ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారత రిజర్వు బ్యాంకును జలగం సుధీర్ అనే పెద్ద మనిషి తన బుర్రలో ఉన్న సందేహాల్ని ఒక పేపర్ మీద రాసేసి పంపారు? కరెన్సీ నోట్లకు సంబంధించిన సమాచారం తెలసుకునేలా ఆయన అడిగిన ప్రశ్నలకు.. భారత రిజర్వు బ్యాంకు తాజాగా సమాధానాలు ఇచ్చింది. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటమే తప్పించి? కారణాల్ని వివరించటం లాంటివి చేయాలన్న రూల్ లేకపోవటంతో.. …
Read More »ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు అన్ని మరణాలా?
కరోనా కేసుల సంఖ్య.. మరణాల లెక్కలు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు నమోదయ్యాయి.. ఐదారుగురు చనిపోయారు అంటేనే చాలా భయపడిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేలల్లో కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో వాస్తవ కేసులు, మరణాల లెక్కల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇక్కడితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్యలో కేసులుంటున్నాయి. …
Read More »నిజమా.. హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి వచ్చేస్తోందా?
తెలంగాణలో నెల కిందట్నుంచి రోజూ వెయ్యికి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులో మెజారిటీ హైదరాబాద్ పరిధిలోనివే. ఈ మధ్య అయితే రోజూ హైదరాబాద్ పరిధిలోనే 1000-1500 మధ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఖ్య ఎంతకీ తగ్గట్లేదు. మరణాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంటోంది. ప్రభుత్వం అటు ఇటుగా రోజుకు 10 మరణాలంటోంది కానీ.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఆ నంబర్ ఎక్కువే అని మీడియా …
Read More »100 బిలియన్ డాలర్ల క్లబ్బులో ఫేస్బుక్ అధినేత
స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్‌ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్‌బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను. ఫేస్ బుక్‌తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు …
Read More »గుడ్ న్యూస్ః రూ.225కే కరోనా వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో…ఇప్పుడు అందరి చూపు వ్యాక్సిన్‌పైనే. ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు తీసుకువస్తున్నాయనే ప్రచారం ఎందరిలోనో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్పర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు నిర్వహిస్తోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ …
Read More »అంతటి ట్రాక్ రికార్డు ఉన్నా.. ఘోర ప్రమాదం తప్పలేదే?
కోజికోడ్ విమాన దుర్ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. విధి వైచిత్రం కాకుంటే.. అసలీ ప్రమాదం జరగాల్సిందేనా? అన్నది చూస్తే.. నో అనే మాట అనిపించక మానదు. చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరన్నట్లుగా ఈ ప్రమాదం కనిపించక మానదు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. భారీగా వరద నీరు ఒక వీధిలో ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉంటారు. ఒకరు …
Read More »టెస్టుకు వెళితే కిట్ అంటకట్టేస్తున్నారు
భయాన్ని సొమ్ము చేసుకోవటం ఒక అలవాటుగా మారితే ఎంత ప్రమాదమో.. కరోనా వేళ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే తెలుస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు.. ముందు వెనుకా చూసుకోకుండా టెస్టుల కోసం పరుగులు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే తామున్నట్లుగా ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను అమలు చేయకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. …
Read More »ఆ మోడల్ ఇప్పుడు సివిల్స్ టాపర్ గా నిలిచింది
ఫ్యాషన్ రంగానికి.. ప్రజాసేవకు ఏ మాత్రం పోలిక ఉండదు. కానీ.. కొన్నిసార్లు రేర్ కాంబినేషన్లు అలా సెట్ అవుతాయి. తాజాగా సివిల్స్ ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. మీడియా కన్ను పెద్దగా పడని ఒక పేరు ఉంది ఆమె పేరే ఐశ్వర్య. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో టాప్ 100లోపు ర్యాంక్ సాధించి టాపర్ గా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టాపర్ కు తెలంగాణతో లింకు …
Read More »ఐపీఎల్ టోర్నీ వేళ.. స్టార్ హోటళ్లలో బస వద్దట
క్యాలెండర్ మారినంతనే క్రికెట్ క్రీడాభిమానులు ముందుగా చూసేది ఐపీఎల్ టోర్నీ కోసమే. దాదాపు నెలన్నర పాటు సాగే ఈ టోర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో.. దీని విషయంలో ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరగని విషయం తెలిసిందే. తాజాగా ఈ టోర్నీని దుబాయ్ లో నిర్వహించాలని డిసైడ్ చేయటం తెలిసిందే. వేదికను డిసైడ్ చేయటం బాగానే ఉన్నా.. క్రీడాకారుల బస.. వారి ఆరోగ్యం.. కరోనా …
Read More »వ్యాక్సిన్‌కు క్లియరెన్స్ రాకముందే భారీగా ఉత్పత్తి
కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా దేశాలు వైరస్ బారిన పడి అల్లాడుతున్నాయి. దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. ప్రాణ నష్టం సహా ఎన్నో రకాల నష్టాలు చూస్తున్నారు జనాలు. ప్రపంచమంతా ఒకరకమైన స్తబ్దత నెలకొందిప్పుడు. అదంతా పోవాలంటే కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే. అన్ని అనుమతులూ పొంది కరోనాకు చక్కగా పని చేసే వ్యాక్సిన్ …
Read More »వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమై భారత్ సహా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. జనాల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కష్టాలన్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైరస్‌ను పారదోలాలి. దాని కోసమే అందరూ ఎదురు …
Read More »విదేశాల నుంచి దేశానికి రావొచ్చు.. కాకుంటే షరతులు వర్తిస్తాయి
కరోనా మీద ప్రపంచానికి క్లారిటీ వస్తోంది. ఈ వైరస్ ప్రపంచానికి పరిచయమైన తొలినాళ్లలో లాక్ డౌన్ తో వ్యవస్థల్ని ఎక్కడికక్కడ స్తంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వైరస్ తీవ్రత ఒకట్రెండునెలలతో పోయేది కాదని.. అది నెలల తరబడి కొనసాగుతుందన్న విషయాన్ని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే గుర్తించాయి. అందుకే.. ఎవరికి వారు కొన్ని మినహాయింపులు ఇస్తూ.. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. లాక్ …
Read More »