హైదరాబాద్ లో నేడు జరిగిన అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన చిరు…అక్కడికి వచ్చిన పలువురు ప్రముఖులను పేరుపేరునా ప్రశంసించారు. ఈ క్రమంలోనే గుర్తు పెట్టుకొని మరీ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రస్తావించారు. ఆయనపై చిరు ప్రశంసలు కురిపించారు. అయితే, కాసేపటి తర్వాత అనూహ్యంగా చిరంజీవిపై గరికపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం …
Read More »షాకిస్తున్న ఐటీ కంపెనీలు
నిరుద్యోగులకు, ఉద్యోగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. చేసుకున్న రిక్రూట్మెంట్లను వాపసు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుందని అనుకుంటున్న ఆర్థిక మాంద్యం భయమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్ అన్నింటినీ కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఉద్యోగాలకు ఎంపికయ్యామని సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ తీవ్ర నిరాశ తప్పటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లు …
Read More »దృశ్యం సినిమా క్రైమ్ నిజం చేశారుగా !
‘దృశ్యం’ సినిమా చూసే వుంటారు కదా! ఈ సినిమాలో హీరో.. తన కుమార్తె స్నానం చేస్తుండగా.. ఓ యువ కుడు మొబైల్‌లో చిత్రీకరించాడని తెలిసి.. ఆ యువకుడిని యువతి, తల్లి కలిసి చంపేయడం.. తర్వాత..దాన్ని.. కప్పిపుచ్చు కునేందుకు వ్యూహాత్మకంగా రక్తికట్టించడం.. తెలిసిందే. ఇప్పుడు సేమ్ అలానే జరిగింది. అయితే.. ఈ కేసులో యువతి, ఆమె తల్లి కలిసి.. తండ్రిని కడతేర్చారు. మిగిలిందంతా సేమ్ సీన్. ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని బెళగావికి …
Read More »అన్నంతపనీ చేసిన రష్యా
ఉక్రెయిన్లోని నాలుగు ప్రధాన ప్రాంతాలను కలిపేసుకుంటున్నట్లు ప్రకటించిన రష్యా అన్నంతపనీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య గడచిన ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో విజేతగా చివరకు ఏ దేశం నిలుస్తుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు. ఈ నేపధ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఉక్రెయిన్లోని నాలుగు కీలకమైన ప్రాంతాలను రష్యాలో కలిపేసుకోవాలని. డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, …
Read More »దేశంలో ప్రైవేటు జైళ్ళా ?
ఐరోపా దేశాల్లో ఉన్నట్లు మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు ఎందుకు నిర్మించకూడదు ? ఇది ఎవరో వేసిన ప్రశ్నకాదు. ఒక కేసు విచారణ సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు చేసిన కామెంట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రైవేటు జైళ్ళ నిర్మాణ ప్రస్తావన తెచ్చిందో వెంటనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు విచారణ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ మన జైళ్ళలో రద్దీ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. మన జైళ్ళల్లో …
Read More »కోహ్లి ఇన్‌స్టాలో ఒక్క పోస్టు పెడితే..
విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కాదు. మూడు ఫార్మాట్లలోనూ అతను కెప్టెన్సీకి దూరం అయ్యాడు. అతడి ఫామ్ కూడా మునుపటి స్థాయిలో లేదు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయక చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో సెంచరీ సంగతి పక్కన పెట్టి అర్ధశతకాలు సాధించడం కూడా కష్టమైపోయింది. ఐతే ఇటీవల ఆసియా కప్ నుంచి అతను పర్వాలేదనిపిస్తున్నాడు. ఐతే ఆట తగ్గినా, …
Read More »బుమ్రా ఔట్.. ఓ రేంజి ట్రోలింగ్
క్రికెటర్లు గాయపడడం.. కీలక మ్యాచ్‌లకు, టోర్నీలకు దూరం కావడం మామూలే. ఇంకో మూడు వారాల్లో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ఆడబోతుండగా.. టోర్నీలో జట్టుకు అత్యంత కీలకంగా భావిస్తున్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. ముందు అతను వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి దూరం అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో నొప్పి తాత్కాలికమే అనుకున్నారు. కానీ ఇంకో 24 గంటలు తిరిగేసరికి గాయం తీవ్రత …
Read More »అబార్షన్లపై సుప్రీం సంచలన తీర్పు
అబార్షన్లకు సంబంధించి దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో నిమిత్తం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి కాలేదన్న ఏకైకా కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్ట ప్రకారం మహిళలందరికీ సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత మహిళలకు తేడా …
Read More »ఇది చదవండి కూతురు విలువ తెలుస్తుంది!
సమాజంలో నేటికీ కూతుళ్లు అంటే.. భారం అనుకునే తండ్రులు ఉన్నారు. గర్భంలో ఉండగానే.. ఆడపిల్ల అని తెలిస్తే.. చాలు..ఏదో రూపంలో వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే.. అమ్మ రూపమే అమ్మాయిగా మనకు జన్మిస్తుందని.. ఎంతో మంది చెబుతున్నా.. ఎవరూ వినరు. అమ్మో.. అమ్మాయా! అని తెగ బాధపడిపోతారు. తెగ ఫీలైపోతారు. కానీ, అమ్మాయిలు నిజంగా భారమా? వారు అంత బరువా.?? అంటే .. కానేకాదని నిరూపిస్తోంది.. ఆ సైనికుడి గారాల పట్టి. …
Read More »భారత అమ్మాయిలు చేసింది రైటా రాంగా?
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్లో ఒక సిరీస్ గెలవడమే కాదు.. క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచుల సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న భారత అమ్మాయిలు.. చివరి వన్డేలోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. భారత లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి ఇదే చివరి సిరీస్ కావడం.. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ఆమె …
Read More »నిత్య పెళ్లికూతురు.. ఆరు పెళ్లిళ్లు..
డబ్బుకు ఆశపడి ఓ యువతి నిత్యపెళ్లికూతురు అవతారం ఎత్తింది.. ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది.. ఏడో వివాహానికీ సిద్ధమైంది.. అంతలోనే అడ్డంగా బుక్కైంది.. తమిళనాడుకు చెందిన ఓ యువతి ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి పీటలు ఎక్కుతూ ఆరుగురిని పెళ్లాడింది. ఏడో వివాహం చేసుకుంటుండగా.. ఆరో భర్తకు అడ్డంగా దొరికిపోయింది. తమిళనాడులోని నమక్కల్ జిల్లా పరంపథివెల్లూర్ సమీపంలోని కల్లిపాలాయం ప్రాంతానికి చెందిన ధన్పాల్.. వివాహం …
Read More »కోమాలో ఉన్నాడని.. 18 నెలలుగా శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. !!
ఇదొక చిత్రమైన సంఘటన. అంతకుమించి.. హృదయ విదారక ఘటన కూడా. ఏడాది కిందటే మరణించిన కుటుంబ సభ్యుడిని ఆయన బంధువులు.. ఇంకా కోమాలోనే ఉన్నారని.. భావించి ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు కన్ను తెరుస్తారని.. ఆశగా ఎదురు చూశారు. కానీ, 18 నెలలు గడిచినా ఆయనలో చలనం లేదు. ఎందుకంటే.. ఆయన అప్పటికే తుదిశ్వాస విడిచిపెట్టారు. పోనీ.. ఈ కుటుంబం ఏమైనా నిరక్షరాస్యతతో బాధపడుతోందా? అంటే.. ఉన్నతస్థాయిలో ఉన్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates