Trends

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఇక పై ‘గ్లో అండ్ లవ్లీ’

ఇండియాలో ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల గురించి తరచుగా వివాదాలు, చర్చలు నడుస్తుంటాయి. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్న భావన కలిగించే ఈ ప్రకటనల్ని, ఈ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. కంగనా రనౌత్ లాంటి కొందరు ఫిలిం స్టార్స్ ఇలాంటి యాడ్స్‌లో నటించకూడదని నియమం కూడా పెట్టుకున్నారు. ఇలాంటి యాడ్స్ కూడా వర్ణ వివక్షలో భాగమే అన్నది చాలామంది అభిప్రాయం. ఐతే ఎవరేమన్నా ఇండియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్ బిజినెస్ …

Read More »

ఖైరతాబాద్ విగ్రహం ఒక అడుగు కాదు

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్‌ను చూసే అవకాశం లేదే అనుకున్నారు. మరీ విగ్రహం ఎత్తును ఒక్క …

Read More »

మేకలకు కరోనా పరీక్షలు.. క్వారంటైన్‌కు తరలింపు

కరోనాకు మనుషుల్లో చిన్నా, పెద్దా.. రాజూ పేదా అనే తేడాి లేదని అనుకున్నాం. మనుషులు, జంతువులనే తేడా కూడా లేదని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. కర్ణాటకలో తాజాగా గొర్రెలు, మేకలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం. మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా కరోనా సో్కే అవకాశం ఉందని.. వాటి నుంచి కూడా మనుషులకు కరోనా సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో …

Read More »

ఆ 59 యాప్స్‌పై నిషేధం.. 45 వేల కోట్ల నష్టం?

ఇండియాలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపితే ఆ దేశానికి నష్టం కానీ.. చైనా యాప్‌లను నిషేధిస్తే వచ్చే నష్టమేంటి అన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. కానీ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం గురించి తక్కువ అంచనా వేస్తే తప్పే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ యాప్‌గా ఉన్న టిక్ టాక్‌తో పాటు మరో పాపులర్ యాప్ ‘హలో’.. ఇంకొన్ని చైనా యాప్‌ల యాజమాన్య సంస్థ ‘బైట్ డ్యాన్స్’.. …

Read More »

కరోనాకు ఆ వ్యాక్సిన్ పని చేస్తోందట

కరోనాకు ఆ మందు పని చేస్తోందట.. ఈ మందు మంచి ఫలితాలనిస్తోందట.. అని వార్తలు చాలా మామూలైపోయాయి ఈ మధ్య. ఐతే వ్యాధి తీవ్రతను బట్టి, అది సోకిన మనుషుల్ని బట్టి వివిధ స్థాయిల్లో పని చేసే మందులైతే వచ్చాయి కానీ.. నూటికి నూరు శాతం కరోనాను తగ్గించే మందు అయితే ఇంకా ఏదీ రాలేదు. ఐతే కరోనాను నియంత్రించాలంటే మందు కంటే ముందు వ్యాక్సిన్ రావడం ముఖ్యం అన్నది …

Read More »

ఇటు టిక్ టాక్ బ్యాన్‌.. అటు చైనా కంపెనీల‌తో భారీ డీల్‌

Adani

చైనాకు ఆదాయం తెచ్చి పెట్ట‌డంతో పాటు మ‌న డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయ‌న్న అనుమానాల‌తో ఒకేసారి 59 చైనా యాప్‌ల‌ను నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనిపై నిన్న‌ట్నుంచి పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. యాప్‌ల‌ను అయితే సులువుగానే నిషేధించేశారు.. మ‌రి చైనా ఉత్ప‌త్తుల వినియోగం మాటేంటి అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. దేశంలో చైనా కంపెనీలు వేలు, ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాయి. ఆ దేశానికి …

Read More »

టిక్ టాక్ బ్యాన్.. ఆ యాప్‌కు కోటి డౌన్‌లోడ్లు

భార‌తీయ మొబైల్ యూజ‌ర్ల ఫేవ‌రెట్ యాప్స్ చాలానే ఒకేసారి బ్యాన్ అయిపోయాయి. చైనాకు ఆదాయం తెచ్చి పెట్ట‌డంతో పాటు మ‌న డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయ‌న్న అనుమానాల‌తో ఒకేసారి 59 చైనా యాప్‌ల‌ను నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. అందులో భార‌తీయుల మోస్ట్ ఫేవ‌రెట్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. దీనికి దేశంలో కోట్లాదిమంది బానిస‌లైపోయారు. రోజూ టిక్‌టాక్ చూడ‌కుండా, వీడియోలు చేయ‌కుండా నిద్ర‌ప‌ట్ట‌ని వాళ్లు కోట్ల‌ల్లో ఉన్నారు. అలాంటి …

