బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రకటించారు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం కాబట్టి మధ్యాహ్నం 2.38 కి తొలి జాబితా రిలీజ్ చేశానని, తప్పకుండా పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక ఆట అని, బీఆర్ఎస్ కు మాత్రం ఎన్నికలంటే ఒక పవిత్ర యజ్ఞం అని, బాధ్యత అని అన్నారు. ప్రజలు మరోసారి తమను ఆశీర్వదించాలని, బంగారు తెలంగాణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు.

ఇక, గత ఎన్నికలలో పోటీ చేసిన జాబితాలో పెద్దగా మార్పులు చేర్పులు లేవని కేసీఆర్ అన్నారు. సమీకరణాల దృష్ట్యా కొందరు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేకపోయామని, వారంతా నిరాశ చెందవద్దని కేసీఆర్ అన్నారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఒకటే కాదని, పార్టీలో ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ ఇలా అనేక అవకాశాలుంటాయని అన్నాు. జడ్పీ చైర్మన్ లుగా, రకరకాల పదవులలో అవకాశం పొందిన వాళ్లున్నారని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, తాను ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని టికెట్ దక్కని ఆశావహులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని, టికెట్ రాని వారందరినీ సముచితంగా గౌరవించి తగిన స్థానాలు కల్పిస్తానని కేసీఆర్ భరోసానిచ్చారు. కొన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు.

కాగా, గజ్వేల్ నుంచి కేసీఆర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్, సిద్ధిపేట నుంచి హరీష్ రావు పోటీ చేయబోతున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు తొలి జాబితా ఇదే:

సంగారెడ్డి- చింతా ప్రభాకర్
పటాన్ చెరు- మహిపాల్ రెడ్డి
దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్- కేసీఆర్
మేడ్చల్- సీహెచ్ మల్లారెడ్డి
మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
ఉప్పల్- బండారి లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్‌బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్రనగర్- ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
చేవేళ్ల- కాలె యాదయ్య
పరిగి- కె. మహేష్ రెడ్డి
వికారాబాద్- డాక్టర్ ఆనంద్
తాండూరు- రోహిత్ రెడ్డి
ముషీరాబాద్- ముఠా గోపాల్
అంబర్ పేట- కాలేరు వెంకటేష్
ఖైరతాబాద్- దానం నాగేందర్
జూబ్లీహిల్స్- మాగంటి గోపినాథ్
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్- టి. పద్మారావు
కంటోన్మెంట్- లాస్య నందిత
కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
నారాయణపేట – ఎస్. రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్- వి.శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల- సీహెచ్. లక్ష్మారెడ్డి
దేవరకద్ర- ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఆలంపూర్- ఆబ్రహం
నాగర్ కర్నూల్- గువ్వల బాలరాజు
కల్వకుర్తి- జైపాల్ యాదవ్
షాద్ నగర్- అంజయ్య యాదవ్
కొల్లాపూర్- బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ- రమావత్ రవీంద్రకుమార్
నాగార్జునసాగర్- నోముల భగత్
మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్- శానంపూడి సైదిరెడ్డి
కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట- గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి- గాదరి కిషోర్ కుమార్
ఆలేరు- గొంగిడి సునీత
జనగామ- పల్లా రాజేశ్వర్ రెడ్డి
స్టేషన్‌ఘన్ పూర్- కడియం శ్రీహరి
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్- డి. రెడ్యానాయక్
మహబూబాబాద్- శంకర్ నాయక్
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పు- నన్నపునేని నరేందర్
వర్ధన్నపేట- ఆరూరి రమేష్
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
ములుగు- బడే నాగజ్యోతి
పినపాక- రేగా కాంతారావు
ఇల్లందు- గుమ్మడి అనురాధ
ఖమ్మం- పువ్వాడ అజయ్
పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
మధిర- లింగాల కమల్ రాజు
వైరా- మదన్ లాల్
సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
ఆశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వరరావు
భద్రాచలం- తెల్లం వెంకటరావు
సిర్పూర్- కోనేరు కోనప్ప
చెన్నూరు- బాల్క సుమన్
బెల్లింపల్లి- దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- ఎన్. దివాకర్ రావు
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్- భూక్యా జాన్సన్ నాయక్
ఆదిలాబాద్- జోగు రామన్న
బోథ్- అనిల్ జాదవ్
నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్- విఠల్ రెడ్డి
ఆర్మూర్- ఆశన్నగారి జీవన్ రెడ్డి
బోధన్- షకీల్ అమీర్ మహమ్మద్
జుక్కల్- హన్మంత్ షిండే
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి- జాజుల సురేందర్ రెడ్డి
కామారెడ్డి- గంప గోవర్ధన్
నిజామాబాద్ అర్బన్- బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి
కోరుట్ల- కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
జగిత్యాల- ఎం. సంజయ్ కుమార్
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
రామగుండం- కోరుకంటి చందర్ పటేల్
పెద్దపల్లి- దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్- గంగుల కమలాకర్
చొప్పదండి- సుంకే రవిశంకర్
వేములవాడ- చల్మెడ లక్ష్మీనరసింహారావు
సిరిసిల్ల- కేటీఆర్
మానకొండూరు- రసమయి బాలకిషన్
హూజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్- వొడితెల సతీష్ కుమార్
సిద్దిపేట- హరీష్ రావు
మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి
నారాయణఖేడ్- భూపాల్ రెడ్డి
ఆంథోల్- క్రాంతికిరణ్ చంటి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్- మాణిక్ రావు