టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్టు చేసి.. డ్రగ్స్ నుస్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్ర నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
ఆయన నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఆయన వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆయన నుంచి ఎంత కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం బయటకు రాలేదు. ఈ మొత్తం ఉంతానికి సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది.
గతంలోనూ టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగటం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించటం తెలిసిందే. డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్.. చార్మి.. నవదీప్.. రవితేజ.. సుబ్బరాజు..తరుణ్.. నందు..తనీశ్ లతో పాటు పలువురు ప్రముఖుల్ని ఈడీ అధికారులు విచారించారు.అయితే..వీరిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేని కారణంగా వీరికి క్లీన్ చిట్ లభించింది. అప్పట్లో వీరి నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించగా.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడిప్పుడు డ్రగ్స్ ఆరోపణల నుంచి టాలీవుడ్ బయటకు వస్తుందన్న మాట వినిపిస్తున్న వేళ.. నిర్మాత కేపీ చౌదరి అరెస్టు కావటం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates