Political News

కేటీఆర్ ట్వీట్ కాపీ.. కామెడీ అయిన ఏపీ ఎమ్మెల్యే

ఇండియాలో త‌మ కార్ బ్రాండును తీసుకురావ‌డానికి భార‌త ప్ర‌భుత్వంతో ఇబ్బందులున్న‌ట్లుగా ఇటీవ‌ల టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ చేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ జ‌వాబు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామ‌మ‌ని, త‌మ‌తో క‌లిస్తే స‌వాళ్ల‌పై క‌లిసి ప‌ని చేసి ప‌రిష్కారం క‌నుగొందామ‌ని కేటీఆర్ ట్వీట్ వేశారు. అస‌లు టెస్లా ఇండియాకు రాక‌పోవ‌డానికి కార‌ణాలేంటో తెలియ‌కుండా చాలామంది సెల‌బ్రెటీలు కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ …

Read More »

ఏపీ స‌ర్కారుకు మ‌రింత సెగ‌

ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రింత సెగ త‌గ‌ల‌నుందా? ఇప్ప‌టికే త‌మ‌కు పీఆర్సీతో తీవ్ర న‌ష్టం చేకూర్చారంటూ.. తీవ్ర ఆవేద‌న, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న  ఉద్యోగ సంఘాలు.. తాజాగా మ‌రింత తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మాన్ని వేడెక్కించాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలో అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని.. అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. శుక్ర‌వారం నాటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు …

Read More »

‘గుడివాడ‌లో గోవా’ నిజాలు తేల్చ‌నున్న టీడీపీ!

‘గుడివాడ‌లో గోవా’.. ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా.. కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కొడాలి నానికి చెందిన సొంత కె-క‌న్వెన్షన్‌లో గోవా త‌ర‌మా కేసినో న‌డిచింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఎక్క‌డెక్క‌డి నుంచో జూద ప్రియుల‌ను ఇక్క‌డ‌కు ఆహ్వాన‌నించి.. భారీ స్థాయిలో జూదాలు నిర్వ‌హించార‌ని. ఆధారాల‌తో స‌హా.. కొన్ని మీడియా సంస్థ‌లు వెలుగులోకి తెచ్చాయి. అయితే.. దీనిపై అటు ప్ర‌భుత్వం కానీ.. ఇటు ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానీ కానీ.. ఇప్ప‌టి …

Read More »

మూడు రాజ‌ధానుల మాదిరే.. పీఆర్సీ కూడా!

ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా?  ఉద్యోగుల ఉద్య‌మ తీవ్ర‌త పెరుగుతున్న‌నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకుందా?  ప్ర‌స్తుతం తీసుకున్న పీఆర్సీ నిర్ణ‌యాన్ని స‌ర్కారు వెన‌క్కి తీసుకునేందుకు నిర్ణ‌యించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కార‌ణాల నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కారు కొన్నాళ్లు ప‌ట్టుబ‌ట్టిన మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు.. త‌ర్వాత‌.. దీనిని వెన‌క్కి తీసుకుంది. అదేవిధంగా …

Read More »

ఐదు రాష్ట్రాల్లో క‌నిపించ‌ని కామ్రెడ్ల రాజ‌కీయం

దేశం మొత్తం ఎంతో ఆస‌క్తితో చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు అన్ని పక్షాలు.. తమ సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. పొత్తుల చర్చలు, సీట్ల కేటాయింపులతో బిజీబిజీగా గడుపుతూ.. ఆయా పార్టీల నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే దశాబ్దాల చరిత్ర, ఓటు బ్యాంకు కలిగి ఉన్న వామపక్షాల సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వామపక్షాల్లో కీలకంగా చెప్పుకునే సీపీఐ, …

Read More »

రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తిచ్చి ఉంటే..

ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు రోడ్డెక్కారు. త‌మ‌కు పీఆర్సీ మాటన జీతాలుత‌గ్గించారంటూ.. వారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. అంతేకాదు.. ప్ర‌బుత్వం ఇచ్చిన చీక‌టి జీవోను ర‌ద్దుచేయాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఉద్యోగులు ఈ రేంజ్‌లో రోడ్డెక్క‌డం అనేది జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రెండున్న‌రేళ్ల కాలంలో ఇదే అని చెప్పాలి. ఎందుకంటే. సీఎంకు భ‌య‌ప‌డ్డారో.. లేక‌.. వైసీపీని గ‌తంలో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి… సీఎం జ‌గ‌న్‌పైనా.. మెచ్చుకోళ్ల మాట‌ల‌తో త‌బ్బిబ్బు చేసిన‌.. ఉద్యోగుల‌కు ఆ మొహ‌మాటం …

