Trends

ఐపీఎల్.. గుడ్ న్యూస్ వచ్చింది కానీ..

ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 17 నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభం కానున్నాయని అధికారికంగా ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. అయితే ఈ సారి షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా పాస్ ఇచ్చేయడం ఇక్కడి ఫ్యాన్స్‌కు షాక్‌లా మారింది. దేశవ్యాప్తంగా ఆరు వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ… ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్‌లకు మాత్రమే అవకాశం కల్పించింది.  హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ …

Read More »

కోహ్లీ గుడ్‌బై.. BCCI ప్లాన్ పనిచేయలేదా?

భారత టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ చెప్పిన గుడ్‌బై క్రికెట్ అభిమానుల హృదయాలను కదిలించే నిర్ణయంగా మారింది. 14 ఏళ్ల పాటు భారత జెర్సీలో దూకుడుగా దూసుకెళ్లిన విరాట్ కోహ్లీ, టెస్టు ఫార్మాట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, “ఇది నా జీవితంలోని ఒక గొప్ప ప్రయాణం. ఇప్పుడు దాన్ని ముగించాలనే సమయం ఆసన్నమైంది” అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. అయితే కోహ్లీ ఇదివరకే …

Read More »

‘సైన్యం గోల మ‌నకొద్దురా అయ్యా’ అని తండ్రి అంటే..

నూనూగు మీసాల నూత్న య‌వ్వ‌నంలోకి అడుగుపెట్టిన యువ‌కుడు.. దేశం కోసం జ‌రిగిన పోరాటంలో వీర‌మ‌రణం చెంది.. చెక్క పెట్టెలో పార్థివ దేహంగా ప‌డుకున్న తీరు క‌న్నవారిని కుమిలిపోయేలా.. క‌డుపు రగిలిపోయేలా చేస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. వ‌చ్చే ఏడు మ‌నువు పెట్టుకున్నాం.. నా క‌డుపు కాలిపోయింది! అంటూ.. దేశానికి వీరుడిని ప్ర‌సాదించిన జ్యోతిబాయి విల‌పించిన తీరు.. క‌న్నీళ్ల‌కు సైతం జాలి క‌లిగి.. ఇంకిపోయాయి.! ఒక్క‌గా నొక్క బిడ్డ‌.. లేక లేక పుట్టిన …

Read More »

చైనా తోక కత్తెరించేలా ఇస్రో నిఘా!

ఇప్పటివరకు శాంతియుత ప్రయోగాలతో ఆకట్టుకున్న ఇస్రో, ఇప్పుడు భద్రతా వ్యూహాల విషయంలోనూ కీలకంగా మారుతోంది. దేశ సరిహద్దులు, సముద్ర తీరాలు, వ్యూహాత్మక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేలా పది అత్యంత ఆధునిక నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి ఇప్పటికే పనిచేసేలా చేసినట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్లడించడమొక కీలక మలుపుగా మారింది. ఈ ఉపగ్రహాల ద్వారా శత్రు దేశాల కదలికలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టేందుకు వీలవుతుంది. ముఖ్యంగా చైనా …

Read More »

ఐపీఎల్.. కొత్త అప్‌డేట్ ఏంటి?

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా వారం రోజుల పాటు లీగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐతే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే పరిస్థితులు మారిపోయాయి. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం తర్వాత కూడా నిన్న రాత్రి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ.. శత్రు దేశానికి భారత్ దీటుగా …

Read More »

నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా: నవవధువు

మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న కలాంసర గ్రామానికి చెందిన యామినితో ఘనంగా జరిగింది. సాధారణంగా పెళ్లి అనంతరం ఒక కొత్త జంట కలిసిన ప్రతి క్షణం ఆనందాన్ని పంచుకుంటూ గడపాలి. కానీ ఈ జంటకు అది సాధ్యం కాలేదు. పెళ్లైన మూడో రోజే పాటిల్‌కు ఆర్మీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో, తక్షణం విధుల …

Read More »

టోర్నమెంట్ ఆగిపోయినా నష్టం లేదు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 2025ను వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 57 మ్యాచ్ లు జరిగిన తరువాత సగంలో ఆపేయడం అనేది మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒక్క ప్రశ్నే మెదులుతోంది.. టోర్నమెంట్ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు ఎంత నష్టం జరుగుతుంది. ఆటగాళ్ల వేతనం పరిస్థితి ఏమిటి అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ అసలు నిజం …

Read More »

సైన్యంలో చేరుతారా? నోటిఫికేష‌న్ ఇచ్చిన ఆర్మీ.. నిజ‌మెంత‌?

అదిగో పులి.. అంటే ఇదిగో తోక‌.. అన్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ప‌రుగులు పెడుతోంది. ప్ర‌స్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన ఇచ్చిందంటూ.. సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. ప్రాదేశిక(టెర్రిటోరియ‌ల్‌) సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం ప‌లికిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింద‌ని కూడా పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. దీనిలో 18 ఏళ్ల నుంచి …

Read More »

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. యుద్ధానికి కారణం కాగా.. పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ యుద్ధ తీవ్రతను పెంచేస్తోంది. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో నిమగ్నమైన తెలుగు జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. పాక్ జరిపిన కాల్పుల్లో మురళి మృతి చెందినట్లు …

Read More »

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ప్రథమం అన్న తత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పటి వరకు అభిమానులు ఎదురుచూస్తున్న అన్ని మ్యాచ్‌లు నిలిచిపోవడం ఒక్కసారిగా క్రికెట్ లోకాన్ని షాక్‌కు గురిచేసింది. గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న వాతావరణం …

Read More »

‘సిందూర్’పై ద్వివేదీ ఫ్యామిలీ భావోద్వేగం!

పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అందాలను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ వెళ్లిన భారతీయులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం…దాడులకు బాధ్యులుగా గుర్తిస్తూ… పాక్ భూభాగంలో కొనసాగుతున్న 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం …

Read More »

అమరావతిలో ‘బసవతారకం’కు మరో 6 ఎకరాలు

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి పేదలకు ఏ మేర సేవలు అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టీడీపీ వ్యవస్తాపకుడు దివంగత నందమూరి తారక రామారావు నెలకొల్పిన ఈ ఆసుపత్రిని ఆ తర్వాత బాలయ్య పర్యవేక్షిస్తున్నారు. తెలుగు నేల విభజన తర్వాత బసవతారకం ఆసుపత్రి సేవలను ఏపీకి కూడా విస్తరించాలని బాలయ్య …

Read More »