పీచు మిఠాయి. ఈ పదార్థం గురించి తెలియనివారు ఉండరు. తిననివారు అంతకన్నా ఉండరు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా పీచు మిఠాయి వార్తల్లోకి వచ్చింది. రావడమే కాదు.. సంచలనంగా మారింది. అదేసమయంలో ప్రజల్లోనూ భయానికి కారణమైంది. దీనికి రీజన్.. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట! అంతే.. ఈ విషయం బయటకు రాగానే తమిళనాడు ప్రభుత్వం వెంటనే దీనిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిని తయారు చేసినా.. …
Read More »ఢిల్లీ రణరంగం.. కళ్లు, కాళ్లు, చెవులు పోగొట్టుకున్న రైతన్నలు!
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారులన్నీ.. యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు, ఆధార్ కార్డుల వెరిఫికేషన్.. వాహనాల విస్తృత తనిఖీలతో పాకిస్థాన్ సరిహద్దులను దాదాపు మరిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే కనీస మద్దతు ధరలకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని.. స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హరియాణ, ఢిల్లీ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం మాత్రం వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే …
Read More »సింహంతో సెల్ఫీ.. తర్వాత ఘోరం.. తిరుపతిలోనే!
సెల్ఫీ మోజు ఓ యువకుడుని అర్ధంతరంగా బలి తీసుకుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కుకు వచ్చిన ఓ యువకుడు.. అందరితోపాటు.. జంతు ప్రదర్శన శాలలో తిరిగాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న జంతువులతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెందలేదు. కొంత దూరంలో ఉన్న ‘లయన్ ఎన్ క్లోజర్’లోకి వెళ్లాడు. వాస్తవానికి లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరినీ అనుమతించరు. తాజాగా లయన్ ఎన్ క్లోజర్లోకి …
Read More »జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులు
వారంతా వైద్య విద్యార్థులు. పట్టాలు పుచ్చుకుని రేపు సమాజానికి సేవ చేయాల్సిన బృహత్తర బాధ్యత ఉన్న భావి డాక్టర్లు. కానీ, విచక్షణ మరిచి.. పక్కా రోడ్ సైడ్ రోమియోల మాదిరిగా వ్యవహరించారు. చిన్న చితకా కాలేజీల్లో పోకిరీల మాదిరిగా వ్యవహరించారు. జూనియర్లకు గుండు కొట్టి.. సీనియర్లు చిందులు తొక్కారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో చర్చగా మారింది. తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి వైద్య కాలేజీలో సీనియర్లు దారుణానికి …
Read More »ఇద్దరు అసాధారణ వ్యక్తులు ఐస్ క్రీం షాపులో సాదాసీదాగా!
బెంగళూరులోని జయనగర్ కార్నర్ హౌస్ ఐస్ క్రీం షాప్ కు సాదాసీదాగా వచ్చారు ఇద్దరు అసాధారణ ప్రముఖులు. వారెవరో కాదు. ఒకరు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అయితే.. మరొకరు బ్రిటన్ దేశ ప్రధాని సతీమణి కం నారాయణమూర్తి గారాలపట్టి అక్షత మూర్తి. వారిద్దరు పలుకుబడిలోనూ.. పవర్ లోనూ.. డబ్బులోనూ అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వారు. అయినప్పటికీ వారు ఎలాంటి హడావుడి లేకుండా ఐస్ క్రీం …
Read More »చిన్న దేశం.. పెద్ద సందేశం.. మనకు ఎంత ఉపయోగమంటే!
అది చాలా చిన్నదేశం. పైగా.. కోటి మందికంటే కూడా తక్కువ మందే జనాభా ఉన్నారు. కానీ, చూసేందు కు, జనాభా పరంగా కూడా చిన్నదేఅయినా.. ఈ దేశం ఇప్పుడు ప్రపంచ స్తాయిలో చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్య దేశాలకు.. ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న అమెరికా, భారత్ వంటి వాటికి అది ఆదర్శంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. అదే… యూరోపియన్ యూనియన్‌లో ఉన్న హంగేరీ దేశం. దీని జనాభా …
Read More »శివశివా.. శ్రీశైలం ప్రసాదంలో చికెన్ ముక్కలు!
శ్రీశైలం. హిందువులు అత్యంత పరమ పవిత్రంగా భావించే కాశీ విశ్వనాథుని మందిరం తర్వాత.. ప్లేస్ దీనిదే. “సంధ్యారంభ విజృంభితం.. ” అంటూ.. పరమేశ్వరుడు.. ప్రతి రోజూ సంధ్యాకాలంలో శ్రీశైల గిరులపై తాండవం చేస్తారని ప్రతీతి. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు శివానందలహరిలోనూ పేర్కొన్నారు. అలాంటి పరమపవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువుల పరితపిస్తుంటారు. ఏడాదిలో ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ఇక్కడ నిత్య కళ్యాణం అన్నట్టుగా శివయ్యకు …
Read More »కోడలిపై క్రికెటర్ రవీంద్ర తండ్రి షాకింగ్ వ్యాఖ్యలు
టీమిండియా ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర జడేజా ఇంటి పంచాయితీ రచ్చకు ఎక్కుతోంది. మధ్యతరగతికి చెందిన రవీంద్ర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదగటం.. అతడి పెళ్లి సంపన్నురాలైన రివాబానేతో జరగటం.. ఆ తర్వాత నుంచి కుటుంబంలో సమస్యలు షురూ కావటం తెలిసిందే. తాజాగా రవీంద్ర జడేజా తండ్రి ఒక మీడియాసంస్థతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు షాకిచ్చేలా మారాయి. తమ ఇంట్లోని గొడవలకు …
Read More »షికాగోలో హైదరాబాద్ యువకుడ్ని దారుణంగా కొట్టేశారు
హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు అకారణంగా దాడికి గురయ్యాడు. దేశం కాని దేశంలో అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న అతడు దారిదోపిడీదారుల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సయ్యద్ మజర్ అలీ అనే యువకుడి మీద దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లోని హాషిమ్ నగర్ లో నివసించే ఇతను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి షికాగోకు వెళ్లాడు. …
Read More »63 మంది ఖైదీలకు ఎయిడ్స్.. దేశంలో కలకలం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కనీసం చీమను కూడా బయట నుంచి రానివ్వని అత్యంత దుర్భేద్యంగా ఉండే జైల్లో ఏకంగా 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ అయింది. వీరిని తాజాగా పరీక్షించిన ప్రత్యేకవైద్యులు వారిలో హైఐవీ వైరస్ పాజిటివిటీ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో జైలు అదికారులే కాదు.. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కి పడింది. వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతోపాటు జైలర్‌పై చర్యలకు కూడా ఆదేశాలు చేసింది. …
Read More »షర్మిల మ్యాటర్ అలా కాదా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీ తర్జన భర్జన నుంచి బయట పడింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఈ పార్టీకి రాజకీయ సెగ బాగానే తగిలింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించ డం నుంచి సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వరకు ఆయా పార్టీలు తీవ్ర విమర్శలే చేశాయి. ఇక, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలపై కూడా.. తీవ్ర విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా …
Read More »నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం’
మద్రాస్ హైకోర్టును ఒక మహిళ తాజాగా ఆశ్రయించింది. ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉన్నట్లుగా ఆమె ఆరోపించింది. కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. మద్రాస్ హైకోర్టుకు మధురైలో కూడా ధర్మాసనం ఉంది. ఇక్కడకు తంజావూరుకు చెందిన ఆర్తి అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తకు భారీ ఎత్తున పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ …
Read More »