ఏపీలో ఏం జరిగినా బెట్టింగు రాయళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వరకు దేనినీ వారు వదిలి పెట్టడం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్‌కు తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యవహారం కూడా .. బెట్టింగులకు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయరా? అనేది తీవ్ర …
Read More »మోడీ 9 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ 9 ప్రశ్నలు..
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సంబరాల్లో మునిగిపోయింది. అయితే.. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ పాలనపై 9 ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అంటూ.. సవాల్ విసిరింది. ఇవీ ప్రశ్నలు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారతదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడటానికి కారణం ఏమిటి? ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు …
Read More »ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ
ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ పై టీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం స్టే సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంలో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాజాగా స్టే జారీ …
Read More »అందరికీ షాకిచ్చిన సుప్రీంకోర్టు!
కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ ముందుకు వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్లిస్ పీఎస్ నరసింహాలతో కూడిన …
Read More »కేసీఆర్ మీద కోపం.. మోడీని ఇరికించిన తమిళ సై?
కాస్తంత తేడాగా ఉన్నప్పటికీ ఒకేలాంటి సీన్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. తాము వినిపించే వాదనకు సారూప్యత ఉందన్న ఉద్దేశంతో నోటికి పని చెబితే కొత్త తలనొప్పి రావటం ఖాయం. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళ సై.కొత్త పార్లమెంటు భవనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వేళ.. దాని ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ …
Read More »కడపలో యువగళం ఎఫెక్ట్ ఎంత…
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇప్పటి వరకు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజక వర్గాల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జగన్‌కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కారణం.. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం ఇక్కడ ప్రారంభం కావడమే. ఇటీవల చంద్రబాబు సైతం ఇక్కడ పర్యటించారు. ఇక, వైనాట్ పులివెందుల …
Read More »200 ఎకరాలు.. అదిరే వంటకాలు!
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, యుగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27, 28న వేడుకలు జరగనుండగా.. రాజమహేంద్రవరానికి ముందుగానే మహానాడు కళ వచ్చేసింది. ఎన్నికల ఏడాది కావటంతో.. ఈసారి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. మహానాడు వేదికను తమకు …
Read More »కొత్త పార్లమెంటు వివాదం.. సుప్రీంకోర్టుకు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన పార్లమెంట్ భవనం(సెంట్రల్ విస్టా) ప్రారంభంపై చెలరేగిన రగడ సుప్రీం కోర్టుకు చేరింది. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. లోక్సభ సెక్రటేరియట్.. నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయవాది జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం …
Read More »బీజేపీకి ఇంత కడుపుమంటగా ఉందా ?
కర్ణాటక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీకి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అంటే బాగా మంటగా ఉన్నట్లుంది. ఈ విషయం బీజేపీ నేతలు చేసిన ట్వీట్లోనే బయటపడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అందులో ఏముందంటే ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉంది. ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీ స్కీములను వెంటనే …
Read More »ఎంఎల్ఏలకు నో ఎంట్రీ?
ప్రగతి భవన్లోకి ఎంఎల్ఏలకు నోఎంట్రీ బోర్డు కనబడుతోందట. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కేసీయార్ ను కలిసి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడుదామని, పరిష్కారలపై చర్చించాలని అనుకుంటున్న ఎంఎల్ఏలకు ప్రగతిభవన్లోకి నోఎంట్రీ బోర్డు కనబడుతోందని సమాచారం. గడచిన వారంరోజులుగా ముందుగా అపాయిట్మెంట్ తీసుకోకుండా నేరుగా వచ్చేస్తున్న ఎంఎల్ఏలను లోపలకు పంపటంలేదట. గేటు దగ్గరే సెక్యూరిటి వాళ్ళు ఆపేసి పంపేస్తున్నారట. వచ్చిన ఎంఎల్ఏకి అపాయిట్మెంట్ ఉందా లేదా అన్నది సెక్యూరిటి వాళ్ళు కనుక్కుంటున్నారట. …
Read More »అమరావతిలో పవన్.. 3 రోజులు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిపాలన భవనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ అమరావతిలోనే బస చేయనున్నట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ రెండు రోజులు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్లు, ప్రైవేట్ మీటింగుల కోసం కేటాయించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరెవరితో భేటీ కానున్నారనే అంశాలపై ఇప్పటి …
Read More »నిన్న జగన్.. ఈ రోజు చంద్రబాబు.. ఒకే పనిచేశారుగా!!
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటారు. అలాగే.. పరస్పర విరుద్ధమైన పార్టీల నేతల అభిప్రాయాలు .. లక్ష్యాలు కూడా కలవవు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒకటంటే.. ప్రతిపక్షం టీడీపీ మరొకటి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విషయంలో కలిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్రధాని మోడీ విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి. అదే.. కొత్త పార్లమెంటు భవనం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates