ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. యువగలం పాదయాత్ర ఏడాది జనవరి 27వ తారీఖున ప్రారంభమైన తర్వాత కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కడప జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా రాజంపేటలో ఆయనకు ప్రజలు భ్రమరథం పెట్టారు.
నిజానికి 2014 ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి తరఫున మేడా మల్లికార్జునరెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి జంపింగ్ లో ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి వైసిపి టికెట్ తరుపున గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోయి మళ్లీ రాజంపేటలో టిడిపి గెలుపు సాధ్యమేనన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే కచ్చితంగా టిడిపి మొగ్గుతారు అనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రతి నియోజకవర్గంలో కూడా టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, తాజాగా రాజంపేటలో మాత్రం ఆయన మేడా మల్లికార్జునరెడ్డిని టార్గెట్ చేయకుండా చాలా సున్నితమైనటువంటి వాక్యలతో పాదయాత్ర కొనసాగించారు. అంటే దీన్ని బట్టి అవసరమైతే మేడాని టీడీపీలో చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనలో తమను రాయచోటి కేంద్రంగా కాకుండా రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అనేటటువంటిది అక్కడ భారీ డిమాండ్ వచ్చింది. దీనిపై మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా వైసిపి అధిష్టానంతో విభేదించారు. కచ్చితంగా ప్రజల కోరిక తీర్చాలని ఆయ వైసిపికి సూచించారు. కానీ, అక్కడి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి తనకు ప్రాధాన్యం ఇవ్వాలని రాయచోటి నియోజకవర్గం ప్రజలు రాయచోటనే కేంద్రంగా కోరుకుంటున్నారని ఒత్తిడి తెచ్చి రాజంపేటకు ప్రాధాన్యం లేకుండా చేశారనే మాట వినిపిస్తుంది.
దీంతో మేడా మల్లికార్జునరెడ్డి అప్పటినుంచి కూడా వైసిపికి అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు రాజంపేట ప్రజలు కూడా తమ డిమాండ్ నెరవేర్చినటువంటి వైసీపీకి వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. దీంతో రాజంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మార్పులు అయితే చోటు చేసుకుంటాయని సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనికి తగ్గట్టుగానే రాజంపేట నియోజకవర్గంలో తాజాగా చేసిన యువగళం పాదయాత్రలో యువనాయకుడు నారా లోకేష్ కు ప్రజలు భ్రమరథం పట్టడం, ఆయన మేడాని పెద్దగా విమర్శించకపోవడం అంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి చూడాలి ఇక్కడ ఎలాంటి మార్పులు జరుగుతాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates