రాబోయే రెండున్నరేళ్లు అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎంఎల్ఏలు బహిష్కరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీని తాను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించినా మొత్తం టీడీపీ సభ్యులంతా అదే దారిలో నడవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ అధినేత చంద్రబాబే సభను బహిష్కరించిన తర్వాత తాము మాత్రం సభలో ఉండి చేసేదేమీ ఉండదని మిగిలిన ఎంఎల్ఏలు కూడా ఆలోచిస్తున్నారట. అధికార సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పుండదు కాబట్టి …
Read More »నోరు అదుపులో పెట్టుకోండి.. బాలయ్య వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం కావడం నందమూరి కుటుంబాన్ని బాగానే కదిలించినట్లుంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పురంధరేశ్వరి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శనివారం నందమూరి బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కలిసి హిందూపురంలో విలేకరుల సమావేశం పెట్టారు. బాలయ్యతో పాటు …
Read More »బాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని రియాక్షన్
కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ్మినేనికి తాను రాజకీయంగా పున:భిక్ష పెట్టానంటూ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు మాటల్లో నిజం లేదన్న ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని.. …
Read More »హోదాపై కేంద్రానికి నోటీసులు
విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని …
Read More »వైసీపీలో విషాదం.. ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత
ఏపీ అధికారపక్షంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ అనారోగ్యంతో కన్నుమూశారు. 65 ఏళ్ల వయసున్న పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా అకాలమరణం చెందారు. శుక్రవారం సైతం ఆమెకు మండలి సమావేశాలకు హాజరు అయ్యారు. అలాంటి ఆమె రోజు గడిచేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సభలో తమతో ఉన్న వ్యక్తి.. ఈ రోజు నుంచి ఇక ఎప్పటికి లేరన్న …
Read More »నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం: పురందేశ్వరి
ఏపీ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల్లో తన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే భువనేశ్వరిపై చేసిన …
Read More »కేసీఆర్కు ఛాన్స్ ఇవ్వని మోడీ!
రాజకీయాల్లో ఇదొక చిత్రం! తాను ఒకటి తలిస్తే.. మరొకటి జరిగినట్టుగా ఉంది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఏదనుకున్నా.. జరిగి తీరాల్సిందే. తాను అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని నాయకుడిగా.. ఎంతకైనా తెగించే నేతగా కేసీఆర్ గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఆయనకు ఎవరు అడ్డు ఒచ్చినా.. తల ఒంచేది లేదన్నట్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ.. …
Read More »కేంద్రం తెలివి – ఏపీ రాజధాని హైదరాబాద్ !
కొందరు అన్నట్లుగా ఏపీకి ఏదో శాపం ఉన్నట్లుంది. మద్రాసు నుంచి సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి.. రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమకు మించిన తోపులు మరెవరూ ఉండరన్నట్లుగా.. అన్నింట్లోనూ తామే మొనగాళ్లమన్న భావన ఆంధ్రోళ్లలో ఎక్కువంటారు. అలాంటి అతిశయమే వారికి ఒక రాజధాని అంటూ లేకుండాపోయిందన్న ఆగ్రహం కొందరి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇదే వాదనను మరికొందరు మరోలా …
Read More »వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన కామెంట్లు!
అసెంబ్లీలో ఈ రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు.. తనను వైసీపీ నాయకులు అవమానించారంటూ.. ముఖ్యంగా తన కుటుంబాన్ని, తన సతీమణిని కూడా అవమానించారంటూ.. ఆయన సభను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అయిన తర్వాతే .. సభలోకి అడుగు పెడతానని అన్నారు. ఇది ఒక సంచలనమైతే.. మరో సంచలనం కూడా చోటు చేసుకుంది. అదే ఇప్పటి వరకు వైఎస్ …
Read More »ప్రెస్ మీట్ లో భోరున విలపించిన చంద్రబాబు
అసెంబ్లీలో జరిగిన పరిణాలను తలచుకుని చంద్రబాబు బోరున విలపించారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో.. వివరించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారిగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై భోరున విలపించారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని …
Read More »సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా…చంద్రబాబు షాకింగ్ నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, రెండో రోజు సభ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ …
Read More »రైతు చట్టాలపై మోడీ వెనక్కి తగ్గడం వెనుక అసలు కథ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలిసారి వెనక్కి తగ్గింది. గడిచిన ఏడేళ్ల పాలనలో .. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంలోనూ వెనక్కి తగ్గిన దాఖలా మనకుకనిపించదు.కానీ, ఈ రోజు(శుక్రవా రం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తాను వెనక్కి తగ్గుతున్నట్టు(పరోక్షంగా) ప్రకటించి.. దేశాన్ని ఒక్కసారిగా నిర్ఘాంత పోయేలా చేశారు. ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కారు దేనిలో నూ వెనక్కి తగ్గని పరిస్థితిని …
Read More »