బాబు బాధ్య‌త నెర‌వేర్చారు.. మ‌రి త‌మ్ముళ్ల మాటేంటి?

టిడిపిని గెలిపించేటటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాల మీద నుంచి దాదాపు దిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా సీనియర్లు యువ నాయకులు వారసులు అందరూ కూడా మీరు ఏదో ఒకటి చేయండి సార్ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఏదో ఒకటి గట్టి హామీ ఇవ్వండి సార్ మేము ప్రజలను కలుసుకుంటాం అని రొద పెట్టారు. అంతేకాదు వైసీపీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుచేస్తోందిది.. మనం ఇస్తామా ఇవ్వ‌మా అనేటువంటి టాక్ ప్ర‌జ‌ల్లో ఉంది. కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని కోరారు.

తద్వారా తాము ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువచ్చారు. దీంతో సుదీర్ఘ మధనం తర్వాత అందరినీ, అందరితో చర్చించి ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నటువంటి పథకాలను కూడా ఏర్చి కూర్చి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక దీంతో చంద్రబాబు నాయుడు బాధ్యత దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని మహానాడులో చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు.

అంటే ఇప్పుడు పూర్తిగా ప్రజల్ని టిడిపి వైపు మళ్లించేటటువంటి బాధ్యత క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీలో టికెట్‌ను ఆశిస్తున్నటువంటి వారు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా పార్టీని వదిలేసి లేదా చంద్రబాబు నాయుడు మీద భారం వేసి వారు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వారు కోరుకున్నట్టుగా చంద్రబాబునాయుడు అసలు ఉచితాలకి వ్యతిరేక‌మ‌ని చెప్పుకునేటటువంటి నాయకుడు ఈరోజు ఉచితాల వైపు మొగ్గారు.

అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పై చేసిన ఒత్తిడిగానే భావించాలని సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓటు బ్యాంకుగా మల్చాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళ ఓటు బ్యాంకు రైతులు ఓటు బ్యాంకు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందర్నీ కూడా పార్టీ వైపు క్షేత్రస్థాయిలో మళ్ళించాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారు సీనియర్లు, పదవులు ఆశిస్తున్నటువంటి వారు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే బాదుడే బాదుడు, ఇదేం కర్మ వంటి కీలకమైనటువంటి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆయ‌న హిట్ కొట్టారు. వీటిని కొనసాగిస్తూనే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంపై ఈ సంక్షేమ పథకాల విషయంలో టిడిపి పై భరోసా కల్పించేలా నాయకులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా నాయకులు ఎంత మంది పనిచేస్తారు ఎంతమంది ప్రజల్లోకి వెళ్తారు దాన్ని బట్టి టికెట్లు ఇచ్చేటటువంటి వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.