Trends

తత్కాల్ టికెట్ వేగం పెంచినందుకు జైలు శిక్ష

రైల్వే ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎంత స్పీడున్న ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా సరే.. టికెట్ బుక్ అవుతుందన్న గ్యారెంటీ ఉండదు. టికెట్ బుక్ చేస్తుండగా.. బెర్తులు అందుబాటులో ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ట్రాన్సాక్షన్ అయ్యేసరికి వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. మధ్యలో ఇంకా ఏవేవో సమస్యలు తలెత్తుతాయి. తత్కాల్ టైంలో అసలు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ కావడమే పెద్ద సమస్య అవుతుంటుంది కొన్నిసార్లు. …

Read More »

టీ20 క్రికెట్లో సెన్సేషనల్ రూల్స్

గత పది పదిహేనేళ్లలో ప్రపంచ క్రికెట్ ఎంతగా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టీ20 క్రికెట్ రంగ ప్రవేశంతో క్రికెట్ ఆడే తీరు, చూసే తీరు అన్నీ మారిపోయాయి. ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అభిమానుల్ని థ్రిల్ చేసేలా కొత్త రూల్స్ ప్రవేశ పెడుతూ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌ను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఐపీఎల్ తర్వాత ప్రపంచ క్రికెట్లో ఎక్కువ పాపులారిటీ …

Read More »

డ్రాగన్ కు గట్టి దెబ్బ..రూ. 40 వేల కోట్లు నష్టం

దీపావళి పండుగ సందర్భంగా డ్రాగన్ దేశానికి చాలా గట్టి దెబ్బ తగిలింది. ప్రతి ఏడాది లాగే ఇపుడు కూడా పెద్ద ఎత్తున చైనా నుండి రకరకాల టపాకాయాలను మనదేశంలోకి దిగుమతి చేసింది. అయితే రెండు కారణాల వల్ల చైనా టపాకాయలను కొనటం తగ్గించేసరికి వేల కోట్ల రూపాయల బిజినెస్ పడిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) విడుదల చేసిన లెక్కల ప్రకారం చైనాకు ఈ దీపావళిలో సుమారు రూ. …

Read More »

అల్లాడిపోతున్న అగ్రరాజ్యం..6 రోజుల్లో 10 లక్షల కేసులు

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. గడచిన ఎనిమిది మాసాల్లో ప్రపంచ దేశాల్లో నమోదైన కేసుల సంగతిని పక్కన పెట్టేసినా ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య కోటి దాటేసింది. దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. లాక్ డౌన్ లాంటి నిబంధనలను అమలు చేయటం, అమెరికా-ఇతర దేశాల మధ్య రాకపోకలను నిషేధించటం లాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే అనిపించింది. అందుకే అమెరికా …

Read More »

క‌రోనాకు ఏడాది.. ప్ర‌పంచ‌మే ఓడిపోయిందా?

క‌రోనా! ఈ మాట ఇంకా వినిపిస్తోంది. ఏరోజు కారోజు కొత్త‌గానూ ఉంది! కానీ, ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ జ‌నించి.. నేటికి ఏడాది పూర్త‌యింది. 2019, న‌వంబ‌రు 17న వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్‌.. అత్యంత వేగంగా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కంటికి క‌నిపించ‌కుండా.. కుళ్ల‌బొడిచేసింది. అగ్ర రాజ్యం.. అథ‌మ రాజ్యం అన్న తేడా లేకుండా.. స‌ర్వ‌ప్ర‌జ స‌మాన‌త్వం.. స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం.. విశ్వ‌స ‌మాన‌త్వం అనే మూడు సూత్రాల‌ను ఈ …

Read More »

దుబాయ్ ను మనోళ్ళు దున్నేస్తున్నారు

రియల్ ఎస్టేట్ రంగంలో మనోళ్ళు దుబాయ్ ను దున్నేస్తున్నారు. 2019 సంవత్సరంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడుల్లో భారతీయులదే టాప్ పొజీషన్. విచిత్రమేమిటంటే దుబాయ్ లో రియల్ రంగంలో సౌదీ అరేబియా, ఎమిరేట్ వాసులు కూడా మనకన్నా వెనకబడే ఉన్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంటు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 5246 మంది భారతీయులు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. మన వాళ్ళంతా కలిసి …

