భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన జోడీల్లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్‌లది ఒకటి. గంగూలీతో కలిసి చరిత్రాత్మక భాగస్వామ్యాలు ఎన్నో నెలకొల్పి, రికార్డుల మోత మోగించాక.. సచిన్ వీరూతో జత కలిశాడు. సచిన్ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చి, సచిన్‌ను అనుకరిస్తూ బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్న వీరూ.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు. సచిన్ కెరీర్ ఆరంభంలో ఎలా దూకుడుగా ఆడేవాడో.. అదే స్థాయిలో కెరీర్ ఆద్యంతం విధ్వసంక …
Read More »వైరల్ వీడియో.. కోవిడ్ పేషెంట్ల ముందు డాక్టర్ డ్యాన్స్
https://www.youtube.com/watch?v=4JBIrfeAMNk స్కూల్లో కాలేజీల్లో చదువుకునేటపుడు ఎన్నో టాలెంట్లు ప్రదర్శించి సరదాగా జీవితాన్ని గడిపేసే వ్యక్తులు.. ఆ తర్వాత సీరియస్‌గా సాగే వృత్తుల్లో పడి తమ ప్రతిభను మరుగున పడేస్తుంటారు. వాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎప్పుడో కానీ రాదు. అలా వచ్చినపుడు వాళ్ల ప్రతిభ చూసిన కొత్త వ్యక్తులు ఆశ్చర్యపోతుంటారు. వీళ్లలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తారు. తాజాగా ఒక వైద్యుడు అలాగే తన ప్రతిభను ప్రదర్శించి అందరినీ …
Read More »ధోనీకి ఎందుకింత మొండితనం?
అన్నీ కలిసొస్తున్నపుడు ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ పరిస్థితులు తిరగబడ్డపుడే నిర్ణయాలు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. మహేంద్రసింగ్ ధోనీకి ఈ విషయం ఇప్పుడు బాగానే బోధపడుతూ ఉంటుంది. ఐపీఎల్‌లో ఇంతకుముందు చెన్నై జట్టు ఎలా ఉన్నా సరే బాగా ఆడేది. టోర్నీలో ఒడుదొడుకులు ఎదురైనా సరే.. పుంజుకునేది. డాడీస్ ఆర్మీ అని కౌంటర్లు పడ్డా సరే.. వయసు మళ్లిన ఆటగాళ్లనే నమ్ముకుని ధోనీ అద్భుతాలు చేశాడు ఆ జట్టుతో. …
Read More »ప్రపంచకప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా.. ఎందుకలా?
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో స్కోర్లు సమం కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టై కావడం.. ఐతే మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదినందుకు ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ దక్కడం తెలిసిన సంగతే. అప్పుడు అందరూ న్యూజిలాండ్ పరిస్థితి చూసి అయ్యో అనుకున్నారు. కేవలం బౌండరీలు ఎక్కువ కొట్టినందుకు ఒక జట్టుకు ప్రపంచకప్ ఇచ్చేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నిబంధనను …
Read More »ధోనీని తొందరపడి తిట్టేయకండి
ఒకప్పుడు తమకు ఎంతమాత్రం విజయావకాశాలే లేవనుకున్న ఎన్నో మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేసేది. చివర్లో కథ మొత్తం మారిపోయేది. కానీ ఇప్పుడు కథ రివర్సవుతోంది. చెన్నై చేతిలో ఉన్న మ్యాచ్‌లను ప్రత్యర్థి జట్లు ఎగరేసుకుపోతున్నాయి. ఆ జట్టు కెప్టెన్ ధోని మ్యాజిక్ ఎంతమాత్రం పని చేయట్లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవమైన దశను చూస్తున్నాడు కెప్టెన్ కూల్. ఈ సీజన్లో ఆ జట్టుకు, ధోనీకి ఎంతమాత్రం కలిసి రావడం …
Read More »ఆంధ్రా అమ్మాయి కోసం నిర్భయ న్యాయవాది
ఇండియాలో ఎక్కడైనా అమ్మాయిపై అత్యాచారం జరిగి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతే జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులు వీరావేశంతో స్పందిస్తారు అందరూ. కానీ ఆ తర్వాత అంతా మరిచిపోతారు. ప్రభుత్వాలు కూడా ఆ వేడి ఉన్నంత వరకు ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇస్తాయి. ఆ తర్వాత కేసును నీరుగార్చేస్తుంటాయి. నిర్భయ, దిశ లాంటి కొందరి విషయంలో మాత్రమే సత్వర చర్యలు చోటు చేసుకున్నాయి. చాలా కేసులు …
