Trends

సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి

సౌదీ అల్ హసాలో టవర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షహబాజ్ ఖాన్ (27) అనే తెలంగాణ కరీంనగర్ కు చెందిన యువకుడు ఎడారిలో జీపీఎస్ పనిచేయక తప్పిపోయి చనిపోయాడు. తనతో పాటు ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు. 5 రోజుల క్రితం తనతోపాటు ఉండే వ్యక్తితో కారులో బయటకు వెళ్లారు. జీపీఎస్ లేక దారి తప్పి రబ్ అల్ ఖలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్లారు. కారులో …

Read More »

వైసీపీలో ఇది చాలదు.. ఇంకా పెంచాల్సిందే..!

ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచ‌నా? అంటే.. ఇంకా కొంచెం పెంచాల్సిందేన‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం సుప్త‌చేత‌నావ‌స్థలో వైసీపీని పుంజుకునేలా చేసేందుకు.. ఒక్క అడుగు అయితే ప‌డింది. పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. రెండు మాసాల‌కు వైసీపీలో మార్పులు చోటు చేసుకు న్నాయి. తాజాగా కొన్ని కీల‌క స్థానాల‌ను మార్పు చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌లువురిని పార్టీ కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రిని.. జిల్లాల స్థాయిలో …

Read More »

‘మనమే’ వెనుక మహా మోసం

శర్వానంద్ నటించిన మనమే థియేటర్లలో గొప్ప ఫలితం అందుకోలేదు కానీ ఉన్నంతలో ఓ మోస్తరుగా ఆడి సెలవు తీసుకుంది. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. హీరోయిన్ కృతి శెట్టి, హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆకర్షణలు డిజిటల్ ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేశాయి. కానీ రోజులు గడిచే కొద్దీ కాలం కరిగిపోతోంది కానీ మనమే దర్శనం మాత్రం …

Read More »

బాలీవుడ్ కు షాక్ .. ప్రభాస్ నంబర్ వన్ !

సినిమారంగంలో స్టార్ హీరోలు, నంబర్ వన్ స్థానాలు అంటే దేశంలో బాలీవుడ్ హీరోల పేర్లే వినిపిస్తాయి. అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఖాన్ల ద్వయమే ముందుంటుంది. అయితే వారందరినీ పక్కకు నెట్టి మన రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ఇండియాలో నంబర్ వన్ స్థానం ఆక్రమించాడు. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో …

Read More »

సారయ్యపై భగ్గుమన్న కొండా

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. పోచమ్మ మైదానం వద్ద దారిలో డబ్బాలు అడ్డుగా ఉన్నాయని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య వాటిని తీయించారు. చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థికసాయం చేసిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సారయ్యపై మండిపడ్డారు. గతంలో పార్టీ మారినప్పుడు తాను పదవికి రాజీనామా చేశానని, చేతనైతే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరాడు. ఎమ్మెల్సీ, …

Read More »

పదవి నాకు అలంకారం కాదు బాధ్యత !

పదవి నాకు అలంకారం కాదు. బాధ్యత. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వైసీపీ హయాంలో గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  ఏపీలోని 75 శాతం గ్రామ పంచాయతీలలో వైసీపీకి చెందిన వారే సర్పంచ్ లుగా ఉన్నారని,  గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి …

Read More »

తిరుమలలో గోల్డ్ బాయ్స్ సందడి

మహారాష్ట్రలోని పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ తిరుమలలో సందడి చేశారు. సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్తత్రయ గుజర్ , ప్రీతి సోని అనే ముగ్గురు శరీరంపై ఇద్దరు 10 కేజీల చొప్పున, ఒకరు ఐదు కేజీలు మొత్తం రూ.15 కోట్ల విలువైన 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం వీఐపీ దర్శనం చేసుకున్నారు. వారికి సెక్యూరిటీగా 15 మంది వెంట రావడం విశేషం.

Read More »

కొండాపూర్ ఇంట్లో 17 మంది ఫారిన్ అమ్మాయిలు.. విషయం తెలిస్తే షాక్

ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు …

Read More »

అచ్యుతాపురం ట్రాజెడీ.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ

ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు …

Read More »

పాతవన్నీ తవ్వితే ఎవరికి లాభం

మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో మరో దుమారానికి కారణమయ్యింది. ఆ వేడుకకు రావడానికి సుకుమార్ భార్య తబిత ఆ సినిమా నిర్మాత కాబట్టి అనే కోణంలో బన్నీ అన్న మాటలు వేరే అర్థంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాలకు వెళ్లి రావడం గురించి మరోసారి మెగా ఫ్యాన్స్ కొందరు తవ్వి తీస్తున్నారు. ఇక్కడితో ఆగడం లేదు. ఇవాళ రీ …

Read More »

విజయ్ పార్టీపై.. ఓ ముద్ర పడిపోనుందా?

సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం.. సొంతంగా పార్టీ పెట్టడం అత్యధిక స్థాయిలో జరిగే రాష్ట్రం తమిళనాడే. మన కంటే కూడా అక్కడ రాజకీయాల్లో సినీ స్టార్ల ఆధిపత్యం ఎక్కువ. సినీ రంగం నుంచి వచ్చిన కరుణానిధి, జయలలితలే అక్కడ సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజకీయాలను శాసించారు. వీరి బాటలో విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లు సైతం రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. అనుకున్నంత స్థాయిలో విజయవంతం …

Read More »

ఫామ్ హౌస్ చుట్టూ రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు. ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ …

Read More »