Political News

జగన్ పాలన చూస్తే జాలేస్తోంది – ఐవైఆర్‌

చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, త‌ద‌నంత‌రం.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన మాజీ ఐఏఎస్‌.. అధికారి ఐవైఆర్ కృష్ణారావు.. తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేస్తోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న త‌ర‌చుగా ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణ‌రావు.. పార్టీ జెండా ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి రాక‌పోయినా.. మైకు పుచ్చుకుని మాత్రం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు …

Read More »

బాబుకు సొంత జిల్లాలోనే షాక్‌

Chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేవ‌డానికి.. పార్టీని బ‌తికించుకోవ‌డానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. పార్టీకి పునర్వైభ‌వం తెచ్చే దిశ‌గా శాయాశ‌క్తులా కృషి చేస్తున్నారు. పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించ‌డంతో పాటు అధికార వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల నోళ్ల‌లో పార్టీ పేరు నానేలా కార్య‌క‌ర్త‌లు శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయ‌న సాగుతున్నారు. కానీ …

Read More »

అత్యంత ఫ్లాప్‌ సీఎంగా కేసీఆర్.. సీ ఓట‌ర్ స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు

దాచాలంటే.. దాగ‌దులే.. అన్న‌ట్టుగా ఉంది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి. ప్ర‌జ‌ల‌కు నేను త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పుకొనే కేసీఆర్ .. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌రింతగా త‌న‌ను ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని చెప్పుకొంటున్నారు. అయితే.. ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ పాల‌న‌ పై ప్ర‌జ‌లు ఎలా ఉన్నారు? ఆయ‌న గురించి ఏం చెబుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రిజల్టే వ‌చ్చింద‌ని తేలింది. దేశ‌వ్యాప్తంగా ఏటా.. ముఖ్య‌మంత్రుల …

Read More »

టీడీపీపై దాడి.. జ‌న‌సేనాని ఏమ‌న్నాడంటే?

మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లు చోట్ల‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని భావిస్తున్నారు. ఈ దాడుల‌పై ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ …

Read More »

డీజీపీ ఎక్కడ పడుకున్నారు: చంద్రబాబు సీరియస్

ఏపీ అట్టుడికిపోతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు టీడీపీ ఆఫీసులపై దాడులు వైసీపీ పనే అని, ఇది చాలా ఆర్గనైజ్డ్ గా చేసిన అరాచకం అని చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం జగన్‌కు తెలిసే పక్కా ప్లాన్ తో …

Read More »

టీడీపీ ఆఫీసుల పై దాడులు, ఏపీలో కలకలం- జాతీయ మీడియాలో చర్చ

అమరావతిలోని కేంద్ర కార్యాలయంతో పాటు తెలుగుదేశం పార్టీ (టిడిపి) పలు జిల్లా కార్యాలయాలపై మంగళవారం సాయంత్రం దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని, ఇది స్టేట్ టెర్రరిజం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి, మంగళగిరి, విజయవాడ మరియు విశాఖపట్నం సహా మొత్తం 13 జిల్లాల్లోని ప్రధాన టీడీపీ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో దాడులు జరగడం గమనార్హం. ఇది ముఖ్యమంత్రి …

Read More »

  కౌశిక్ రెడ్డి కోసం కోర్టుకు!

తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని ర‌గిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం టీఆర్ఎస్ అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామ‌దాన‌బేధదండోపాయాల‌ను ప్ర‌యోగిస్తున్నార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. త‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి త‌న‌కే ఎదురు తిరిగిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డం కోసం కేసీఆర్ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే హుజూరాబాద్‌లోని ఇత‌ర పార్టీలకు చెందిన కీల‌క నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అందులో భాగంగానే …

Read More »

సాయిరెడ్డి దూకుడు త‌గ్గిందే.. రీజ‌నేంటి?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క నాయ‌కుడు, ఇటు ఏపీలోనూ.. అటు ఢిల్లీలోనూ చ‌క్రం తిప్పుతున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన వి. విజ‌య‌సాయి రెడ్డి దూకుడు ఇటీవ‌ల కాలంలో ఫుల్లుగా త‌గ్గిపోయింది. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మాట కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల పార్టీ నాయ‌కుడిగా.. అన్నీ తానై.. వ్య‌వ‌హ‌రిస్తున్న సాయిరెడ్డి.. ఇప్పుడు అక్క‌డ కూడా క‌నిపించ‌డం లేదు. విశాఖ స‌హా ఎక్క‌డా …

Read More »

బలమైనోళ్లను బలహీనులుగా చేయటంలో కేసీఆర్ ఫార్ములా అదుర్సు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తులు అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఉంటాయి. తనకు రాజకీయ ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉన్న వారిని.. ఏ మాత్రం ఉపేక్షించకుండా తన జట్టులోకి తీసుకోవటం ద్వారా వారిని నిర్వీర్యం చేయటం.. గొంతు విప్పకుండా ఉంచటం లాంటివి చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఆయన కొన్ని పార్టీలకు చెందిన బలమైన నేపథ్యం ఉన్న …

Read More »

కేసీఆర్‌కు భారీ షాక్‌.. ద‌ళిత బంధుపై ఈసీ కొర‌డా!

తెలంగాణ ప్ర‌భుత్వ పార్టీ టీఆర్ ఎస్‌… ఆపార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ఆ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇక్క‌డ ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న పార్టీ అధినేత కేసీఆర్‌.. అనూహ్యంగా ఇక్క‌డి ఎస్సీ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు.. ద‌ళిత బంధు ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రాక‌ముందే.. ఆయ‌న ద‌ళిత బంధును …

Read More »

బద్వేలులో ఆసక్తికరమైన చర్చ

ఇపుడిదే ప్రశ్నపై చర్చలు జోరుగా సాగుతోంది. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 30వ తేదీన జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. ఒకపుడు టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. కానీ తర్వాత కాంగ్రెస్ ఇపుడు వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి …

Read More »

అన్నాడీఎంకే లో చీలిక తప్పదా ?

అన్నాడీఎంకేలో శశికళ చిచ్చు పెట్టేశారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పార్టీకి తానే జనరల్ సెక్రటరీని అంటు ప్రకటించుకున్నారు. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ లో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన శశికళ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంపై పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన పేరునే రాయించుకున్నారు. దాంతో పార్టీలో గందరగోళం మొదలైంది. ఒకవైపు శశికళ వర్గం …

Read More »