కాకినాడ నుండి పోటీచేస్తారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దమ్ము చూపించే సమయం ఆసన్నమవుతోందా ? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. ఎక్కడ మాట్లాడినా తన దమ్మేంట్లో చూపిస్తానని, ఎవరికీ భయపడనని, అంతుచూస్తానని, ప్రాణాలు పోయినా లెక్కచేయనని పవన్ పదేపదే చెబుతుంటారు. ఇన్నిచోట్ల అన్ని మాటలు చెప్పేబదులు రాబోయే ఎన్నికల్లో కాకినాడ అసెంబ్లీలో పోటీచేస్తే సరిపోతుంది కదా. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని నోటొకొచ్చినట్లు తిట్టి తిట్టి తన కసినంతా తీర్చుకున్నారు.

వచ్చేఎన్నికల్లో ద్వారంపూడి కాకినాడ అసెంబ్లీలో ఎలా గెలుస్తారో చూస్తానని చెలెంజ్ చేశారు. ఒకవేళ ద్వారంపూడి గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కూడా శపథం చేశారు. నిజానికి ఇదంతా పవన్ కు అవసరంలేదు. ఒకళ్ళు గెలవటం, ఓడటం ఎవరిచేతుల్లోను లేదు. గెలుపోటములు ప్రజలచేతిలో మాత్రమే ఉంటుంది. జనాలు ఓట్లేస్తే గెలుస్తారు లేకపోతే ఓడుతారంతే. ఇంతచిన్న విషయం కూడా పవన్ అర్ధంచేసుకోకుండా ఊరికే నోటికొచ్చిన చాలెంజులు, శపథాలు చేసేశారు.

దానికి కౌంటరుగా ద్వారంపూడి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పవన్ కాకినాడలో తనపై పోటీచేయాలని సవాలు విసిరారు. పవన్ చాలెంజును తాను స్వీకరిస్తున్నట్లు చెప్పిన ఎంఎల్ఏ పవన్ వచ్చి పోటీచేసి తనపై గెలవాలని చాలెంజ్ చేశారు. మరిపుడు ద్వారంపూడి చాలెంజ్ ను పవన్ స్వీకరిస్తారా స్వీకరించరా ? అన్న విషయమై పెద్దఎత్తున చర్చ మొదలైంది. నిజంగానే తాను చెప్పుకుంటున్నట్లు ఎవరికీ భయపడే వ్యక్తికాకపోతే పవన్ కాకినాడ అసెంబ్లీలో పోటీచేయాలి.

పవన్ పోటీచేయటం వల్ల ఒక విషయంలో క్లారిటి వస్తుంది. అదేమిటంటే ద్వారంపూడి, పవన్లో ఎవరో ఒకళ్ళ కెపాసిటి తేలిపోతుంది. ఓడిన వాళ్ళు ఇక నోరెత్తేందుకు ఉండదు. నిజంగానే పవన్ ఆరోపిస్తున్నట్లుగా ద్వారంపూడి అరాచకశక్తే అయితే గెలుపు సులభమే కదా. మరింత సులభంగా గెలవగలిగే సీటును పవన్ ఎందుకు వదిలేసుకోవాలి. అరాచకశక్తిగా మారిన ద్వారంపూడిపై పవన్ పోటీచేస్తే మిగిలిన అరాచకశక్తులకు ఒక హెచ్చరికగా ఉంటుంది. ద్వారంపూడి చాలెంజ్ ద్వారా వచ్చిన గోల్డెన్ చాన్సును పవన్ ఎట్టి పరిస్ధితుల్లోను వదులుకోకుండా తన దమ్ము, ధైర్యాన్ని చూపించాల్సిన సమయం వచ్చేసింది.