ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం …
Read More »జగన్ హిట్ సాంగ్ ను తెగ వాడేస్తోన్న టీడీపీ
ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ …
Read More »టీడీపీ సెట్టవ్వాలంటే.. వాళ్లను బయటకు పంపాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో విజయం సాధించకపోతే తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఇక అంతే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆ దిశగా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు. కానీ పార్టీలోని కొంతమంది నాయకుల వ్యవహార శైలి ఆయనకు తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీలోనే ఉంటూ కొంతమంది నేతలు …
Read More »మేము తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలం
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా తలపడుతున్నారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధిన పత్రాలు ఇవేవి ఉద్యోగులకు అందలేదు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాయ మాటలు నమ్మి వైసీపీకి …
Read More »కేసీఆర్ను మమతను కలిపేందుకేనా?
రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే సంకేతాలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం మహా రంజుగా సాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే వ్యాఖ్యలు. మరోవైపు కాంగ్రెస్ను పక్కనపెట్టి మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ …
Read More »టాప్ 5: రోశయ్య సత్తా చాటే 5 ఉదంతాలు
మన మధ్య ఉన్నప్పుడు గొప్పతనం తెలీదు. తిరిగి రాని లోకాలకు పయనమైన తర్వాత.. సదరు వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వారిసత్తా తెలీటమే కాదు.. ఇలాంటి వారు ఇకపై ఉండరేమోనన్న భావన అప్పుడప్పడు కలుగుతుంది. ఎన్ని రంగాలు ఉన్నా.. సామాన్యుడి మొదలు అసమాన్యుడు వరకు అందరిని ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తాను బతికే వ్యక్తి సైతం.. రాజకీయంగా …
Read More »బీజేపీ సమస్యేంటో అర్థం కావటం లేదే ?
ఇపుడు అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. కేంద్రంలో గడచిన ఏడున్నరేళ్ళుగా అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం కమలం పార్టీ పుంజుకోవడం లేదు. పక్కనున్న తెలంగాణలో పార్టీ మంచి ఊపు మీదున్నా ఏపీలో మాత్రం రోజురోజుకు కుదేలైపోతోంది. దీనికే కారణం ఏమిటనే విషయాన్ని నేతలు ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కావడం లేదు. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా పుంజుకుంటుందనే ఆశలు కూడా కనబడటం లేదు. దేశమంతా మోడి గాలిలో బీజేపీ …
Read More »ఫైర్ బ్రాండ్ పవర్ఫుల్ ప్లాన్.. ఫుల్ హ్యాపీస్?
ఫైర్ బ్రాండ్ గా పాపులరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అయిపోతారేమో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ రూపంలో గట్టి మద్దతుదారు దొరికారు కాబట్టే. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని మమత ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైతే మమత ప్రయత్నాలకు ఇతరుల నుంచి పెద్దగా సానుకూలత రాలేదన్నది వాస్తవం. ఒకటి రెండు సార్లు ఎన్సీపీ …
Read More »కేసీఆర్ యూ టర్న్?
ఏది ఏమైనా తాను అనుకున్నది చేసి తీరతాడని తెలంగాణ సీఎం కేసీఆర్కు పేరుంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. ఆరోపణలు వచ్చినా ఆయన మాత్రం తాను తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసే తీరతారు. అది పార్టీ పరంగా కావొచ్చు లేదా ప్రభుత్వ విధానాల పరంగా కావొచ్చు. ఆయన ఏ విషయంలోనూ వెనకడగు వేసింది లేదని విశ్లేషకులు చెప్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వెనక్కి …
Read More »మోడీ నుంచి ఏపీకి ఘాటు లేఖ.. ఏం జరిగింది?
ఏపీ ప్రభుత్వంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం మేరకు.. ప్రధాని తొలిసారి ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జగన్ చేస్తున్న పనులపై ప్రధాని సీరియస్గా ఉన్నారని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జగన్ ప్రభుత్వానికి లేఖ సంధించారు. ప్రస్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచినప్పటికీ… ఢిల్లీ వర్గాలు …
Read More »కన్నీటితో భువనేశ్వరి పాదాలు కడుగుతాం
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. భువనేశ్వరి అనుమతిస్తే.. ఆమె పాదాలను తమ కన్నీటితో కడుగుతామంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు …
Read More »ఏపీ దివాలా.. బీజేపీ ఎంపీ సీరియస్ కామెంట్లు
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ దివాలా తీస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జీవీఎల్.. ఈ సందర్భంగా ఏపీలోని జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ తన మెచ్చుకోలు …
Read More »