Read More »

ట్రంప్ కు మద్దతుగా అట్టుడికిపోతున్న వాషింగ్టన్

అందరు అనుమానిస్తున్నట్లుగానే అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌన్ ముందే ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. ట్రంప్ మద్దతుదారలను వ్యతిరేకిస్తు బైడెన్ మద్దతుదారులు కూడా పోటీ ఆందోళనలు మొదలుపెట్టడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరు మద్దతుదారులు ఒకేచోట చేరి …

Read More »

ఐపీఎల్ స్టార్.. ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేవాళ్లు అక్రమంగా బంగారం, లగ్జరీ వస్తువులను ట్యాక్స్ కట్టకుండా తీసుకురావడం,. ఎయిర్ పోర్టులో దొరికిపోవడం మామూలే. సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు సైతం ఇలా బుక్ అవుతుంటారు. తాజాగా యూఏఈలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ పదమూడో సీజన్ ముగించుకుని ఇండియాకు వచ్చిన ముంబయి ఇండయిన్స్ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఇలాగే అధికారులకు దొరికిపోయాడు. ఐపీఎల్లో విజేతగా నిలిచిన ముంబయి జట్టుతో కలిసి అతను …

Read More »

కరోనా వ్యాక్సిన్ ఇండియాకు వచ్చేసింది

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికి వచ్చేసింది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన బుధవారం భారత్ కు చేరుకుంది. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఎపిడమియాలజీ అండ్ మైక్రో బయాలజీ సంస్ధతో కలిసి భారత్ లోని రెడ్డీ ల్యాబరేటరీస్ కరోనా టీకా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను రెడ్డీ ల్యాబరేటరీస్ అందుకుంది. ఇదే వ్యాక్సిన్ను రష్యాలోని 42 …

Read More »

ఢిల్లీ జట్టు వద్దనుకున్నోడే కొంప ముంచాడు

అంచనాలేమీ తప్పలేదు. మళ్లీ ముంబయి ఇండియన్సే ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇది చాలామందిని నిరాశ పరిచింది. కానీ ఆ జట్టు బలం అలాంటిది మరి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్.. ఇలా ఏ రకంగా చూసినా ఆ జట్టుకు సాటి వచ్చే మరో టీం ఐపీఎల్‌లో కనిపించదు. ఐపీఎల్ అనే కాదు.. ప్రపంచ క్రికెట్ మొత్తంలో ముంబయి ఇండియన్సే బెస్ట్ ఐపీఎల్ టీం అంటే అతిశయోక్తి కాదు. ఆ …

Read More »

ఇదే బెస్ట్ ఐపీఎల్.. ఏమైనా డౌటా?

మొత్తానికి ఐపీఎల్‌కు తెరపడింది. కరోనా టైంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు ఈ టోర్నీనే గొప్ప ఉపశమనాన్ని అందించింది. మామూలుగానే ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈసారి రెట్టింపు వినోదాన్నందిస్తూ ఉర్రూతూలిస్తూ సాగింది టోర్నీ. లీగ్ ఇండియాలో జరగలేదు, స్టేడియాల్లో అభిమానులు లేరు అన్న మాటే కానీ.. ఎంటర్టైన్మెంట్‌‌కు మాత్రం ఢోకానే లేదు. ఒక్క మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు జరిగాయంటే.. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్నిసార్లు స్కోర్లు …

Read More »

ట్రంప్ కారణంగా అమెరికాలో పెరిగిపోతున్న టెన్షన్

అగ్రరాజ్యం అమెరికా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ వల్ల జస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఇబ్బందులు తప్పేలా లేదు. ఎందుకంటే మనకు లాగ ఎన్నికల ఫలితాలు రాగానే అధికారంలోకి వచ్చే పార్టీకి అధికారం అప్పగించే అవకాశం అమెరికాలో లేదు. తాజాగా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ బాధ్యతలు తీసుకునేది 2021, జనవరి 20వ తేదీన మాత్రమే. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి బాధ్యతలు …

Read More »