దేశం కాని దేశంలో తెలంగాణకు చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను దారుణంగా చంపేసిన హంతకులు.. శవాన్ని చెత్తకుప్పలో పూడ్చి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్ శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల …
Read More »పార్టీల్లో మార్పులు సరే.. కేడర్ కలిసివస్తుందా? బిగ్ డౌట్?
పార్టీకైనా కేడర్ అత్యంత కీలకం. నాయకులు పుట్టుకురావొచ్చు. కానీ, వారు కూడా కేడర్ నుంచే కొన్ని కొన్ని సందర్బాల్లో కనిపిస్తారు. లేదా వారసులు వస్తున్నారు. కానీ, కేడర్‌ను పుట్టించడం అనేది ఒక్కసారి కోల్పోయాక.. పార్టీలకు చాలా కష్టం. దీనిని పెంచుకునేందుకు నాయకులు ప్రయాసలు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే .. ఇటీవల కాలంలో అన్ని పార్టీలూ.. కేడరే తమకు ప్రాణమని.. ప్రదానమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి.. …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి
రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఘోరం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) అనే యువకుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అఫ్సాన్ మృతి విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం కోసం ఏజెంట్లు …
Read More »డార్లింగ్ అని పిలిస్తే..జైలుకేనట!
డార్లింగ్…..సాధారణంగా చాలామంది తమ స్నేహితులను, సన్నిహితులు, ప్రేమించేవారిని పిలిచే పిలుపు. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ అని పేరుంది. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని, కొంతమంది కో స్టార్స్ ని ప్రేమగా, అభిమానంగా డార్లింగ్, డార్లింగ్స్ అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో పాటు డార్లింగ్ అని పిలిచే చాలామందికి కోర్టు షాకిచ్చింది. అపరిచితులను డార్లింగ్ అని పిలవకూడదంటూ కలకత్తా …
Read More »బైబై జాబితాలో బైజూస్?
ఆన్లైన్ కోర్సులతో విద్యార్థులను ఆకట్టుకున్న బైజూస్ సంస్థ.. మూసేసేందుకు రెడీ అయిందా? ఇక, బైబై చెప్పడం ఒక్కటే మిగిలి ఉందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు మూలిగేనక్కపై తాడిపండు పడిన చందంగా ఈ సంస్థలో భారీ పెట్టుబడి పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ సంస్థ తన మొత్తం పెట్టుబడిని 98 శాతం వెనక్కి తీసేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఇక, బైజూస్ …
Read More »ఆంధ్రా అబ్బాయి…అగర్తల అమ్మాయి
ఈ గ్లోబల్ జమానాలో ప్రేమలు రాష్ట్రాలే కాదు దేశాలే కాదు ఖండాలు దాటుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువతీ యువకులు ప్రపంచపు సరిహద్దులు చెరిపేస్తున్నారు. ప్రేమకు కులమతాలు..జాతి..అడ్డుకావని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా అబ్బాయి, అగర్తలా అమ్మాల ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ …
Read More »ఏపీ రాజధాని అమరావతే.. రెండో మాటే లేదు..
“ఏపీ రాజధాని అమరావతే. దీనినే మేం అంగీకరిస్తున్నాం. ఇక్కడి రైతులకు మద్దతు ఇస్తున్నాం. మేం అన్ని విషయాలను గమనిస్తున్నాం“ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో పర్యటించిన ఆయన విజయవాడలో బీజేపీ నేతలు నిర్వహించిన సమయన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలకమైన రాజధాని అంశంపై ఆయన ప్రధానంగా మాట్లాడారు. “ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన సమాచారం …
Read More »కేజీ చికెన్ రూ.300 దాటేసింది.. .అసలు కారణమిదే!
చికెన్ ధర కొండకెక్కింది. చూస్తుండగానే కేజీ చికెన్ ధర రూ.300 దాటేసింది. ఎందుకిలా? అంటే.. ఒక్కసారిగా విరుచుకుపడిన అనేక సమస్యలు దీనికి కారణంగా చెప్పాలి. చికెన్ ప్రియులకు షాకిచ్చేలా మారిన ఈ ధరల దెబ్బకు జేబులు చిల్లులు పడుతున్నాయి. ఏపీలో పెరిగిన చికెన్ ధరల కారణంగా తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీనికి తోడు వేసవి కాలం కావటంతో ఉత్పత్తి …
Read More »పరువు పోయింది.. అయినా అదే వరస
ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఒక ఎక్స్ట్రా ప్లేయర్‌ను మైదానంలో క్యాజువల్‌గా మందలించడం అతడి కెప్టెన్సీకే ఎసరు తేవడం.. తనతో ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) పెద్దలు అవమానకరంగా వ్యవహరించిన తీరుపై అతను పెట్టిన పోస్టు నేషనల్ లెవెల్లో దుమారం రేపింది. మైదానంలో సరిగా ఫీల్డింగ్ చేయకపోతేనో, ఇంకేదో తప్పు చేస్తేనో అప్పుడున్న ఆవేశంలో ఒక మాట అనడం మామూలే. విరాట్ …
Read More »క్రికెట్లో ఏపీ నేత జోక్యం.. ఇక ఏపీకి ఆడను:
ఇప్పటి వరకు రాజకీయం కొన్ని రంగాలకే పరిమితమైంది. అయితే.. తాజాగా క్రికెట్లోనూ ఏపీ నేతల జోక్యం పెరిగిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ క్రికెట్ హనుమ విహారీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌తోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఏపీ నేతల పాత్ర పెరిగిపోయిందని హనుమ విహారీ వ్యాఖ్యానించాడు. ఏపీకి చెందిన ఓ రాజకీయ నేత(విజయసాయిరెడ్డి అనే ప్రచారం ఉంది) జోక్యం కారణంగా తాను తీవ్రంగా …
Read More »డ్రైవర్లు దిగారు.. రైలు వెళ్లిపోయింది
పంజాబ్‌లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి. జమ్ము కశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 …
Read More »మీ ఆయనకు నెలనెలా 5 వేలు ఇవ్వండి: కోర్టు తీర్పు
“మీ ఆయనపై మీరు చేసిన ఆరోపణలు.. నిజం కాదని తేలిపోయింది. ఆయన మిమ్మల్ని హింసించడం కాదు.. మీరే ఆయనను మానసికంగా హింసించారు. దీనికి పరిహారంగా.. ఆయన కు నెలనెలా 5 వేల చొప్పున భరణం చెల్లించండి. ఇదే ఫైనల్“- అని ఓ భార్యకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో సదరు భార్య బిక్క మొహం వేసుకుని కోర్టునుంచి బయటకు వెళ్లిపోయింది. ఏం జరిగింది? వివాహితుల …
Read More »