శుభ్‌మన్ గిల్.. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు కీలకం అవుతాడనుకున్న ఆటగాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతనే చాలా రోజులుగా వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ, భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అతను అభిమానుల మనసు గెలిచాడు. కెరీర్లో తక్కువ వ్యవధిలోనే అతను డబుల్ సెంచరీ ఘనతను కూడా అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అతడి మీద జట్టు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టం అతణ్ని వెంటాడింది. …
Read More »వన్డే ప్రపంచ కప్ లో హయ్యెస్ట్ స్కోర్, ఫాస్టెస్ట్ సెంచరీ
భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు రికార్డుల మోత మోగించింది. ఈ రోజు ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సఫారీ జట్టు విధ్వంసం సృష్టించింది. శ్రీలంక బౌలర్లను సఫారీ బ్యాట్స్‌మెన్ ఊచ కోత కోశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి శ్రీలంక ముందు 428 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత …
Read More »ఏషియన్ గేమ్స్ క్రికెట్ లో భారత్ కు పసిడి పతకం
19వ ఏషియన్ గేమ్స్ లో తొలిసారిగా క్రికెట్ ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక, ఇదే జోరులో తాజాగా భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణ పతకం సాధించింది. వర్షం కారణంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫలితం రాకపోవడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు. మెరుగైన ర్యాంక్ …
Read More »తెలుగులో నెదర్లాండ్స్ బ్యాటర్ తేజ వీడియో వైరల్
2023 వన్డే ప్రపంచ కప్ నకు మన దేశం ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరగగా… రెండో మ్యాచ్ కోసం నెదర్లాండ్, పాకిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. ఉప్పల్ లో రెండు వామప్ మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ …
Read More »ప్రపంచకప్ ఆరంభం.. పరువు తీశారుగా
వన్డే ప్రపంచకప్ అంటే మామూలు టోర్నీ కాదు. క్రికెట్లో అంతకుమించిన ప్రతిష్టాత్మక టోర్నీ ఇంకోటి లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ టోర్నీకి ఈసారి భారతే ఆతిథ్యమిచ్చింది. మన దేశంలో ప్రపంచకప్ జరగడం ఇది నాలుగోసారి. కానీ గతంలో వేరే ఆసియా జట్లతో కలిసి ఆతిథ్యాన్ని పంచుకున్న భారత్.. ఈసారి సోలోగా ఆతిథ్యమిచ్చింది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ప్రపంచకప్ తొలి రోజు స్టేడియంలో కనిపించిన దృశ్యాలు చూసి అందరూ …
Read More »గుంటూరులో యువకుడి మీద యువతి యాసిడ్ దాడి
రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. సాధారణంగా అమ్మాయి.. తమను ప్రేమించట్లేదన్న కోపంతో ఆరాచకంగా వ్యవహరిస్తున్న కథనాల గురించి చదివే ఉంటారు. ఇప్పుడు అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటుచేసుకుంది. తనతో సహజీవనంలో ఉన్న యువకుడి మీద ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. గుంటూరు నగరంలోని నల్లపాడుకు చెందిన వెంకటేశ్ ఒక వాటర్ ప్లాంట్ లో పని …
Read More »హైదరాబాద్ పరువు ‘లులు’పాలు
లులు మాల్.. లులు మాల్.. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చ. దేశంలోనే అతి పెద్దదైన మాల్స్‌లో ఒకటైన ఈ మాల్.. వాస్తవానికి విశాఖపట్నంలో ఏర్పాటు కావాల్సింది. కానీ జగన్ సర్కారు ఇబ్బందులకు గురి చేయడంతో అక్కడి నుంచి తరలివెళ్లి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంతో రాజకీయంగా కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పటిదాకా ఇండియాలో చూడని భారీ హైపర్ మార్కెట్ సహా …
Read More »రీల్ కోసం పోలీస్ జీప్ ను వాడేసింది.. తర్వాతేమైంది?
సోషల్ మీడియాలో తాము ఫేమస్ కావాలన్న తపనతో కొందరు చేస్తున్న అతి.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా వారు చేసే పనులకు.. వారి మాయలో పడిన అధికారులకు దిమ్మ తిరిగే షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఒక పోలీసు అధికారి మీద వేటు పడింది. అతగాడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. …
Read More »హైదరాబాద్ లో రూ.1.26 కోట్లు పలికిన గణపతి లడ్డూ
నిమజ్జనం వేళ.. ప్రసాదంగా ఉంచిన గణపతి లడ్డూను వేలం వేయడం తెలిసిందే. పోటాపోటీగా సాగే ఈ లడ్డూ వేలంలో రికార్డు ధరలు ఎప్పటికప్పుడు నమోదు అవుతుంటాయి. హైదరాబాద్ మొత్తంలో రికార్డు స్థాయిలో ధర పలికే లడ్డూ వేలానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది బాలాపూర్ లడ్డూ వేలం. అయితే.. ఆ ధరల్ని సైతం బీట్ చేసేలా ఒక విల్లా వెంచర్ లో చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా …
Read More »10 బంతుల్లో అర్ధసెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ
ప్రపంచ క్రికెట్లో నేపాల్ జట్టు పసికూనే. కానీ ఆ పసికూనకు ఓ పసికూన దొరకడంతో ఒక మహా జట్టులా మారింది బుధవారం. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల క్రికెట్ టోర్నీ ఈ రోజే మొదలైంది. నేపాల్.. మంగోలియా జట్టుతో తలపడింది. మంగోలియా పేరు క్రికెట్లో ఇప్పటిదాకా ఎవరూ విని ఉండరు. ఈ మధ్యే అసోసియేట్ దేశాల జాబితాలోకి అడుగు పెట్టింది. అక్కడ పెద్దగా క్రికెట్ కల్చరే లేదు. ఏదో నామమాత్రంగా …
Read More »69 కేజీల బంగారం.. 336 కిలోల వెండి గణపతి
యావత్ దేశం చేసుకునే కొన్ని పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితికి గడిచిన కొంతకాలంగా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లు.. చివర్లో చేపట్టే నిమజ్జనానికి భారీ ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో.. తమ శక్తి కొలదీ గణేషుడి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తుంటారు అయితే.. దేశంలోనే అత్యంత సంపన్న గణనాధుడి విగ్రహంగా ముంబయిలో ఏర్పాటు చేసిన …
Read More »ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోరం : రోగిసోదరిపై రేప్!
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణం షాకింగ్ గా మారింది. చికిత్స కోసం సోదరుడు ఆసుపత్రిలో చేరితే.. అతడికి సాయంగా ఉండేందుకు వచ్చిన అతడి సోదరిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోగులు.. వారి బంధువుల భద్రతపై కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకకు …
Read More »