ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఉన్మాదికి కోర్టు సరైన శిక్ష విధించింది. 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న డీఏవీ స్కూల్లో జరిగిన ఈ దారుణ ఘటనపై నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ పాల్పడిన దాష్టీకాన్ని నిర్దారిస్తూ.. 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఏం …
Read More »దేశంలో ఫస్ట్ ‘ఆపిల్’ స్టోర్ ప్రారంభం.. ఎక్కడంటే!
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆపిల్ ఐ ఫోన్ కంపెనీ భారత్‌లో తన మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ఈ రోజు ప్రారంభించింది. Apple BKC పేరుతో భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో అత్యంత అధునాతన హంగులతో రూపుదిద్దిన భవనంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో వినియోగ దారులకు అవసరమైన అన్ని ఆపిల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాలమైన ప్రాంగణంలో ఆధునిక సొబగులతో తీర్చిదిద్దిన …
Read More »వందేభారత్ స్పీడు ఒక మోసం !
చెప్పే గొప్పలకు.. చేతలకు మధ్య దూరం ఎంతన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మోడీ సర్కారు గొప్పగా తీసుకొచ్చిన వందేభారత్ రైలును అడిగితే చెప్పేస్తుందంటున్నారు. దేశంలోనే అత్యధిక వేగంతో నడిచే రైలుగా గొప్పలు చెప్పేయటమే కాదు.. ఆ రైలుబండిలో ప్రయాణించాలంటే మస్తు పైసలు వసూలు చేస్తున్న వైనం తెలిసిందే. అదేమంటే.. అప్డేటెడ్ టెక్నాలజీతో అదిరే ఫీచర్లతో అంటూ బడాయి మాటలు చాలానే చెప్పటం చూశాం. అయితే.. ఈ ట్రైన్ కు సంబంధించిన అసలు …
Read More »పేపర్ లీకేజీ కోసం.. కారు అమ్మేశారు
తెలంగాణలో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మరిన్ని దిశలుగా పయనిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి పేపర్లు లీక్ అయిన వ్యవహారం.. అన్నివైపుల నుంచి విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరినట్టు.. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ విస్మయం కలిగించే విషయం వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకు కుంభకోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన …
Read More »గంగూలీ, కోహ్లిల మధ్య సద్దుమణగని గొడవ
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్ గంగూలీ తనకు వ్యతిరేకంగా వ్యవహరించాడని చాలా బలంగా నమ్ముతాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. తనను వన్డే కెప్టెన్‌గా తప్పించడంలో గంగూలీదే కీలక పాత్ర అన్నది అతడి నమ్మకం. ఈ విషయాన్ని విలేకరుల ముందు కూడా పరోక్షంగా చెప్పాడు ఓ సందర్భంలో. గంగూలీ వచ్చాకే భారత క్రికెట్లో కోహ్లి ఆధిపత్యానికి తెరపడిందని.. సెలక్షన్ సహా అన్ని నిర్ణయాల్లో విరాట్ ఏకఛత్రాధిపత్యాన్ని అతను …
Read More »డెయిరీలో భారీ పేలుడు.. 18వేల ఆవులు మృత్యువాత
ఘోరాతి ఘోరమైన ఉదంతం అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకుంది. ఒక డెయిరీ లో చోటు చేసుకున్న భారీ పేలుడుకు వేలాది గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్ లో ఉన్న సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో 18వేల ఆవులు ఒకేసారి మృత్యువాత పడిన అసాధారణ ఉదంతం చోటు చేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన …
Read More »హైదరాబాదీ క్రికెట్ అభిమానులకు శుభవార్త
మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియానికి ఐపీఎల్ సందడి తిరిగి రావడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లను ఉప్పల్ స్టేడియంలో ఆడుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐతే ఉప్పల్ స్టేడియంలో గతంతో పోలిస్తే అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గిపోవడం ఇక్కడి అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. కానీ ఈ ఏడాది చివర్లో జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఉప్పల్ స్టేడియం ఉండటం …
Read More »ఐపీఎల్: థ్రిల్లర్ కు మించిన చివరి బంతి విజయం
ఐపీఎల్ తాజా సీజన్ లో సంచలన ఫలితాలు నమోదు అవుతున్నాయి. మొన్నటికి మొన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో కోల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రింకు సింగ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. చివరి ఓవర్లో జట్టు గెలుపునకు అవసరమైన 29 పరుగుల చేధన అసాధ్యమని అందరూ భావించిన …
Read More »గుండె కోత.. కారు కింద 13 నెలల చిన్నారి
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పసిబిడ్డ అనుకోకుండా తనువు చాలిస్తే ఆ బాధను తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకూ సాధ్యం కాదు. కడుపు కోతను మించిన విషాదం ఇంకేం ఉంటుంది? అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఘోరమైన విషాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. 13 నెలల చిన్నారి కారు కింద పడి రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయాడు. …
Read More »ఖల్లాస్: లోక్ యాప్ లు డౌన్ చేయొద్దు.. చేస్తే.. ఇవి మరవొద్దు
డబ్బులు అవసరం అయ్యాయని అడ్డగోలుగా అప్పులు చేయటం ఎంత తప్పో.. అవసరమని లోన్ యాప్ ల ద్వారా రుణం తీసుకోవటం అంతకు మించిన పెద్ద తప్పు అవుతుంది. ఆర్థికంగా నష్టపోవటమే కాదు.. అంతకు మించిన తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకున్నట్లే. మనం అప్ లోడ్ చేసే నాలుగు డాక్యుమెంట్లు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నాడు కదా.. ఏమైనా జరిగితే తర్వాత చూసుకుందామని అనుకోవచ్చు. కానీ.. దానికి మించిన తిప్పలు చాలానే వెంటాడి వేధించే …
Read More »పెళైన ఏడాదికే విడిపోతున్నారు
నా ప్రేమ నవపారిజాతం.. అని ఎంతో తీయగా కమ్మని పాట మొదలు పెట్టిన జంటలు.. పాట పూర్తయ్యే లోపే.. వాడిపోతున్నాయి! ప్రేమకోసం ప్రాణమైనా ఇస్తా అనే మాటలు.. కొన్నాళ్లకే పరిమితం అయిపోతు న్నాయి!! మరికొన్నాళ్లకే ప్రేమలేదని.. ప్రేమించరాదనే విషాద గీతాలే ఈ జంటల జీవితాను ప్రభావితం చేస్తున్నాయి!! మరి దీనికి కారణం.. ఏంటి? ఎందుకు? అంటే.. దాగుడు మూతలేనని తేల్చి చెబుతున్నా రు పరిశోధకులు. నాకు నువ్వు-నీకు నేను.. అని …
Read More »పాకిస్థాన్ పురుషులు ఉమనైజర్లు.. బ్రిటన్ హోం మంత్రి
పాకిస్థాన్ పౌరులపై బ్రిటన్ హోం శాఖ మంత్రి సుయెల్లా బ్రావర్మన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో స్థిరపడిన పాకిస్థాన్ పురుషులు మామూలోళ్లు కారరంటూ.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటన్ మహిళలపై పాకిస్థానం సంతతి పురుషులు.. వేధింపులకు పాల్పడుతున్నారని.. అత్యాచారాలకు సైతం ఒడిగడుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాదు.. బ్రిటన్ లో మాదక ద్రవ్యాల వినియోగంలోనూ పాకిస్థాన్ సంతతి పురుషులే ఎక్కువగా ఉంటున్నట్టు బ్రావర్మన్ పేర్కొన్నారు. పాక్ సంతతి పురుషులు దేశంలో …
Read More »