Read More »

ఇవి చేస్తే.. హైదరాబాద్ కు పట్టిన కరోనాని వదిలించొచ్చు

నేను బాగుండాలనుకోవటం ‘బీసీ’ (బిఫోర్ కరోనా) మాట. ఇప్పుడు పక్కనోడు బాగుండాలనుకోవటం ‘ఎసీ’ (ఆఫ్టర్ కరోనా) మాట. నువ్వు బాగుండాలంటే పక్కనోడు కచ్ఛితంగా బాగుండాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు క్షేమంగా బతికి బట్టకట్టగలుగుతావు. భయపడటం వేరు. జాగ్రత్తగా ఉండటం వేరు. ఈ రెండూ ఒకటే అనుకొని తప్పులు చేసేటోళ్లు చాలామంది కనిపిస్తారు. నిజానికి.. ఈ భావనే హైదరాబాద్ ను కరోనాకి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తోంది. వెయ్యి కేసులు నమోదు …

Read More »

గుండెలు పిండేలా తెలుగు రాష్ట్రాల్లో ఆ 5 మరణాలు

ఒక రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే మరణాలు చాలానే ఉంటాయి. కానీ.. శుక్రవారం చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. తదనంతర పరిణామాల గురించి తెలిస్తే గుండెలు పిండేసినట్లు కావటమే కాదు.. భయంతో నోట మాట రాదన్నట్లుగా పరిస్థితి ఉంది. మాయదారి రోగం ఏమో కానీ.. మనుషుల్ని కబళించేస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. కరోనా …

Read More »

వ‌ర్క్ ఫ్రం ద్వారా జ‌రుగుతున్న పెద్ద న‌ష్టం ఏంటంటే…

వ‌ర్క్ ఫ్రం హోం… ప్ర‌ధానంగా ఐటీ ఉద్యోగుల‌కే…అది కూడా ఆఫీసుకు రాలేని వేళ‌ల్లో క‌ల్పించే అవ‌కాశం. క‌రోనా వ‌ల్ల విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని టెక్కీలంద‌రినీ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా ప‌నులు చేయించుకున్నాయి. లాక్ డౌన్ స‌డ‌లింపుల తర్వాత కూడా ఇప్ప‌టికీ కొన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం కొన‌సాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కుంటుండ‌గా…కొన్ని రంగాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కుంటున్న‌ట్లు తెలుస్తోంది. …

Read More »

దిమ్మ తిరిగిపోయే ఉద్యమాన్ని.. మాస్క్ కట్టుకోను

ప్రపంచాన్ని మహమ్మారి కమ్మేసిన వేళ.. యావత్ ప్రపంచం పలు జాగ్రత్తల్ని తీసుకుంటోంది. ఇందులో భాగంగా భౌతిక దూరాన్ని పాటించటం.. ముఖానికి మాస్కులు కట్టుకోవటం.. చేతికి అదే పనిగా శానిటైజర్ వాడటం.. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఊరంతా ఒక దారి అయితే.. ఊలిపికట్టది మరో దారన్నట్లుగా ఇప్పుడు యవ్వారం తెర మీదకు …

Read More »

ఇండియాలో అనుతించిన కరోనా మెడిసిన్స్ ఇవే

కరోనాను పూర్తిగా నివారించే మందు ఇంకా ఎక్కడా కనిపెట్టలేదు. కరోనాకు మందొచ్చేసిందంటూ ఎప్పటికప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ ఓ మోస్తరుగా వైరస్‌ను తగ్గించేవే తప్ప.. మొత్తంగా వైరస్‌ను పారదోలేవి కావు. గ్లెన్ మార్క్ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ‘ఫాబి ఫ్లూ’ సైతం ఇలాంటిదే. కరోనా తక్కువగా, మధ్యస్థంగా ఉన్న రోగులు ఈ మందు వాడితే కోలుకుంటారు. ఐతే ‘ఫాబి ఫ్లూ’తో పాటు మరికొన్ని మందుల గురించి కూడా …

Read More »