జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాజా మంత్రులతో పాటు మాజీ మంత్రి కూడా జోరు పెంచారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ ను చంద్రబాబునాయుడు బానిసగా అభివర్ణించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కష్టపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద చూపించే ప్రేమలో కొంతైనా సోదరుడు చిరంజీవి మీద చూపిస్తే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. పవన్ టార్గెట్ గా మంత్రులు, వైసీపీ …
Read More »బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం …
Read More »ఏపీలోకి ప్రముఖ సంస్థ.. 5500 కోట్ల పెట్టుబడి
ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారని.. ఒక్క కంపెనీని కూడా స్థాపించలేక పోయారని విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. ప్రభుత్వం చెక్ పెట్టింది. తాజాగా భారీ పెట్టుబడులతో ఒక కీలక కంపెనీ.. ఏపీలోకి వచ్చేందుకురెడీ అయింది. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్(యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల …
Read More »టీ కాంగ్రెస్: పీకే వార్ పై రేవంత్ క్లారిటీ!
క్షణానికి ఓ మారు మారే పరిణామాలను అంచనా వేయడం కష్టం. క్షణానికో మారు మారే పరిణామాలకు అనుగుణంగా పార్టీల విధి విధానాలను ఖరారు చేస్తూ ఏదో ఒక క్లారిఫికేషన్ ను పొందడం ఇంకా కష్టం. ఇప్పుడు తెలంగాణ వాకిట ముఖ్యంగా ఇంటి పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీ వేళ క్షణానికో పొలిటికల్ లీక్ లాజిక్కులకు అందకుండా వెల్లడిలో ఉంటుంది.దీంతో సోషల్ మీడియాలో ఆయా పార్టీల వర్గాలు ఎవరికి వారు తమకు అనుగుణంగా మారుతున్న …
Read More »వైసీపీ నేతలతో లగడపాటి మంతనాలు.. ఏం జరుగుతోంది?
మాజీ ఎంపీ, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడుగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల పాటు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు. …
Read More »మంత్రి అయ్యాక ఆమె మారిపోయారబ్బా!
వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. పపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వీరు గట్టివాయిస్ వినిపించారు. మీడియా ముందు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి.. నిరంతరం ట్రోల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. సహా.. జనసేనపై విరుచుకుపడేవారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరు మరింత పేరు తెచ్చుకున్నారు. వీరిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగరి ఎమ్మెల్యే రోజా …
Read More »కాంగ్రెస్ నేతలను చేర్చుకోండి… కేసీఆర్‌కు పీకే సలహా?
తెలంగాణ రాజకీయాల్లోకి ఎన్నికల వ్యూహకర్తగా ఎంట్రీ ఇవ్వడంతో మొదలు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగిస్తున్న అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆ ఒరవడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు సోనియా, రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వచ్చిన టైంలోనే ఆయన టీఆర్ఎస్ అధినేతతో భేటీ అవడం రెండు పార్టీలకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే సంగతి తెలిసిందే. అయితే, తాను కాంగ్రెస్‌లో చేరినా తన టీం …
Read More »రాజధానిపై వైసీపీ రిస్క్‌లేని కొత్త గేమ్…!
రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఊహించని సంఘటన. ఎందుకంటే.. అమరావతిని మార్చి మూడు రాజధానులకు నిన్న మొన్నటి వరకు మొగ్గు చూపిన వైసీపీ అధినేత జగన్ వ్యూహాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తుండడమే!. ఇదే విషయంపై తాడేపల్లి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. అనేక సందర్భాల్లో మూడు రాజధానుల కే తాముకట్టుబడి ఉన్నామని.. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా జగన్ ప్రకటించారు. వికేంద్రీకరణ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని …
Read More »మన టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్!
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు దాదాపుగా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు విపక్షాలు సైతం ఇప్పుడే ఎన్నికలున్నాయా అనే రీతిలో ప్రతిస్పందిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ఎపిసోడ్ కీలక పరిణామం తెరమీదకు వచ్చినట్లు కనిపిస్తోంది. అదే టీఆర్ఎస్ తరఫున పార్టీ రథసారథి కేసీఆర్ కంటే ఎక్కువగా ఆయన తనయుడైన పార్టీ …
Read More »తెలంగాణా కాంగ్రెస్ కు పెద్ద సమస్యొచ్చిందే ?
తెలంగాణా కాంగ్రెస్ నేతలకు పెద్ద సమస్యొచ్చింది. జాతీయస్థాయిలో పార్టీ పునరుజ్జీవనానికి సేవలు అందించటానికి అంగీకరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణాలో కేసీయార్ కు కూడా సలహాదారుడిగా ఉండటమే వీళ్ళ ఇబ్బందులకు పెద్ద కారణమవుతోంది. నిజానికి అటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ కు ఏకకాలంలో పనిచేయటం కష్టమనే చెప్పాలి. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ అనుకున్నా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో మాత్రం అలా సాధ్యం …
Read More »పద్మభూషణ్ ఇస్తామని.. సోనియాకు 2 కోట్లు
కాంగ్రెస్ ను ఇప్పుడిప్పుడే మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్న సోనియా గాంధీకి.. దిమ్మతిరిగి పోయే అంశం తెరమీదికి వచ్చింది. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ ఇప్పిస్తామంటూ.. సోనియా కోసం రూ.2 కోట్లను తన తో ఖర్చు పెట్టించారని.. ఎస్. బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఈడీకి కీలక విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక …
Read More »జగన్ భ్రమలో నేతలు.. ఇలా ఎన్నాళ్లు!
“మనం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్లండి. ఆయా పథకాలను వివరించండి. వారి బాధలు కూడా తెలుసుకోండి“ అని సీఎం జగన్ తన పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. కానీ, ఎవరు వింటున్నారు? ఎవరు నిజంగా ప్రజల మధ్య ఉంటున్నారు? అనే విషయాలు ఆరా తీస్తే.. 10 పర్సంట్ నేతలు మాత్రమే ఉంటున్నారని.. పీకే చేసిన తాజా సర్వే స్పష్టం చేసింది. నిజానికి ఏ పార్టీకైనా.. ఏనేతకైనా.. …
Read More »