అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు రాత్రే ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయిన ఆయన.. అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో..తీవ్ర గాయమైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు.
సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు.. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించారు. సర్జరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే.. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. అసెంబ్లీకి కేసీఆర్ వెళతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నవేళ.. అనూహ్యంగా ఆయన ఫాంహౌస్ బాత్రూంలో జారి పడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై గులాబీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates