికి పని చేసిన, నటించిన ప్రతి ఒక్కరికి ఎంతో లైఫ్ ఇచ్చింది. అందులో ప్రధానంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి జెడి చక్రవర్తి. తలపొగరుతో మిడిసిపడే విద్యార్ధి పాత్రలో అతను సహజంగా నటించిన తీరు చాలా పేరు తీసుకొచ్చింది. తర్వాత హీరోగా మారి గులాబీ, అనగనగా ఒక రోజు, బొంబాయి ప్రియుడు లాంటి ఎన్నో హిట్ …

Read More »

ఇద్దరు కూతుళ్లకు రెండో భర్తకు పిల్లలు..ఓ తల్లి దారుణం

ఈ కలికాలంలో కామాంధులకు కొదవ లేదు. ఆరేళ్ల పసిపాప నుంచి అరవై ఏళ్ల ముసలావిడ వరకు చాలామంది మహిళలు లైంగిక బాధితులుగా ఉంటున్నారు. కొందరు మృగాళ్లయితే వావివరసలు…రక్తసంబంధాలు అన్నీ మరచి వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుళ్ల పాలిట కాలయముడిగా, కామాంధుడిగా మారిన ఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే, తాజాగా ఓ కన్నతల్లి తన పేగుతెంచుకు పుట్టిన కూతుళ్ల పట్ల అత్యంత అమానవీయంగా …

Read More »

ఈ కి‘లేడీ’కి 8 మంది భర్తలు

ఈ హైటెక్ జమానాల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్..అరచేతిలో వైకుంఠమే కాదు ప్రపంచాన్ని కూడా చూపిస్తోంది. వందల కొద్దీ డేటింగ్ వెబ్సైట్ లు, పదుల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వెరసి ఆన్లైన్ లో చాలామంది ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇదే అదునుగా మరికొందరు కేటుగాళ్లు, కిలాడీలు, కిలేడీలు సోషల్ మీడియా వేదికగా సరికొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిలేడీ…నిత్య …

Read More »

ప్రియుడి మోజులో చిన్నారిని కడతేర్చిన కన్నతల్లి

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు….మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న ఆర్ద్రతతో పాడిన పాట ఈ కలికాలంలో చాలామంది కఠినాత్ములకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులను కడతేర్చిన కసాయివారిని చూస్తున్నాం అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని ఆలుమగలు ఒకరినొకరు చంపించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక, అక్రమ సంబంధాలకు వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారన్న కారణంతో ముక్కుపచ్చలారని పసివాడిని కూడా పరలోకాలకు పంపిస్తున్న ఘటనలూ వెలుగులోకి …

Read More »

ఇక న్యూస్ యాంకర్లతో పనిలేదా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. …

Read More »

విశాఖ‌కు ఇదేం ఖ‌ర్మ‌!

ఏపీలో ఐటీ న‌గ‌రంగా భాసిల్లాల‌ని కోరుకుంటున్న విశాఖ‌ప‌ట్నంపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వం దీనిని పాల‌నా రాజధాని చేస్తామ‌ని చెబుతోంది. అంటే.. ఒక‌ర‌కంగా.. ఇటు ఐటీ, అటు పాల‌న రాజ‌ధాని పేరిట విశాఖ వెలుగులు మ‌రింత విరాజిల్లాలి. కానీ, న‌గ‌రం స‌హా జిల్లాపై అనేక నీలినీడ‌లుక‌మ్ముకున్నాయి. కొన్నాళ్ల కింద‌ట అధికార పార్టీ నాయ‌కుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స‌రే.. ఇవి ఎలా ఉన్నా.. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ …

Read More »

శీను పండు జంట మళ్ళీ కలుస్తుందా

టాలీవుడ్ ప్రేమ సినిమాల్లో మోస్ట్ ఐకానిక్ అండ్ లవ్లీ జంటల్లో ఒకటైన శీను పండుల అల్లరి, నిన్నే పెళ్లాడతా మూవీని అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. 1996 కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సృష్టించిన రికార్డులు చూసి మాస్ హీరోలు సైతం తెల్లబోయే పరిస్థితి. అప్పట్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో లెక్క బెట్టడం …

Read More »