తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చేసే రాజకీయం ఎంత విభిన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పార్టీకి సంబంధించిన నిర్ణయాల పరంగా చూసినా ఇటు పరిపాలన విషయంలోనూ గులాబీ దళపతి తీరే వేరు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఇదే జరిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గం ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఈ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …
Read More »హాకీ క్రీడాకారిణి రజనికి సీఎం జగన్ వరాల జల్లు
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, అథ్లెట్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. ఇక, కాంస్య పతకం కోసం బ్రిటన్ తో జరిగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. అయితే, భారత మహిళల హకీ జట్టు పోరాట …
Read More »టీడీపీలోకి జగన్ సన్నిహితుడు..!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహిత నేత ఒకరు వైసీపీని వీడి.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా.. కడప జిల్లాలో జగన్ గా అండగా నిలుస్తూ వస్తున్న కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైసీపీ వీడ్కోలు పలికారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో …
Read More »ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే
వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్దితి చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్థితి అంచనా వేసుకున్న కమలం పార్టీ అగ్రనేతలు రాబోయే ఎన్నికలపై బీజేపీ విషయంలో జనాభిప్రాయం సేకరించాలని …
Read More »మరోసారి రాజ్యసభలో కన్నీరుపెట్టుకున్న వెంకయ్య..!
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు రాజ్యసభలో మరోసారి కంటతడి పెట్టుకున్నారు. నిన్న సభలో కాంగ్రెస్ ఎంపీలు పలువురు తీవ్రమైన గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ఎంపీల ప్రవర్తనపై తాను కలత చెందానని వెంకయ్య చెప్పారు. వారి ప్రవర్తన తీరుతో రాత్రి అసలు నిద్రపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఒకసారి వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెంకయ్య నాయుడు ఉద్దేశించి చేసిన ఆరోపణలకు …
Read More »ఆ ఐఏఎస్ టాపర్ జంట విడిపోయింది..!
ఒకప్పుడు.. ఐపీఎస్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచి.. అందరి దృష్టి ఆకర్షింంచి.. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటైన జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. ఐఏఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ ఆమిర్ ఖాన్ విడిపోయారు. ఐఏఎస్ పరీక్షలో ఫస్ట్ , సెకండ్ ర్యాంకులు సాధించిన వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని …
Read More »కౌశిక్ ఫైలుకు ఏమైంది ?
ఇపుడిదే అంశంపై టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. మొన్న జూలై నెలలలోనే కారు పార్టీలో కౌశిక్ చేరారు. అయితే ఆగస్టు 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ ను ఎంఎల్సీ గా నామినేట్ చేయాలని తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ కార్యాలయానికి ఫైల్ పంపినట్లు అధికార వర్గాలు చెప్పాయి. …
Read More »ఈటలను టీఆర్ఎస్సే ప్రమోట్ చేస్తోందా ?
అధికార టీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. అధికారపార్టీ తీసుకున్న నిర్ణయం గనుక అమల్లోకి వస్తే తానే ఈటల రాజేందర్ ను ప్రమోట్ చేసినట్లవుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీయార్ చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలో నుండి ఈటలను బహిష్కరించిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. మంత్రివర్గం నుండి బహిష్కరణకు …
Read More »మద్దతు ప్రకటించిన షర్మిల
తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరిప్పారు. ఉపఎన్నికలో నిరుద్యోగులు ఎవరన్నా పోటీచేస్తే వారికి తమ పార్టీ మద్దతుగా నిలబడుతుందని షర్మిల ప్రకటించారు. నియోజకవర్గంలోని సిరిసేడు గ్రామంలో మంగళవారం జరిగిన నిరుద్యోగ సమస్యల నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికల వల్ల సమాజానికి ఎలాంటి లాభం …
Read More »హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్..
అంచనాలు నిజమయ్యాయి. ముందుగా అనుకున్నట్లే హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందు నుంచి పేరు వినిపిస్తున్న గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. కొద్ది సేపటి క్రితం (బుధవారం) టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఆయనే ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ ఇప్పటివరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. యాదవ సామాజిక …
Read More »చేసిన తప్పే వెంటాడుతోందా ?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ? పార్టీకి పూర్వవైభవం తేవాలంటే ఏమి చేయాలి ? ఇపుడిదే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహూల్ గాంధీకి అర్ధం కావటంలేదు. 2014లో రాష్ట్ర విభజనకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే కాంగ్రెస్ పార్టీకి ఏపిలో ఘోరీ కట్టేసింది. అప్పట్లో తాము తీసుకుంటున్న నిర్ణయం తప్పని తెలిసినా సరే ఒత్తిడికి తలొగ్గి, ఏదేదో ఊహించుకుని రాష్ట్ర విభజన చేసేసింది యూపీఏ ప్రభుత్వం. అప్పట్లో …
Read More »మోడిపై పెరిగిపోతున్న అనుమానాలు
పెగాసస్ స్పైవేర్ వినియోగంపై ఇన్నిరోజులకు రక్షణమంత్రిత్వ శాఖ నోరిప్పింది. పార్లమెంటులో సోమవారం సీపీఎం ఎంపి ప్రశ్నకు సమాధానమిస్తు పెగాసస్ తో రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ ప్రకటించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ విషయమై పార్లమెంటులో ఎంత గందరగోళం నడుస్తోందో అందరికీ తెలిసిందే. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు దేశంలోని …
Read More »