Political News

కేసీఆర్ ఫ్యామిలీని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నారా?

KCR

లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత కారణంగా ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నెత్తి నొప్పులు తెచ్చుకుంది. ఇది అంత త్వరంగా సమసిపోయే కేసు కాకపోవడం.. సీబీఐ, ఈడీలు యమ జోరుగా దర్యాప్తు, విచారణ చేస్తుండడంతో కవిత ఈ కేసులో పీకల్లోతున కూరుకుపోయారనే చెప్పాలి. ఆమె ఈ కేసులో దోషిగా తేలుతారా? నిర్దోషిగా తేలుతారా? అవినీతికి పాల్పడ్డారా? ఆమెకు సంబంధమే లేకుండా కేంద్రం ఇరికించిందా అనే విషయాలన్ని పక్కనపెట్టినా కూడా ఈ …

Read More »

క‌వితను అరెస్టు చేస్తే చేయ‌నీయండి.. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌!!

త‌న కుమార్తె, ఎమ్మెల్సీ క‌వితకు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి మ‌ధ్య లింకు ఉంద‌నే విష‌యం గ‌త మూడు మాసాలుగా నాను తున్న‌ప్ప‌టికీ.. ఎన్న‌డూ నోరు విప్ప‌ని సీఎం కేసీఆర్.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని అన్నారు. ‘కవితను మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’ అంతేకదా..?” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. …

Read More »

కోడెల కొడుకుని వదిలించుకోవడంతో టీడీపీకి వైసీపీ హెల్ప్?

కోడెల శివప్రసాద్ టీడీపీ అధికారంలో ఉండగా కీలకంగా ఉండేవారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనకు ఎదురేలేని పరిస్థితి. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంతా తారుమారైంది. కొద్దికాలానికే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. కోడెల తనయుడు శివరామ్ ఇప్పుడు సత్తెనపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో పార్టీ ఏమాత్రం అనుకూలంగా లేదు. కానీ, పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన కోడెల …

Read More »

అనిల్ ను టార్గెట్ చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంతో విభేదించి దూరం జరిగినప్పటి నుంచి రెబెల్ స్టార్ గానే కొనసాగుతున్నారు. పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తూ తూర్పార పడుతున్నారు. నెల్లూరుతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గం ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. కిందపడినా పైచేయి తనదేనన్నట్లు మాట్లాడుతున్నారు.. నటనపై.. అధిష్టానం వర్సెస్ కోటంరెడ్డి పొలిటికల్ గేమ్ ఒక వైపు సాగుతుండగానే, …

Read More »

అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం: కోర్టుకు చెప్పేసిన సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయ‌న తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీబీఐ తేల్చి చెప్పింది. ఈ విష‌యాన్ని తెలంగాణ‌ హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్ వెల్ల‌డించారు. అవినాష్ రెడ్డి దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు సీబీఐని కూడా విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిపాత్ర ఏంటి? ఆయ‌న‌ను …

Read More »

హ‌మ్మ‌య్య‌.. త‌మ్ముళ్లు క‌లిసారు.. ఊపిరి పీల్చుకున్న చంద్ర‌బాబు!

ఇప్ప‌టి వ‌ర‌కు ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న టీడీపీ నేత‌లు.. ఒకే బాట ప‌ట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు పార్టీతో ట‌చ్‌లోకూడా లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సైతం.. జెండా ప‌ట్టారు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌మ్మ‌య్య‌! అని ఊప‌రి పీల్చుకున్నారు. మరి ఈ ప‌రిణామం ఎక్క‌డ జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అంటే.. ప్ర‌స్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఉన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. …

Read More »

జనసేనలో జోగయ్య కీలకమవుతారా ?

బంధం బలపడబోతోంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫుల్లుగా జనసేన వైపుకు వెళ్లబోతున్నట్లుగా పావులు కదులుతున్నారు. ఇంతవరకు కొంచెం శ్రేయోభిలాషిగా, కొంచెం సలహాదారుగా ఉన్న జోగయ్య ఇప్పుడు ఫుల్ టైమ్ జనసేనకే కేటాయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. పవన్ ను సీఎంగా చూడడమే… జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య సలహాలిస్తున్నారు. డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నట్లుగా భావిస్తున్న తరుణంలో జోగయ్య ఎత్తులు పవన్ …

Read More »

ఇచ్చిన వాంగ్మూలం వెన‌క్కి తీసుకుంటా: క‌విత కేసులో భారీ ట్విస్ట్‌

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత మ‌రో 24 గంట‌ల్లో ఈడీ ముందు హాజ‌రై విచాణ‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ క్ర‌మంలోఅస‌లు ఏం జ‌రు గుతుంది..? ఆమె అరెస్టు అవుతారా? ఈడీ ఆమెను నిర్బంధిస్తుందా? అనే సందేహాలు.. స‌మ‌స్య‌లు.. రాజ‌కీ యంగా దుమారాలు చెలరేగాయి. అయితే.. ఇంత‌లోనే ఆక‌స్మికంగా.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. క‌వితను విచారించేందుకు కీల‌క‌మైన‌.. ఈడీ ఆది …

Read More »

నేను పది సూపర్ హిట్లు కొట్టగలను-ఎంపీ

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాడని చాలామందికి తెలియదు. అతను ‘ఓయ్ నిన్నే’ అనే ఊరూ పేరూ లేని సినిమా ఒకటి చేశాడు. అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ వేవ్ నడిచిన 2019 ఎన్నికల్లో రాజమండ్రిగా గెలిచేశాడు భరత్. ఎంపీ అయ్యాక కూడా భరత్ తన కెమెరా మోజును ఏమీ తగ్గించుకోలేదు. పబ్లిసిటీ …

Read More »

దెబ్బ‌కు ఠా!.. బాబు వ్యూహంతో ఆ ‘న‌లుగురి’కి ఉక్కిరిబిక్కిరే!!

దెబ్బ‌కు ఠా.. దొంగ‌ల ముఠా!! అన్న‌ట్టుగా.. చంద్ర‌బాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. బిక్క‌చ‌చ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు. మ‌రికొంద‌రు.. ఏకంగా చంద్ర‌బాబు కుటుంబంపైనే విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల స‌భ్యుడు …

Read More »

ఎస్సీ, ఎస్టీ కేసుకు రెడీ అవుతున్న అనిత

టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీ అనితను వైసీపీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఆమెను ఇబ్బందిపెట్టే పోస్టులతో వ్యతిరేక ప్రచారమే వైసీపీ సోషల్ మీడియా పనిగా ఉంటుంది. ఈ సారి కూడా సరిగ్గా అదే జరిగింది. మహిళా దినోత్సవం రోజున… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించారు. అనిత ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి యాత్రలో పాల్గొన్నారు. అప్పుడు …

Read More »

లోకేశ్ పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఏం జరుగుతోందంటే..

Lokesh Nara

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 …

Read More »