హైకోర్టు షాక్: లోకేష్ కు 41ఏ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు హైకోర్టు సూచించింది. దీంతో, లోకేష్ కు 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విచారణకు ఎప్పుడు రావాలన్ని విషయాన్ని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు వెల్లడించనున్నారు.

ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులలో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వాటిపై విచారణ జరగనుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్ని రోజుల్లోగా విచారణకు రావాలన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో, హైకోర్టులో ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కస్డడీ, బెయిల్ పిటిషన్ లపై విచారణ జరగాల్సి ఉంది.