సీఎం కేసీఆర్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తన ఇంటి వద్ద రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేసీఆర్ను కోరారు. సోమవారం తన ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయించారని వెల్లడించారు. రెక్కీ నిర్వహించినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెక్కీ నిర్వహించినవారిలో ఒకరిని పట్టుకున్నారు.. కానీ రెక్కీ చేసిన వారిలో మిగతా వ్యక్తులు కారులో పారిపోయారన్నారు. ఏపీ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే.. డ్రైనేజీలో కూర్చుని నిరసన
సాధారణంగా.. విపక్షంలో ఉన్న నాయకులు.. తమ తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదంటూ.. నిరసన వ్యక్తం చేస్తారు. లేదా.. తమకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది .. కామన్ కూడా! ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. సహజంగానే ప్రతిపక్షానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ.. అదేం చిత్రమో కానీ.. వైసీపీ సర్కారులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డున పడుతున్నారు. తమకు రూపాయి కూడా …
Read More »రేవంత్ పై అసంతృప్తి.. సొంత ఇలాకాపైనే సీనియర్ల దృష్టి..!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారా..? వారి సొంత నియోజకవర్గాల్లో బలోపేతం పైనే దృష్టి పెడుతున్నారా..? రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలపై అనాసక్తి చూపుతున్నారా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంతుకు సహకరించడానికి సీనియర్లు విముఖంగా ఉన్నారా..? ఆయన ఒంటెత్తు పోకడ కూడా ఇందుకు కారణమా..? ఇక రాష్ట్ర పార్టీ భారం మొత్తం రేవంతే భరించాలా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. ఏడాది క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కొత్త కార్యవర్గాన్ని …
Read More »మొదలైన అక్కా-తమ్ముళ్ళ మధ్య వార్ ?
తెలంగాణా కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండాలి. వివాదాలు లేకపోతే పార్టీకి దిష్టి తగులుతుందన్నట్లుగా అయిపోయింది పార్టీ పరిస్ధితి. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ కోసం అక్కా తమ్ముళ్ళ మధ్యే వార్ మొదలైనట్లుంది. దివంగత ఎంఎల్ఏ పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్ఏ, …
Read More »కేసీయార్ వెనక్కు తగ్గుతున్నారా ?
క్షేత్రస్థాయిలో ను, పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర సమితిని జాతీయ స్ధాయికి విస్తరించాలని కేసీయార్ చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఊహించని రీతిలో టీఆర్ఎస్ లోనే సమస్యలు బయట పడుతుండటంతో బీఆర్ఎస్ ఆలోచనను కొంతకాలం వాయిదా వేసుకున్నట్లు అనుమానంగా ఉంది. నిజానికి జాతీయ …
Read More »బీజేపీ-వైసీపీ లవ్.. ఇక దాచేదేముంది?
పైకి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని శత్రువులా ప్రొజెక్ట్ చేస్తారు ఆంధ్రా బీజేపీ వాళ్లు. జగన్ సర్కారు మీద విమర్శలు కూడా చేస్తుంటారు. మరోవైపు వైసీపీ వాళ్లు సైతం బీజేపీ తమ శత్రు పక్షం అన్నట్లే వ్యవహరిస్తారు. కానీ వాస్తవంగా మాత్రం ఈ రెండు పార్టీల మధ్య చీకటి బంధం ఉందని ఎప్పటికప్పుడు పరిణామాలు రుజువు చేస్తూనే ఉంటాయి. ఎన్డీఏ సర్కారుకు పార్లమెంటులో ఎప్పుడు మద్దతు అవసరం అయినా మేమున్నాం …
Read More »మోడీ పాదాభివందనం చేసిన తెలుగు మహిళ ఎవరో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాధారణంగా ఎవరికీ పాదాభివందనం చేయరు. ఆయన పాదాభివందనం చేశారంటే.. ఆ వ్యక్తికి ఎన్నో స్పెషాలిటీలు ఉండాల్సిందే. ఇలాంటి ఘటనే తాజాగా పశ్చమ గోదావరిజిల్లాలోని భీమవరంలో తాజాగా చోటు చేసుకుంది. సోమవారం ఇక్కడ నిర్వహించిన అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళకు ఆయన పాదాభివందనం చేశారు. దీంతో ఆమె ఎవరు? ఆమె వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? …
Read More »పీఎం కార్యక్రమానికి పిలిచి.. టీడీపీని ఇలా అవమానించారే!
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఘోర అవమానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీని ఆహ్వానించాల్సి ఉంది. అయినప్పటికీ.. ఆహ్వానించలేదు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలుగు వాడు.. జి. కిషన్రెడ్డి.. స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక …
Read More »రఘురామ లేని లోటు.. భీమవరంలో సందడేది..?
ఆయన సొంత నియోజకవర్గం.. ఏకంగా ప్రధాన మంత్రి స్వయంగా వస్తున్న కార్యక్రమం.. ఎన్నో ప్రయ త్నాలు.. మరెన్నో ప్రయాసలు కూడా పడ్డారు.. స్థానిక పార్లమెంటు సభ్యులు.. వైసీపీ నాయకులు.. కనుమూరి రఘురామకృష్ణరాజు. పైగా.. తమ వాడే అయిన.. మన్యం వీరుడు.. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు.. ప్లాన్ చేసి.. నిధులు కూడా మంజూరు చేసిన ఎంపీ. అయితే.. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన రావడం లేదు. …
Read More »ఏపీ పుణ్యభూమి, వీరభూమి.. శ్లాఘించిన మోడీ
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు. యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా …
Read More »పార్టీని లాక్కోవటం అంత వీజీ కాదు ?
తిరుగుబాటు లేవదీసి ముఖ్యమంత్రి కుర్చీని ఉద్థవ్ థాక్రే నుండి లాగేసుకున్నంత తేలిక కాదు పార్టీని, పార్టీ గుర్తును లాగేసుకోవటం. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలకమైన శివసేనలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ నాయకత్వంలో కొందరు ఎంఎల్ఏలు థాక్రేపై తిరుగుబాటు లేవదీశారు. అనేక మలుపులు తిరిగిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు నేత షిండేయే చివరకు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నారు. ఇంతవరకు సీన్ ప్రశాంతంగానే …
Read More »అమిత్ షా చెప్పింది ఇప్పట్లో జరిగేదేనా ?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణపై చేసిన తీర్మానంలో షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇంతవరకు ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఏపీ, తమిళనాడు, …
Read More »