Read More »హైదరాబాద్ : బర్త్ డే పార్టీకి పిలిచి గ్యాంగ్ రేప్ చేశారు
హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన రోజు పార్టీ పేరుతో కాలేజీ విద్యార్థిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసిన వైనం సంచలనంగా మారింది. నమ్మించి మోసం చేయటమే కాదు.. తాము చేసిన పనిని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన వైనాన్ని.. బాధితురాలు ధైర్యంగా బయటకు చెప్పటంతో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులతో కలిసి ఉండే పందొమ్మిదేళ్ల డిగ్రీ విద్యార్థిని సికింద్రాబాద్ లో చదువుతోంది. …
Read More »8 మంది ప్రాణాలు తీసిన నూడుల్స్
ఇది మాటలకందని విషాదం. నూడుల్స్ తినడం వల్ల ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కాకపోతే ఈ విషాదం చోటు చేసుకుంది చైనాలో. ఆ దేశం నూడుల్స్‌కు ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. నూడుల్స్ వచ్చిందే అక్కడి నుంచి. నూడుల్స్ విషయంలో చైనీయులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ కుటుంబం సొంతంగా …
Read More »ట్రంప్ కు.. ఇండియన్ అమెరికన్స్ బిగ్ షాక్
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే నెలలో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించి.. రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలని ట్రంప్ అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే ఆయన ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. స్థానికతకు పెద్దపీట వేస్తున్న ఆయన గెలుపు గుర్రం ఎక్కే క్రమంలో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అయితే, …
Read More »ధోనీ కోపం.. ఆగిపోయిన అంపైర్.. దుమారం
ఈ ఏడాది ఐపీఎల్‌లో అంపైరింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కరోనా భయం మధ్య, బయో బబుల్‌లో, అది కూడా యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసే ఎలైట్ అంపైర్లు ఈసారి అందుబాటులో లేరు. చాలా వరకు భారతీయ అంపైర్లు, అంతగా పేరు లేని విదేశీ అంపైర్లు మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐతే వారి అంపైరింగ్ ప్రమాణాలకు తగ్గట్లు లేకపోవడం విమర్శల …
Read More »ఐపీఎల్‌లో చెన్నై రికార్డు పోయినట్లేనా?
ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబయి తర్వాత మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉండటమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచి ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నైయే. ఈ విషయంలో ముంబయి సైతం చెన్నై కంటే వెనుకే ఉంది. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో పెద్దగా అంచనాల్లేకుండా లీగ్‌లో బరిలోకి …
Read More »ట్విట్టర్ లో ఇడ్లీ వార్.. అసలేం జరుగుతోంది?
ఎవరి ఆహార అలవాట్లు వారివి. తమకు నచ్చిన వాటిని ఆకాశానికి ఎత్తేయటం తప్పేం కాదు. అదే సమయంలో తమకు నచ్చని వాటి విషయంలో మాటల్ని ఇష్టారాజ్యంలా కాకుండా ఆచితూచి అన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒక బ్రిటీష్ ప్రొఫెసర్ అనుసరించిన తీరు పెద్ద చర్చకు తెర తీయటమే కాదు.. ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్వీట్ల యుద్ధం సాగుతోంది. దక్షిణాది రాష్ట్రాల వారు అత్యంత …
Read More »