గతంతో పోలిస్తే రాజకీయాల్లో చాలా ఇన్ యాక్టివ్ అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజకీయాలపై చేసే విశ్లేషణలు, వ్యక్త పరిచే అభిప్రాయాలకు ఇప్పటికీ విలువ ఉంది. వివిధ అంశాలపై ఆయన కొట్టినట్లుగా చెప్పే మాటలు.. అభిప్రాయాలను చాలామంది ఫాలో అవుతారు. తాజా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఉండవల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ …
Read More »ప్రవీణ్ సారుకు పాజిటివ్.. చుట్టూ తిరిగిన వందల మంది పరిస్థితేంటి?
అసలే కరోనా కాలం. ఇలాంటివేళ ఎవరైనా సరే.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కేసుల నమోదు తీవ్రత తగ్గిందే కానీ.. ఆ మహమ్మారి పూర్తిగా పోలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినప్పటికీ.. కరోనా కష్టానని పట్టించుకోకుండా చేస్తున్న పనులు ఇప్పుడు కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా సుపరిచితుడు.. సార్వో సైన్యాన్ని తయారు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తాజాగా బహుజన సమాజ్ వాదీ పార్టీలో …
Read More »జగన్ చేస్తున్న తప్పులు.. పవన్ చేస్తున్న ఒప్పులు చెప్పేసిన ఉండవల్లి
ఏపీ రాజకీయాల్లో కాస్త డొక్క శుద్ది ఉన్న కొద్దిమంది నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరుగా చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఓపెన్ గా మాట్లాడేయటంలో ఆయనకున్న టాలెంట్ మరెవరికీ లేదనే చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆయన వాగ్దాటి అంతా ఇంతా కాద. అంతేకాదు.. విషయాల మీద అవగాహన కూడా ఎక్కువే. అలాంటి ఆయన తాజాగా …
Read More »అభ్యర్థులూ నేర చరిత్ర విప్పండి.. సుప్రీం కోర్టు..!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇక తమ నేర చరిత్రను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారంతా గతంలో వారు చేసిన నేరాల పుట్టను విప్పాలంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా …
Read More »సోము స్థానంలో రెడ్లకే పట్టం.. బీజేపీ వ్యూహం ఏంటి..?
ఏపీ బీజేపీ సారథిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేతకు పట్టం కడతారా? ఏపీలో బీజేపీని పరుగులు పెట్టించే నాయకుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ సారథిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు …
Read More »మడమ తిప్పేసిన కోమటిరెడ్డి ?
తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మడమ తిప్పేసినట్లే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని తాజాగా ప్రకటించారు. సోనియా, రాహూల్ నాయకత్వంలో కలిసి పనిచేద్దామని తాను రేవంత్ కు సూచించినట్లు ఎంపి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సోనియా, రాహూల్ నాయకత్వంలో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడికి ఓ ఎంపి చెప్పాలా ? పీసీసీ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి సోనియా, రాహూల్ నాయకత్వంలో …
Read More »ప్రవీణ్ణు డైరెక్టు ఎటాక్ చేస్తున్న టీఆర్ఎస్
తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ గా అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన ప్రవీణ్ పై టీఆర్ఎస్ ఎంఎల్ఏలు వరుసబెట్టి ఆరోపణలు, విమర్శల బాణాలను వదులుతున్నారు. దానికి ఉద్యోగంలో ఉండగా ప్రవీణ్ చేసిన ప్రకటనలను తమ ఆరోపణలు, విమర్శలకు మద్దతుగా ఎంఎల్ఏలు గ్యాదిరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కరరావు ఉపయోగించుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే …
Read More »తమ్ముళ్లు – తనయుల రాజకీయం పెరిగిపోతోందా..?
అధికార వైసీపీ నేతలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలపై సీఎం జగన్ నిఘా పెట్టారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నేతలు ఏం చేస్తున్నారు ? ఎలా ఉన్నారు ? అనే విషయాలపై ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి వలంటీర్ వ్యవస్థనే వాడుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వలంటీర్లు సేకరించిన సమాచారం.. తాడేపల్లికి చేరిపోయింది. ఈ …
Read More »నా బాధ గోడకు చెప్పుకోనా అంటోన్న ఏపీ మంత్రి ?
విశాఖ జిల్లా మొత్తానికి ఆయనే ఏకైక మంత్రి. గతంలో టీడీపీ టైమ్ లో అయితే అవంతి గురువు గంటా శ్రీనివాసరావుకు రూరల్ జిల్లాలో అయ్యన్నపాత్రుడుతో పోటీ ఉండేది. దాంతో ఆయన సగం మంత్రిగానే ఉండిపోయారు. అయితే గంటా రాజకీయ చాతుర్యంతో, తనదైన వ్యూహాలతో రాష్ట్ర స్థాయిలోనే ఒక దశలో చక్రం తిప్పారు. చంద్రబాబు వద్ద తన ప్రయారిటీ ఏ మాత్రం దెబ్బ తినకుండా చూసుకున్నారు. కానీ ఇపుడు అవంతికి మాత్రం …
Read More »బీజేపీనే అసలైన ప్రతిపక్షమా ?
ప్రకటనలు చేయటంలో కమలనాదులకు మించిన వారు లేరన్నట్లుగా తయారైంది. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవటానికి బీజేపీనే అసలైన ప్రతిపక్షంగా తయారైందని ఆపార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంత ? ప్రజా ప్రతినిధులెంతమంది ? అన్న విషయాలు పరిశీలిస్తే చాలు జీవీఎల్ ప్రకటనలోని డొల్లతనం బయటపడుతుంది. ప్రస్తుతం బీజేపీ తరపున ఏకైక ఎంఎల్సీగా మాధవ్ ఉన్నారంతే. ఏరోజు కూడా ప్రభుత్వ …
Read More »పార్టీలన్నీ ఆ సామాజివకర్గం చుట్టునే తిరుగుతున్నాయా ?
మరో ఏడు నెలల్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లు లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీ మీద బాగా గుర్రుగా ఉండటమే. యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం ఉన్నారు. అదే ఓటర్లపరంగా చూస్తే బ్రాహ్మణుల శాతం 20. 20 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు. ఓ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టాలన్నా, దింపేయాలన్నా 20 శాతం ఓట్లు సరిపోతాయి. …
Read More »అప్పుడే అసమ్మతి సెగ
కర్నాటకలో మంత్రివర్గం ఏర్పడి ఇంకా పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ మొదలైంది. తమకు కేటాయించిన శాఖలపై ముగ్గురు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గోడలమధ్య మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తంచేసేవారు. కానీ ఇపుడు మాత్రం తమకు కేటాయించిన శాఖలపైన, బొమ్మై పైన నేరుగా మీడియాతోనే తమ అసంతృప్తిని పంచుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంటీబీ నాగరాజు, శ్రీరాములు, ఆనంద్ సింగ్ …
Read More »