Political News

మోడీ నుంచి ఏపీకి ఘాటు లేఖ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ప్ర‌ధాని తొలిసారి ఇంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ చేస్తున్న ప‌నులపై ప్ర‌ధాని సీరియ‌స్‌గా ఉన్నార‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేఖ సంధించారు. ప్ర‌స్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచిన‌ప్ప‌టికీ… ఢిల్లీ వ‌ర్గాలు …

Read More »

క‌న్నీటితో భువ‌నేశ్వ‌రి పాదాలు క‌డుగుతాం

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి అనుమ‌తిస్తే.. ఆమె పాదాల‌ను త‌మ క‌న్నీటితో క‌డుగుతామంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు …

Read More »

ఏపీ దివాలా.. బీజేపీ ఎంపీ సీరియ‌స్ కామెంట్లు

ఏపీ ప్ర‌భుత్వంపై బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ సభ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ దివాలా తీస్తోంద‌ని అన్నారు. జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న జీవీఎల్‌.. ఈ సంద‌ర్భంగా ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ త‌న మెచ్చుకోలు …

Read More »

ఆ కామెంట్లతో జగన్ పరువు తీసిన చంద్రబాబు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద ఉధృతికి కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం, ఆ వరద నీటి ప్రభావానికి 62 మండి మరణించడం పెను దుమారం రేపింది. గ్రీజు పెట్టకపోవడం వల్లే గేట్ సకాలంలో తెరుచుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష …

Read More »

రోశ‌య్య అన్న‌..వైఎస్సార్ ప్రేమ‌

కొణిజేటి రోశ‌య్య‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌లో వెలుగు వెలిగిన నాయ‌కులు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన నేత‌లు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగారు. ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య విడ‌దీయ‌రాని అనుబంధం ఉండేది. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హ‌యాంలోనూ రోశ‌య్య ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. నాయ‌కుడ‌నే డాంబికం ఈగో అనేది ఆయ‌న‌కు అస్స‌లు ఉండేది కాదు. ఓ …

Read More »

తెలంగాణ ఎంపీల‌ను చూసి నేర్చుకోండి

ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌, కేంద్రం నుంచి అందాల్సిన వాటా.. ఇలా పార్ల‌మెంట్‌లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల‌కు చాలా స‌మ‌స్య‌లే ఉన్నాయి. కానీ శీతాకాల స‌మావేశాల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఏపీ ఎంపీలు త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌శ్నించ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీతో పాటు ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎంపీలు కూడా ఎలాంటి నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డం …

Read More »

భీమ‌వ‌రంపై జ‌గ‌న్ దృష్టి.. వాళ్ల‌కు చెక్ పెట్టేందుకే!

శాస‌న మండ‌లి ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు, క్ష‌త్రియ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా పాత‌పాటి స‌ర్రాజు, జడ్పీ ఛైర్మ‌న్‌గా క‌వురు శ్రీనివాస్‌, డీసీసీబీ ఛైర్మ‌న్‌గా పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు, డీఎస్ఎంఎస్ ఛైర్మ‌న్‌గా వెంక‌ట‌స్వామి.. ఇలా వివిధ స్థాయిల్లో ఛైర్మ‌న్లుగా ఉన్న వీళ్లంతా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు. సీఎం జ‌గ‌న్ ఆ నియోజ‌క‌వర్గంపై ప్ర‌ధాన దృష్టి సారించ‌డానికి చెప్పేందుకు ఈ జాబితానే ఉదాహ‌ర‌ణ‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ …

Read More »

రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా ?

పార్టీ పెట్టి దాదాపు ఆరేళ్ళవుతున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భవిష్యత్తులో జనాలు ఆదరిస్తారనే సూచనలు కూడా కనబడటం లేదు. పోటీచేసిన ప్రతి ఎన్నికలోను ఓడిపోవటమే తప్ప గెలుపు అవకాశాలే కనబడలేదు. ఇదంతా ఎవరి విషయంలో అనుకుంటున్నారా ? అదేనండి భారతీయ చలన చిత్రసీమలో ప్రముఖ నటుడు కమలహాసన్ గురించే. అవును మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ గురించే ఇదంతా. తాజాగా కరోనా వైరస్ …

Read More »

జగన్ భలే మ్యానేజ్ చేశారుగా ?

జనాల నాడిని జగన్మోహన్ రెడ్డి బాగానే స్టడీ చేసినట్లున్నారు. తాజాగా మూడు జిల్లాల పర్యటనలో బయటపడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే మూడు జిల్లాల్లో కలిపి సుమారుగా 60 మంది చనిపోయారు. వేల ఎకరాల్లో పంటలతో పాటు ఇతర వ్యక్తిగత ఆస్తులను కూడా జనాలు నష్టపోయారు. వర్షాలు, వరద ఉధృతి ఎక్కువగా …

Read More »

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం బీపీ హఠాత్తుగా పడిపోవడంతో ఆయన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. రోశయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. అజాతశత్రువుగా పేరుగాంచిన రోశయ్య మృతి పట్ట ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా రోశయ్య మృతి …

Read More »

వీరాభిమాని తలపై చేయిపెట్టి ఒట్టేసిన జగన్

Jagan

ఆమె ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఆ అభిమానంతో ఆమె చేతిపై జగన్ ఫొటోను పచ్చబొట్టు వేసుకుంది. అయితే ప్రస్తుతం జగన్‌కు ఓట్లు వేసి మోసపోయామని వాపోతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని ఆమెతో పాటూ కాంట్రాక్టు కార్మికులంతా భీష్మించుకున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కారిస్తామని జగన్ హామీ కూడా ఇచ్చారు. హామీ ఇస్తే సరిపోదని.. తన తలపై ఓట్టు వేయాలని …

Read More »

పీఆర్సీపై జగన్ కీలక ప్రకటన

Jagan Mohan Reddy

ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యోగ సంఘాలు పోరుబాటపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయకపోవడంతోనే ఈ నెల 7 నుంచి తాము నిరసనలకు దిగబోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నిరసన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు వారితో సీఎంవో అధికారులు చర్చలు జరుపుతున్నారు. …

Read More »