Trends

విమానాలకూ మిడతల ముప్పు…

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని …

Read More »

ఇండియాలో కరోనా.. ఇంకో 20 రోజులకు ఏం జరగబోతోంది?

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదయ్యాక.. లక్ష కేసుల మార్కును అందుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది. కానీ గత పది రోజుల వ్యవధిలో కేసులు 60 వేల దాకా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఇది పతాక స్థాయి కాదని అంటున్నారు నిపుణులు. ముందుంది ముసళ్ల పండగ …

Read More »

కలం కనే కలలు…

వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి తెలుగు మీద ఉన్న అభిమానం తో ఒక కవిత సంకలనం రచించారు. దీనికి వారి వాట్సప్ గ్రూప్ అయిన “కలం కనే కలలు” అని పేరు పెట్టారు. ఈ కవితా సంకలనం లో 42 మంది కలిసి వివిధ అంశాలను ఎంచుకుని కవితలు, కథల రూపంలో రాయడం జరిగింది. కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా …

Read More »

టీ20 ప్రపంచకప్పా.. ఐపీఎలా.. రేపు తేలిపోతుంది

కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్‌కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్‌ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా …

Read More »

మార‌టోరియం, మ‌ళ్లీ వ‌డ్డీనా..

క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, ప‌ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డ నేప‌థ్యంలో నెల‌వారీ ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో మార‌టోరియంకు అవ‌కాశ‌మిచ్చింది రిజ‌ర్వ్ బ్యాంకు. మూడు నెల‌ల పాటు ఈఎంఐలు వాయిదా ప‌డ్డాయ‌ని సంతోషించారు జ‌నాలు. కానీ ఈ మూడు నెల‌ల ఈఎంఐని అస‌లులోకి క‌లిపేసి దాని మీద వ‌డ్డీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. చివ‌ర్లో అద‌నంగా మూడు నెల‌లు కాకుండా ఏడెనిమిది నెల‌ల …

Read More »

హెచ్ 1బీ వీసా జారీలో మార్పులకు కొత్త బిల్లు.. ఏమవుతుంది?

దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు. అమెరికాలోని …

Read More »

భయం గొల్పుతున్న ముంబయి హాస్పిటల్ ఫొటో

లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే. రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా …

Read More »

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి యమా క్రేజ్, గంటల్లో లక్షల విక్రయం

తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్‌లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో …

Read More »

వరంగల్ కేసు మిస్టరీ వీడింది

వరంగల్‌ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది. ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది …

Read More »

జియో.. నెల రోజుల్లో 78 వేల కోట్లు

కరోనా వేళ.. అన్ని కంపెనీలకూ ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రెండు మూడు నెలలుగా మార్కెట్ ఎలా కుదేలవుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముఖేష్ అంబానీ సంస్థ రిలయెన్స్ జియో మాత్రం దూసుకెళ్తున్నాయి. ఆ సంస్థలోకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఆ సంస్థలోకి ఏకంగా రూ.78 వేల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయంటే ఆ సంస్థ ఎలా వెలిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా …

Read More »

విమానాల్లో వాయించేస్తున్నారుగా…

రెండు నెలలుగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు లేక సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలతో పాటు ఉన్నత వర్గాల వాళ్లందరూ ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వలస కూలీలు, సామాన్యుల కోసం రైళ్లు, బస్సులు పున:ప్రారంభించారు కానీ.. ప్రయాణాల కోసం విమానాల్నే ఆశ్రయించే వారు మాత్రం తమకెప్పుడు వెసులుబాటు లభిస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. ఐతే వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అంతర్జాతీయ ప్రత్యేక విమానాలు నడిపిన ప్రభుత్వం.. రోజు వారీ సర్వీసుల్ని ఈ …

Read More »

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం ఎక్కడుంది?

కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే …

Read More »