ఈ హైటెక్ జమానాల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్..అరచేతిలో వైకుంఠమే కాదు ప్రపంచాన్ని కూడా చూపిస్తోంది. వందల కొద్దీ డేటింగ్ వెబ్సైట్ లు, పదుల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వెరసి ఆన్లైన్ లో చాలామంది ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇదే అదునుగా మరికొందరు కేటుగాళ్లు, కిలాడీలు, కిలేడీలు సోషల్ మీడియా వేదికగా సరికొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిలేడీ…నిత్య …
Read More »ప్రియుడి మోజులో చిన్నారిని కడతేర్చిన కన్నతల్లి
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు….మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న ఆర్ద్రతతో పాడిన పాట ఈ కలికాలంలో చాలామంది కఠినాత్ములకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులను కడతేర్చిన కసాయివారిని చూస్తున్నాం అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని ఆలుమగలు ఒకరినొకరు చంపించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక, అక్రమ సంబంధాలకు వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారన్న కారణంతో ముక్కుపచ్చలారని పసివాడిని కూడా పరలోకాలకు పంపిస్తున్న ఘటనలూ వెలుగులోకి …
Read More »ఇక న్యూస్ యాంకర్లతో పనిలేదా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. …
Read More »విశాఖకు ఇదేం ఖర్మ!
ఏపీలో ఐటీ నగరంగా భాసిల్లాలని కోరుకుంటున్న విశాఖపట్నంపై నీలినీడలు కమ్ముకున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం దీనిని పాలనా రాజధాని చేస్తామని చెబుతోంది. అంటే.. ఒకరకంగా.. ఇటు ఐటీ, అటు పాలన రాజధాని పేరిట విశాఖ వెలుగులు మరింత విరాజిల్లాలి. కానీ, నగరం సహా జిల్లాపై అనేక నీలినీడలుకమ్ముకున్నాయి. కొన్నాళ్ల కిందట అధికార పార్టీ నాయకులపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. సరే.. ఇవి ఎలా ఉన్నా.. ఇటీవల జరిగిన ఎంపీ …
Read More »శీను పండు జంట మళ్ళీ కలుస్తుందా
టాలీవుడ్ ప్రేమ సినిమాల్లో మోస్ట్ ఐకానిక్ అండ్ లవ్లీ జంటల్లో ఒకటైన శీను పండుల అల్లరి, నిన్నే పెళ్లాడతా మూవీని అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. 1996 కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సృష్టించిన రికార్డులు చూసి మాస్ హీరోలు సైతం తెల్లబోయే పరిస్థితి. అప్పట్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో లెక్క బెట్టడం …
Read More »ప్రధానిగా నటి రంజిత.. నిత్యానంద సంచలన ప్రకటన
పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని.. చివరకు వీర్య పరీక్షకు కూడా సిద్ధపడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుర్తున్నాడా.! తనే దేవుడినని చెప్పుకొన్న ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన దరిమిలా.. ఓవర్ నైట్ ఆయన ఈ దేశాన్ని వదిలి పారిపోయాడు. అయితే.. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చినా.. ఆయన జాడ తెలియలేదు. తర్వాత.. కొన్నాళ్లకు.. కొన్నేళ్లకు.. ఆయనే స్వయంగా ముందుకు వచ్చి.. తాను కైలాస దేశాన్ని ఏర్పాటు …
Read More »కోహ్లి, రోహిత్‌లను ఇక మరిచిపోవచ్చు
సచిన్, ద్రవిడ్, గంగూలీ, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, గంభీర్ లాంటి మేటి క్రికెటర్లు నిష్క్రమించాక పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు దక్కిన పెద్ద బ్యాటింగ్ సూపర్ స్టార్లు అంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలే. ధోనీ కూడా బ్యాటింగ్‌లో గొప్ప స్థాయినే అందుకున్నప్పటికీ.. అతను భ్యాట్స్మన్గా కంటే కెప్టెన్‌గానే ఎక్కువ పాపులర్. ధోని 2019 వన్డే ప్రపంచకప్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేశాడు. ఆ తర్వాత భారత బ్యాటింగ్ …
Read More »ఇండియాలో కాస్ట్లీ బెగ్గర్ ఈయనే..
భరత్ జైన్.. రూ. 7.5 కోట్ల విలువైన ఆస్తులు, నెలకు 75 వేల రూపాయల సంపాదన, ముంబయిలో ఖరీదైన ప్రాపర్టీస్. ఇవన్నీ వింటుంటే ఈయనేదో ప్రభుత్వ ఉన్నతోద్యోగో.. కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తో.. లేదంటే, మాంచి వ్యాపారం చేస్తున్న బిజినెస్మేనో అనిపించొచ్చు. కానీ, ఈయన వృత్తి బెగ్గింగ్. అవును.. భిక్షాటన చేసే ఆయన ఇన్ని కోట్లు సంపాదించారు. అందుకే.. దేశంలోనే అత్యంత ధనికుడైన బెగ్గర్‌గా ఆయన పేరు వినిపిస్తోంది. భరత్ …
Read More »నీహారిక విడాకుల ఘట్టం సమాప్తం
రెండు మూడు నెలల క్రితమే మెగా డాటర్ నీహారిక ఆమె భర్త చైతన్య విడిపోతున్నారనే వార్త వచ్చినప్పటికీ వ్యవహారం కోర్టులో ఉన్నందు వల్ల ఆ జంట మౌనంగా ఉంటూ వచ్చింది. విడాకులు అధికారికంగా మంజూరు కావడంతో ఎట్టకేలకు తమ బంధం ముగిసిపోయిందని, కొత్త జీవితానికి ప్రైవసీ ఇమ్మని కోరుతూ ఇద్దరూ ఒకటే మెసేజ్ పెట్టారు. ఇటీవలే జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్, క్లిన్ కారా నామకరణం వేడుకల్లో అసలు …
Read More »యాషెస్ వివాదం..సునాక్ వర్సెస్ ఆల్బనీస్
అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారని, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడుతుంటారని అప్రతిష్ట ఉంది. ఇక, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో సైమండ్స్ మంకీ గేట్ వివాదం మొదలు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వరకు ఆసీస్ క్రికెటర్ల వివాదాస్పద శైలి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ఈ …
Read More »విషాదం నింపిన విహార యాత్ర.. అమెరికాలో అద్దంకి వ్యక్తి మృతి..
రాక రాక ఒక సెలవు దొరికింది. దీంతో కుటుంబంతో సహా ఎంజాయ్ చేయాలని భావించిన ఆ ఇంటి పెద్ద.. తన పిల్లలు, సతీమణితో కలిసి బీచ్ వెళ్లాడు. అయితే.. ఈ విహారమే.. ఆ ఇంట విషాదాన్ని నింపింది. బీచ్‌లో గెంతులు వేస్తున్న తన బిడ్డలు.. కళ్లముందు.. నీట మునిగిపోతున్న తీరును చూసి తట్టుకోలేక పోయింది ఆ తండ్రి హృదయం. ఈ క్రమంలో వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన కూడా …
Read More »టీమిండియాలో ముగ్గురు తెలుగమ్మాయిలకు చోటు
గతంతో పోలిస్తే కొంతకాలంగా భారత్ లో మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ టోర్నీని మహిళల క్రికెట్లో కూడా ప్రవేశ పెట్టడంతో కొత్తతరం మహిళా క్రికెటర్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఎంతోమంది యువ మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు టీమిండియా తలుపుతడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9 …
Read More »