టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, తదనంతరం రిమాండు.. అంశాలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఇవే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచలనం కాగా, ఇప్పుడు చంద్రబాబును అర్థరాత్రి రాజమండ్రి జైలుకు తరలించడం.. ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా వాదనలు వంటివి.. జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అంతేకాదు.. అసలు స్కిల్ డెవలప్‌మెంటు కేసు పూర్వాపరాలు …
Read More »మరింత దగ్గరవుతున్న టీడీపీ జనసేన
తెలుగుదేశం పార్టీ, జనసేనలు మరింత దగ్గరవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును అరెస్టుచేయటాన్ని పవన్ ఖండించారు. అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి విజయవాడ వస్తున్న పవన్ను కుంచనపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తన వెహికల్లో …
Read More »మైనంపల్లి అయోమయంలో పడ్డారా ?
మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు పూర్తిగా అయోమయంలో పడినట్లు అర్ధమవుతోంది. మూడు వారాల క్రితం కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించినపుడు మల్కాజ్ గిరికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే మైనంపల్లి మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే తనతో పాటు తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే మైనంపల్లి డిమాండును కేసీయార్ పట్టించుకోకుండా మల్కాజ్ గిరిలో మైనంపల్లికి …
Read More »ఇక యుద్ధమే…జగన్ పై పవన్ ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త బంద్ నకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ బంద్ నకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనకు పవన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్ధిక …
Read More »చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను …
Read More »బ్రేకింగ్: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 6 గంటల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా చంద్రబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లుగా న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు. సిఐడి తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఈ నెల …
Read More »ఒక్కరోజే 1600 దరఖాస్తులు
తెలంగాణా బీజేపీ తరపున పోటీచేయటానికి ఒక్కరోజే అంటే శనివారం నాడు 1603 దరఖాస్తులు అందాయి. 1603 దరఖాస్తులు ఒక్కరోజే అందటంతో బీజేపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. 2వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈరోజు అంటే 10వ తేదీతో ముగుస్తోంది. 2వ తేదీనుండి శనివారం వరకు మొత్తంమీద 3300 దరఖాస్తులు అందినట్లు సమాచారం. మరి చివరిరోజు ఇంకెన్ని దరఖాస్తులు వస్తాయో చూడాలి. ఇన్ని వేల దరఖాస్తులు అందినా పార్టీలోని ప్రముఖులు ఎవరెవరు …
Read More »అసలేంటీ 409 సెక్షన్.. బాబుకు బెయిల్ వస్తుందా?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యాలు చూపించాలన్నారు. కోర్టులో ఈ సెక్షన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అసలు 409 సెక్షన్ ఏం …
Read More »చంద్రబాబును ఇరికించే ప్రయత్నం: కోర్టులో లూథ్రా
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని ఈ సందర్భంగా లూథ్రా పేర్కొన్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం …
Read More »రిపోర్టులో లోకేష్ పేరు..పీక కోసుకుంటానన్న అచ్చెన్న
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై రిమాండ్ రిపోర్టును విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీఐడీ అధికారులు కోరారు. అంతేకాదు, ఆ రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల పేర్లను కూడా సీఐడీ అధికారులు చేర్చడం సంచలనం …
Read More »అందుకే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు!
టీడీపీ నేతలకు మరోసారి నిరాశే ఎదురైంది. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలనుకున్న టీడీపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అందుకు అనుమతించారు. కానీ తాజాగా ఆ అపాయింట్మెంట్ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి కేసు విషయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడంతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే …
Read More »జడ్జి సూటి ప్రశ్న…గత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరెందుకు లేదు?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు సామాన్యులను సైతం తొలిచివేస్తున్న ప్రశ్న ఒక్కటే. 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates