కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించి న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచారం ఘటన జరిగిన తర్వాత అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ఏదో దాస్తున్నారంటూ.. సర్కారు తీరు పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు సహా .. ఎఫ్ ఐఆర్ నమోదు విషయంలో పోలీసుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని ధర్మాసనం మండిపడింది. హత్యాచారం కేసును విచారించిన …
Read More »బీజేపీ వంతు.. సవ్వడిలేని సభ్యత్వ నమోదు
రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికిపైగా సభ్యత్వాలు తీసుకున్నారు. తద్వారా.. రూ.500 సభ్యత్వం కట్టిన వారికి రూ.5 లక్షలవరకు ప్రమాద బీమాను కల్పించారు. దీనికితోడు పవన్‌పై ఉన్న అభిమానంతో ఎక్కువ మంది పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఆ పార్టీ కూడా …
Read More »చేసేది స్వీపర్ ఉద్యోగం.. 9 లగ్జరీ కార్లతో అడ్డంగా దొరికేశాడు
ఈ దేశంలో గవర్నమెంటు ఆఫీసుల్లో స్వీపర్ కూడా అవినీతి చేయగలడు అని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ లో ఒక స్వీపర్ భాగోతం బయటకు వచ్చింది. అతగాడికి 9 లగ్జరీకార్లు ఉండటాన్ని అధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..తానేమీ తప్పు చేయలేదన్నట్లుగా సదరు స్వీపర్ చెప్పే మాటల్ని వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు కోట్లకు పడగలెత్తిన …
Read More »జూనియర్ డాక్టర్ హత్యాచారం ఎంత పాశవికమో చెబుతున్న రిపోర్టు
నిజానికి ఈ వార్త రాస్తున్నప్పుడు మనసు ఎంతో వేదనకు గురైంది. మనిషిలోని పశుత్వం కాదు.. పైశాచికత్వం ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఉన్న వివరాలు చదువుతున్న కొద్దీ వణికిపోతున్న పరిస్థితి. ఎంత ఆటవికంగా.. మరెంత అమానుషంగా హత్యాచారానికి పాల్పడ్డారన్నది పోస్టు మార్టం రిపోర్టులోని వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అవును.. మీరు ఊహించింది కరెక్టే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు …
Read More »వినేశ్ పతకంపై వీడని సస్పెన్స్
వినేశ్ ఫొగాట్.. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా పతకాలు గెలిచిన అథ్లెట్లను మించి చర్చనీయాంశం అయిన పేరింది. ఈ రెజ్లర్ 50 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుని కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే స్వర్ణమే దక్కేది. కానీ ఫైనల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఆమె మీద అనర్హత వేటు వేశారు. ముందు రోజు పోటీల సమయంలో నిర్ణీత …
Read More »సచిన్ గురించి భలే విషయాలు చెప్పిన అత్త
దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ క్రికెట్ కెరీరే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరమైంది. అతను తన కంటే వయసులో ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంజలిది ఆంగ్లో ఇండియన్ కుటుంబం కావడం విశేషం. తన తల్లి అనాబెల్ బ్రిటిష్ వ్యక్తి. ఆనంద్ మెహతా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ముంబయిలో సెటిలయ్యారు. ఓ సందర్భంలో ఆమె తనయురాలు అంజలిని చూడగానే …
Read More »ఖతర్నాక్ ‘మస్తాన్’ అరెస్టు.. గుంటూరులో డెన్!
హైదరాబాద్‌లోని విద్యార్థులకు, బుల్లితెర నటీనటులకు సహా.. కొందరికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి(32)ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న మస్తాన్.. గుంటూరులో డ్రగ్స్ డెన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఆయన కోసం కొన్నాళ్లుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వెలుగు చూసి.. తీవ్ర దుమారం రేపిన నటుడు రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారంలోనూ మస్తాన్ పేరు వినిపించింది. లావణ్యకు డ్రగ్స్ …
Read More »‘పర్సనల్’ చంపేస్తోంది!: ఆర్బీఐ హెచ్చరిక
దేశవ్యాప్తంగా ప్రజలు అప్పులు చేసేస్తున్నారని.. ఇది ప్రమాదకర ధోరణి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా(ఆర్బీఐ) హెచ్చరించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్.. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యక్తిగత రుణాలు(పర్సనల్) చేసేస్తున్నారని తెలిపారు. గత 2022-23తో పోల్చితే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. అయితే.. ఇది ప్రమాదకర ధోరణిని సూచిస్తోందనడం గమనార్హం. ఎందుకిలా? ఆర్బీఐ అంచనా …
Read More »ఒలింపిక్స్‌లో భారత్‌కు బిగ్ షాక్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. తుది మెట్టుపై బోల్తా కొడుతూ త్రుటిలో పతకం కోల్పోతుండడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఇప్పటికే ఏడు విభాగాల్లో భారత్‌కు పతకం అందినట్లే అంది దూరమైంది. ఇప్పుడు ఖాయమైన పతకం కూడా చేజారడం పెద్ద షాక్. మంగళవారం రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి …
Read More »అక్కడ హిందువుల పరిస్థితి ఘోరం
ఇప్పుడు ప్రపంచం దృష్టంతా బంగ్లాదేశ్ మీదే ఉంది. అక్కడ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుని.. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాక, దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇండియాకు మంచి ఫ్రెండుగా పేరున్న హసీనా.. ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమె బ్రిటన్‌కు వెళ్లాలని అనుకున్నా ఆ దేశం ఇప్పుడే అక్కడికి …
Read More »లెజెండరీ క్రికెటర్.. ఎలా అయిపోయాడో
వినోద్ కాంబ్లి.. 80, 90 దశకాల్లో ఇండియన్ క్రికెట్‌ను ఫాలో అయిన ఏ అభిమానీ ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. సచిన్‌తో కలిసే క్రికెట్ సాధన ఆరంభించి.. చాలా ఏళ్ల పాటు అతడితో కలిసే సాగాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి తన లాగే మెరుపులు మెరిపించాడు. సచిన్ లాంటి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే.. అతడి లాగే ఒక దిగ్గజ …
Read More »షాకింగ్.. 14 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ నష్టాలు!
కనీ వినీ ఎరుగని రీతిలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లు దారుణ పరిస్థితులను చవి చూస్తున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం అవుతూనే.. నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ నుంచి నిఫ్టీ వరకు.. బీఎస్ఈలో నమోదైన అన్ని సంస్థలు కూడా మార్కెట్‌లో నష్టాలు చవి చూస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద తుడిచి …
Read More »