విద్య మరియు వైద్య రంగాలకు ఊతం ఇవ్వడం ఇవాళ అత్యావశ్యకం. మునుపటి కన్నా వేగంగా నిర్ణయాల అమలు కేసీఆర్ ముందున్న ఏకైక సవాలు. పరిణామాలు మారుతున్నందున తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కేసీఆర్ చేయాల్సిన కృషి ఎంతో ! తెలంగాణలో నిన్నటి వేళ మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు ఆరంభం అయ్యాయి. టిమ్స్ పేరిట భాగ్యనగరిలో ఉప్పల్, అల్వాల్, ఎర్రగడ్డలో ఇవి శంకుస్థాపనకు నోచుకున్నాయి. ఓ విధంగా ఇప్పుడున్న …
Read More »నా గ్రాఫ్ 65 శాతం.. ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్.. సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, క్షేత్రస్థాయి నేతలతో ఆయన నిర్వహించిన సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65 శాతం ఉందని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేల్లో చాలామందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్ ఉందని, ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరగకపోతే మార్పులు తప్పవని జగన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ …
Read More »తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రాన్ని సాధించలేమా?
తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రంలో పాగా వేయలేమా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిం చారు. టీఆర్ ఎస్ ప్లీనరీ ని ఉద్దేశించిన మాట్లాడిన ఆయన గతంలో తెలంగాణ కోసం.. పడిన కష్టాలను వివరించారు. ఇంతకన్నా కష్టపడాలా..? కేంద్రం కోసం.. అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను సాధించిన ఉత్తేజంతో కేంద్రంలోనూ పాగా వేయాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం.. తాను ఒక్కడిని అడుగు వేస్తే.. ఎన్నో అవమానాలు వచ్చాయనితెలిపారు. ఇప్పుడు కూడా …
Read More »పెట్రోల్ ధరలు మీ ఇష్టమేనా?: ప్రధాని ప్రశ్న
తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా భేటీ అయ్యారు. అయితే.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన టీఆర్ ఎస్ ప్లీనరీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణలకు ప్రధాని మోడీ గట్టి ప్రశ్న సంధించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని. సామాన్యులకు ఊరట కలిగించేలా గతేడాది నవంబర్లో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై రూ.10 చొప్పున …
Read More »ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం
ఏపీలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ స్కీం పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేయాలంటూ పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. సీపీఎస్ ను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సీపీఎస్ రద్దు చేయమని జగన్ డిమాండ్ చేశారు. తాను కనుక సీఎం అయితే వారంలో సీపీఎస్ రద్దు చేస్తాను అన్నాడు. కానీ జగన్ సీఎం కాగానే ప్లేటు ఫిరాయించాడు. మూడేళ్ల తర్వాత.. …
Read More »గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ గవర్నర్కు సీఎం కేసీఆర్కు మధ్య జరుగుతున్న వివాదం సరికొత్త మలుపుతిరిగింది. తాజాగా కేసీఆర్ మరింత తీవ్రస్థాయిలో గవర్నర్ వ్యవస్థపై మండిపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. “గవర్నర్ వేస్ట్. ఈ వ్యవస్థ దుర్మార్గంగా మారింది. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోంది“ అని చెప్పారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారన్నారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్లో సైతం …
Read More »విజయసాయికి మళ్లీ కిరీటం
చేతిలో అధికారం ఉన్న అధినేతకు ఒళ్లు మండితే.. దాని ఫలితం ప్రజల కంటే కూడా ఆయన చుట్టూ ఉన్న విధేయుల మీద పడటం ఖాయం. అందుకు భిన్నంగా వేటు పడిన రోజుల వ్యవధిలోనే వరాలు పొందటం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. తాజాగా ఆయనకు ప్రభుత్వంలో సేవల్ని అప్పగిస్తూ కీలక నిర్ణయం …
Read More »పీకేను తప్పించడం వెనుక.. `పెద్ద` కారణమే ఉందా?!
ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా… సీఎం జగన్ అంతటివాడు.. రాజకీయంగా ఒక అడుగు వేస్తే.. దానికి వంద కారణాలు ఉంటాయి. తనకు ఏమీ లాభం లేకుంటే.. రాజకీయ నేత.. చెయ్యి కూడా విదల్చడన్నట్టుగా.. జగన్ కూడా అంతే… తనకు ఏమీ ప్రయోజనం లేకపోతే.. ఏ చిన్న మార్పు, చేర్పు కూడా చేయరనేది వాస్తవం అంటారు పార్టీ నాయకులు. తాజాగా.. తనకు ఎంతో ఇష్టమైన.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను …
Read More »కేసీఆర్ మరో కొత్త పార్టీ
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉత్సుకత చూపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్.. ఆ పార్టీకి చూచాయగా పేరు కూడా ప్రకటించారు. “భారత రాష్ట్ర సమితి“ బీఆర్ ఎస్ పేరును ఆయన తాజాగా ప్లీనరీలో ప్రకటించారు. దీనిని బట్టి కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లో ఈ పార్టీ పేరుతోనే ప్రచారం చేయనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక, ఆయన మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రగతి పంథాలో నడిపించడానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని.. ప్రజలను …
Read More »ఏపీ లెక్కలు: 3 ఏళ్ల అప్పులు 3 వారాల్లో తేలిపోయాయా ?
ఓ వైపు పన్నుల లెక్కలు తేలడం లేదు. మరోవైపు కేంద్రం అందించే సాయం ఎంతన్నది స్పష్టం కావడం లేదు. ఇదే సమయంలో ఆంధ్రావని చేసిన అప్పులు ఎంత ఏ మేరకు ఉన్నాయి అన్నవి కూడా ఎవ్వరూ వెల్లడి చేయడం లేదు. పైకి చెప్పేవి ఏవీ నిజం కావు అని గతంలోనే తేలిపోయింది. భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాల్సిన నిధులను కూడా ప్రభుత్వం వాడుకుంటోంది. ఆఖరికి విపత్తు నివారణకు సంబంధించిన నిధులు కూడా …
Read More »చంద్రబాబు పక్కన బురద పాము.. జాగ్రత్త!
విశాఖపట్నం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విశాఖలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల మాట్లాడుతూ బయటకు వస్తున్న బురద పాములతో అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇపుడు పుట్టలో నుండి బయటకు వస్తున్న బురద పాము మూడేళ్ళుగా ఏ పుట్టలో ఉంది ఎవరికీ తెలీదన్నారు. ఇలాంటి బురద పాము వల్ల …
Read More »1500 కోట్ల కోసం లక్షన్నర కుటుంబాలకు చెడ్డవుతున్న జగన్
గత ప్రభుత్వంలో మీరు ఇల్లు తీసుకున్నా సరే పేదలయిన మీకు మేం అండగా ఉంటాం. మీరు ఏ వాయిదాలు కట్టవద్దు. మేం అధికారంలోకి రాగానే ఇల్లు ఇస్తాం అని చెప్పారు వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. కానీ ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇంటి నిర్మాణాల పూర్తికి తీసుకున్న చర్యలేవీ లేవు. మరోవైపు సిమెంట్ ధరలు, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో …
Read More »