Read More »

కాంగ్రెస్ లేకుండా శివ‌సేన‌ – ఎన్సీపీ పొత్తు

జాతీయ రాజ‌కీయాల్లో తిరిగి పుంజుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశ‌గా అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తులు చేయ‌డం లేద‌న్న‌ది మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అవ‌కాశాల‌ను వ‌దులుకుని కాంగ్రెస్ త‌ప్పు చేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ దాన్ని నిల‌బెట్టుకునే దిశ‌గా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు పార్టీ అధినాయ‌క‌త్వం తీసుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను హైక‌మాండ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇలా అయితే ఎన్నిక‌ల్లో దెబ్బ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. …

Read More »

T బీజేపీలో సీక్రెట్ మీట్.. హై క‌మాండ్ సీరియ‌స్!

తెలంగాణ‌లో అధికారమే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.  అక్క‌డ పార్టీ విజ‌యానికి మంచి అవ‌కాశాలున్నాయ‌ని భావించిన అధిష్ఠానం కూడా నాయ‌కుల‌కు అండ‌గా నిలుస్తోంది. కానీ ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్ర బీజేపీలో నెల‌కొన్న లుక‌లుక‌ల ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తెలంగాణ బీజేపీలో అంత‌ర్గ‌తంగా నెల‌కొన్న విభేదాలు తెర‌పైకి వ‌చ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఓ వ‌ర్గం ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌డమే …

Read More »

క‌న్నా వాయిస్ అందుకే క‌ట్ అయ్యిందా ?

రాష్ట్ర బీజేపీలో చుక్కానిగా క‌నిపిస్తున్న  పార్టీ నేత‌ల‌కు అంతో ఇంతో.. భ‌రోసాగా ఉన్న మాజీ మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అభాసుపాల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్‌కు ఎలాంటి ఢోకాలేకుండా ముందుకు సాగారు. రాజకీయంగానే ఆయ‌న‌పై విమ‌ర్వ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను ఎవ‌రూ వేలెత్తి చూపించే ప‌రిస్థితి లేదు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష పార్టీగా.. ఆ పార్టీ నేత‌గా.. త‌ర‌చుగా ఆయ‌న …

Read More »

ఆ ఎమ్మెల్యేకు రు. 500 కోట్లు?

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు హంగు ఆర్భాట‌మేకాదు.. కేవ‌లం ప‌ద‌వులు.. అనుభ‌వించ‌డాలే కాదు. ఫ్యూచ‌ర్ గురించి కూడా జాగ్ర‌త్త ప‌డిపోతున్నారు. అంటే దీపం ఉండ‌గానే చ‌క్క‌బెట్టుకోవ‌డం అన్న మాట. ఇప్పుడు ఇలాంటి మాటే అనంత‌పురం జిల్లాకు చెందిన ఒక కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చుట్టూ వినిపిస్తోంది. ఆయ‌న దాదాపు 500 కోట్ల రూపాయ‌ల‌తో హైద‌రాబాద్‌లో భూములు కొన్నారంటూ.. కొన్ని రోజుల కింద‌ట‌.. టీడీపీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలు ఒక‌రు ఆరోపించారు. అప్ప‌ట్లో …

Read More »

వైసీపీని చిత్తుగా ఓడిస్తారట

ఉప ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తానంటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలెంజ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ప్రతిపక్ష పార్టీల సహకారంతో నరసాపురం ఎంపీగా మళ్ళీ గెలుస్తానంటు ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీవరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీకి గడువు ఇస్తున్నట్లు ఎంపీ మరోసారి చెప్పారు. తన రాజీనామాను ఆమోదించవద్దని లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ రాయటాన్ని ఎద్దేవా …

Read More »

కొత్త జీతం వద్దు.. పాతదే ముద్దు

మీరే చేసేది ఏ ఉద్యోగం అయినా కావొచ్చు. కొత్తగా జీతం పెంచారంటే ఏమని ఆశిస్తారు? పాత జీతం కంటే ఎక్కువ మొత్తం వస్తుందనుకుంటారు. కానీ.. అలా కాకుండా పాత జీతం కంటే కొత్త జీతం తక్కువగా ఉంటే? అదెక్కడైనా ఉందా? అని ఆశ్చర్యపోవచ్చు. ఉండటమే కాదు.. ఇప్పుడదే పెద్ద రచ్చగా మారింది ఏపీలో. గడిచిన కొంతకాలంగా తమకు ఇవ్వాల్సిన పీఆర్సీ లెక్క తేల్చమని.. తమ జీతాలు పెంచాలని ఏపీ ప్రభుత్వ …

Read More »