2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు తాజాగా మరో బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. …
Read More »పంజాబ్‌లో కాంగ్రెస్ మళ్లీ పాగా వేస్తుందా?
ఇదీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్కటే ఆ పార్టీకి ఆశాజనకం గా మారింది. ఇక్కడైనా గెలుపు గుర్రం ఎక్కి.. రెండో దఫా అధికారం దక్కించుకుంటే తప్ప.. కాంగ్రెస్‌కు పరువు, మర్యాదలు దక్కేలా లేవని అంటున్నారు పరిశీలకులు. అయితే.. 2017లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజులు సజావుగానే సాగినా.. తర్వాత తర్వాత.. సొంత నేతల ప్రత్యేక వివాదాలతో పార్టీ అధిష్టానానికి …
Read More »ఈ దఫా పవన్ గెలుపు గ్యారెంటీ.. రాసిపెట్టుకోండి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ వంటి కీలక నాయకులు చేయించిన సర్వేలో.. పవన్ ఖచ్చితంగా గెలుస్తారని.. అసెంబ్లీలో అడుగు పెడతారని పేర్కొన్నారు. కానీ, ఆయన విశాఖలోని భీమిలిలోను, పశ్చిమలోని భీమవరంలోనూ.. పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గాల ఆయనపై ఐరన్‌లెగ్ అనే ముద్ర వేశాయి. అయితే.. ఇప్పుడు సమీకరణలు మారుతున్నాయని.. …
Read More »ఒక్క సంఘటనతో టీఆరెస్ లో భారీ మార్పులు?
కొత్త గూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు తనయుడు రాఘవ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో పెను దుమారమే రేగుతోంది. వ్యాపారి రామకృష్ణ ఆత్మహత్యకు రాఘవ కారణమంటూ వచ్చిన ఆరోపణలు రాష్ట్ర ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తున్న జనాలు రాఘవను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే పార్టీ …
Read More »నిరుద్యోగులకు `జగనన్న హ్యాండ్!`
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య.. నానాటికీ పెరుగుతూనే ఉంది. గత ఎన్నికల సమయానికి రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా వేశారు. ఈ క్రమంలోనే అప్పటి పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేతగా.. జగన్ నిరుద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 90 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయి నా.. కేవలం వలంటీర్లు, సచివాలయ …
Read More »అయ్య తాగుబోతు.. కొడుకు తిరుగుబోతు: MP అరవింద్
తెలంగాణలో ఇప్పుడు అధికార పక్షం వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. నువ్వు ఒకటంటే నేనునాలుగు అంటా. నువ్వు నాలుగు అంటే నేను పది అంటానంటూ విరుచుకుపడుతున్న వైఖరి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిపోయేలా చేస్తోంది. ఒకవైపు తెలంగాణ అధికారపక్షంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతుంటే.. వాటికి కౌంటర్లు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ భారీ ప్రెస్ మీట్ పెట్టటమేకాదు.. ఆయన సైతం తనకున్న మాటల సత్తాను …
Read More »చంద్రబాబు తొందరపాటు ?
తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. వివిద సందర్భాల్లో ఈమధ్య చంద్రబాబు రియాక్టవుతున్న విధానం వల్లే చంద్రబాబు తొందరపడ్డారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అంటే కుప్పం పర్యటనలో పొత్తు గురించి బహిరంగంగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎవరో కార్యకర్త జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదాని అడిగాడు. మామూలుగా అయితే ఆ మాటను చంద్రబాబు వినీ విననట్లు వదిలేసేవారే. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో …
Read More »కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విచారణకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఘటనపై విచారణ జరిపేందుకు లేదంటు నిలిపేసింది. నాలుగు రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం అందరికీ తెలిసిందే. రోడ్డు మార్గంలో వెళుతున్న మోడీ కాన్వాయ్ ను ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు 20 నిమిషాల పాటు ఆపేసిన విషయం తెలిసిందే. చివరకు చేసేది లేక ప్రధాని తన పర్యటనను …
Read More »సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!
సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. చెత్త సినిమాలు తీసి, అనవసర వివాదాలు రాజేసి, చీప్ కామెంట్లు చేసి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం మీద అర్థవంతమైన వాదన చేస్తూ, ఆలోచింపజేసే ప్రశ్నలు సంధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. గత …
Read More »మోడీ విషయంలో కాంగ్రెస్ తప్పు
త్వరలోనే ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? మోడీ పర్యటనను అడ్డుకున్నవారిని నిలువరించడంలో చూపిన నిర్లక్ష్యం(అది అనుకోకుండా అయినా.. ఉద్దేశ పూర్వకంగానే అయినా) ఇప్పుడు కాంగ్రెస్‌కే ఇబ్బందులు తెచ్చిపెడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మోడీ ఘటన తర్వాత.. బీజేపీ దూకుడు పెంచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. దీనిని తమకు అవకాశంగా మార్చుకుని కాంగ్రెస్‌పై మరింత దూకుడు పెంచేందుకు రెడీ అయింది. దీనిలో …
Read More »సజ్జల రాజ్యసభకు వెళ్తారా?
ప్రజా ప్రతినిధిగా ఏ పదవిలో లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ సలహాదారుగా పార్టీలో జగన్ తర్వాతి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని వైసీపీ నాయకులే అంటున్నారు. ప్రభుత్వం తరపున పార్టీ తరపున విలేకర్ల సమావేశంలో ఆయనే కీలక ప్రకటనలు చేస్తున్నారు. అంతే కాకుండా విపక్షాల కౌంటర్లకు బదులిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా చక్రం తిప్పుతున్న ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా? అనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. మరి ఇప్పుడు అనుభవిస్తున్న హోదాను వదలుకుని ఆయన …
Read More »నా నియోజకవర్గంలో దొంగలు పడ్డారు: CBN
ప్రజలు అధికార పీఠమెక్కిస్తే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం వారిపై దాడులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలపై పోరాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందన్న బాబు.. బాధితుల్లో వైసీపీ నేతలూ ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని మండిపడ్డారు. మద్యం తయారీలోనూ రసాయనాలు కలుపుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం …
Read More »