Political News

‘గుడ్‌మార్నింగ్’ చెప్పావని గుడ్డిగా ఓట్లేస్తారా కేతిరెడ్డీ?

‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే సామెత రాజకీయాల్లో చాలామంది పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కూడా ఇది కరెక్టుగా సరిపోతుందట. పొద్దున్న లేవగానే ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ అంటూ కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు నుంచి దిగి రెండు మూడు గంటల పాటు కేతిరెడ్డి చేసే హడావుడిని ఫేస్‌బుక్ లైవ్‌లో వేలమంది చూస్తుంటారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందని లక్షలాది మంది కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బీభత్సమైన ఫ్యాన్స్‌గా …

Read More »

‘జగన్ వల్లే కాలేదు.. కేసీఆర్‌తో ఏమవుతంది?’

ఏపీలో బీజేపీ సీనియర్లు పవన్ కల్యాణ్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ సొంత బలం కంటే పవన్ బలంతో ఏపీని ఏలగలమని నమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నారు. బీజేపీలో ఉండీ ఉండనట్లుగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పవన్‌కు అండగా ఉంటానంటూ బహిరంగంగా మద్దతు ప్రకటించగా.. తాజాగా మరో నేత కూడా పవన్ పక్షం వహించారు. బీఆర్ఎస్ ఏపీలో కాపులను ఆకర్షిస్తూ పవన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని, పవన్‌ను ఎవరూ ఏమీ …

Read More »

సాయిరెడ్డి బాధ్యతలు సజ్జల కొడుక్కి..

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం, పట్టు క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందినవారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్టేక్ చేశారని… సాయిరెడ్డి మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తున్నారని అంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సాయిరెడ్డి చేతిలో ఉన్న కొద్దిపాటి పవర్స్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ తానే చూస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనికోసం ఆయన …

Read More »

ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంపీటీసీ… అధికారం అంటే అహంకారమా?

తెలుగు రాష్ట్రాలలో కొందరు రాజకీయ నాయకులే కాదు.. కొందరు అధికారులూ విచక్షణారహితంగా పనిచేస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలే కనిపించాయి. ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ అధికార గర్వంతో చేసిన పనులు చర్చనీయమయ్యాయి. ఎమ్మెల్యే:తెలంగాణలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి వద్ద టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీ టీవీ విజువల్స్‌లోనూ …

Read More »

ఆనం టీడీపీలో చేరుతున్నారా ?

వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటున్న ఆనం రామ నారాయణ రెడ్డి.. టీడీపీ వైపు చూస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వాన్నే ఇరుకునపెట్టిన ఆయన్ను వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా ఆయనకు వ్యతిరేకమయ్యారు. పార్టీలో ఏకాకిగా మారిన ఆనం ..ఇప్పుడు పచ్చ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆనం కుటుంబం మొదటి నుంచి …

Read More »

కన్నా రాజకీయం మొదలైంది.. పవన్‌కు బహిరంగంగా మద్దతు

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తాను అండగా ఉంటానని ప్రకటించారు. ఏపీలో పవన్ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్న తరుణంలో కేసీఆర్, జగన్‌లు కలిసి ఆయన్ను బలహీనపర్చే లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్‌లో చేరికల పేరుతో ఎర వేస్తున్నారని కన్నా అన్నారు. కాగా కన్నాకు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల?

Eetela Rajendra

తెలంగాణలో కేసీఆర్‌ను సాగనంపడానికి అన్ని మార్గాలనూ వాడుకోవాలని బీజేపీ తలపోస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు పోరాడిన బండి సంజయ్ స్థానంలో కొత్తగా ఈటల రాజేందర్‌కు బీజేపీ తెలంగాణ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ యోచిస్తోందట. ఆందోళనలు, ప్రదర్శనలు, మాటల దాడి చేయడంలో బండి సంజయ్ ఏమీ తక్కువ కానప్పటికీ కేసీఆర్ జిత్తులకు మించి ఎత్తులు వేయాలంటూ బండి సంజయ్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవారు కావాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ …

Read More »

టీడీపీ నేత‌ల‌పై పోలీసుల లాఠీ చార్జ్‌.. ప‌దుల సంఖ్య‌లో గాయాలు!

చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయ‌న అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. దీంతో శాంతిపురం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలో ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ నేత‌లు, కార్యకర్తలపై పోలీసులు క‌నీస హెచ్చ‌రిక‌లు …

Read More »

సీతక్క వారసుడు సిద్ధం.. పోటీకి రెడీ అవుతున్న సూర్య

తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్కకు ఉన్న పాపులారిటీ చాలా ప్రత్యేకం. ఆమె విప్లవ నేపథ్యం, నిత్యం ప్రజల్లో ఉండే నైజం, నిరాడంబరత.. రాజకీయాలలోకి వచ్చిన తరువాత వేసిన ఎత్తుగడలు… సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలియడం.. ఒకటేమిటి.. తెలంగాణలో పార్టీలకు అతీతంగా సీతక్క పాపులర్. అలాంటి సీతక్క ఇప్పుడు తన రాజకీయ వారసుడిని బరిలో దించడానికి సిద్ధమవుతోంది. ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తన కుమారుడు సూర్యను పినపాక నుంచి పోటీ …

Read More »

ఉయ్యూరు నాకు మంచి మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ అనే సంస్థ పేద‌ల‌కు చంద్ర‌న్న సంక్రాంతి కానుక‌లు, జ‌న‌తా వ‌స్త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి.. ముగ్గురు మ‌హిళ‌లు చ‌నిపోయారు. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు కూడా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం రేగింది. వైసీపీ నేత‌లు.. చంద్ర‌బాబు, టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, …

Read More »

కుప్పంలో నువ్వానేనా? సవాల్ విసరనున్న చంద్రబాబు

ఏపీ‌లో రోడ్ షోలపై ఆంక్షల నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం చంద్రబాబు కుప్పం సభ, రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కానీ, టీడీపీ కుప్పం నాయకులు మాత్రం చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుంది అంటూ పట్టుపడుతున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సీరియస్‌గా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో పాల్గొనేవారికి ఇబ్బందులు …

Read More »

ట్రోల్ అవ్వడం తప్ప కేసీఆర్‌ ఏం సాధిస్తున్నట్లు?

ఏ ముహూర్తాన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాడో కానీ.. ఈ మార్పు వల్ల ఆయన కొత్తగా ఏం సాధిస్తున్నది లేకపోగా.. పార్టీకి ఎక్కువ డ్యామేజే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పుట్టిందే విభజన రాజకీయం మీద. అలాంటిది దేశం మొత్తాన్ని కలుపుకుపోతాం.. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తాం అంటుంటే జనాలకు కామెడీగా అనిపిస్తోంది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదైనా కార్యక్రమాలు …

Read More »