ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 897 పోస్టులతో కూడిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు పచ్చ జెండా ఊపింది. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని చేపట్టింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించను న్నారు.
ఇవీ పోస్టులు
డిప్యూటీ తహసీల్దార్ – 114
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ – 150
గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4
గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28
59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ),
సీనియర్ ఆడిటర్
ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ – 566
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇప్పటికే ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ ఉన్న అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు అయితే.. కమిషన్ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ మోడ్‌లో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates