తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన.. రేవంత్‌రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుంచి అబినందనలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ఈ అభినందనలు వెల్లువెత్తితే.. చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే రేవంత్ వేసిన అడుగు, తీసుకున్న నిర్ణ యంవంటివి దుమ్మురేపేలా ఉండడంతోపాటు.. కొందరు ముఖ్యమంత్రులకు ఆదర్శంగా కూడా ఉండడం తో మరింతగా ఈ అభిమానం పెల్లుబుకుతుండడం గమనార్హం.
ప్రధానంగా.. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మారుస్తున్నామని.. అక్కడ నిర్మించిన బారికేడ్లు, ఇనుప కంచె ను తొలగిస్తున్నామని.. రేపటి నుంచి ప్రజలకు ఇది చేరువ అవుతుందని.. రేవంత్ ఎల్బీ వేదికగా చేసిన ప్రకటన.. సంచలనంగా మారింది. దీనిపట్లే ప్రజలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కక్షతోనో.. మరే ఉద్దేశంతోనో.. రేవంత్ సదరు ప్రగతి భవన్‌ను కూల్చేస్తామని ప్రకటిస్తే.. ఎవరూ అడ్డుకునేవారు కాదేమో!?
కానీ, ఆయన అలా ప్రకటించలేదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ భవనాన్ని ఆ ప్రజలకే మరింత చేరువ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓ ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. తొలి నిర్నయం.. అప్పట్లో చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక(8 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించింది)ను కూల్చేయడం. ఇది.. ఇప్పుడు ఏపీ ప్రజలకు గుర్తుకు వచ్చింది. ఏపీ పాలకుల్లాగా.. రేవంత్ కూడా ఆలోచించి ఉంటే.. అని విస్మయానికి గురయ్యారు.
అనుభవం లేకున్నా.. వారసత్వ రాజకీయాలు రాకున్నా.. రేవంత్.. తొలి అడుగులు.. ప్రజాభ్యుదయం పథంగా ముందుకు పడ్డాయని.. కేసీఆర్‌పై పీకల వరకు కోపం ఉన్నా.. ప్రగతి భవన్‌ను ప్రజలకు చేరువ చేశారే తప్ప. .. ఏపీ పాలకుల మాదిరిగా విపక్షాల ఆనవాళ్లు లేకుండా చేయాలని తలపోయలేదని.. కూల్చివేతలతోనే పాలనను ప్రారంభించలేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. చూడాలని కామెంట్ చేస్తు్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates